
ప్రముఖ తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి విజయ్‌కాంత్ భార్య ప్రేమలత విజయకాంతతో గురువారం ఫోన్‌లో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపుడుతన్న విజయ్‌కాంత్‌కు మధుమేహం తీవ్రత ఎక్కువైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుడి కాలి మూడు వేళ్లను తొలిగించారు వైద్యులు. దీంతో ఆయన ఆరోగ్యంపై డీఎండీకే వర్గాలు ఆందోళనకు లోనయ్యాయి.
చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఆందోళన చెందవద్దని డీఎండీకే కార్యాలయం మరోమారు ప్రకటన విడుదల చేసింది. విజయ్‌కాంత్ త్వరితగితిన కోలుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment