
విజయకాంత్ డిశ్చార్జ్
సాక్షి, చెన్నై: ఆస్పత్రి నుంచి డీఎండీకే అధినేత విజయకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు విశ్రాంతి అవసరం అని వైద్యులు తేల్చారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం బిజీ షెడ్యూల్‌తో డీఎండీకే అధినేత విజయకాంత్ ఉరుకులు పరుగులు తీస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. యాంజీయోగ్రాం చేయడానికి చర్యలు తీసుకున్నారు. అయితే, విజయకాంత్‌కు జరిపిన పూర్తి స్థాయి పరీక్షల అనంతరం ఆ ప్రయత్నం విరమించారు.
ఈసీజీ, ఎక్స్‌రే, స్కాన్ తదితర పరీక్షల అనంత రం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తేల్చారు. అధిక ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లేని దృష్ట్యా, ఆయన అస్వస్థతకు గురి కావడంతో స్వల్పంగా ఛాతి నొప్పి వచ్చి ఉంటుందని వైద్యులు భావించారు.విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ ఆయన్ను అదే రోజు రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఉదయాన్నే విజయకాంత్‌ను పార్టీ ఎమ్మెల్యేలు కలిసేందుకు యత్నించినా, కుటుంబీకుల అంగీకరించలేదు. అసెంబ్లీ అనంతరం కొం దరు ఎమ్మెల్యేలులు విజయకాంత్‌ను ఆయన నివాసంలో కలిసినట్టు సమాచారం.