
తమిళస్టార్ నటుడు, డీఎండీకే అధినేత మృతి పట్ల పలువురు సినీతారలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులర్పించారు. తాజాగా విజయ్‌కాంత్ మృతిపట్ల కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో విశాల్ ఏడుస్తున్న వీడియో అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది.
విశాల్ వీడియోలో మాట్లాడుతూ..' కెప్టెన్ మరణించిన విషయం ఇప్పుడే నాకు తెలిసింది. ఈ వార్త విన్నాక నా కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. కెప్టెన్‌ను కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆయన చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నా. నేను నడిగర్ సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు అండగా నిలిచారు. ఈ సమయంలో వారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. విజయ్‌కాంత్ సార్‌కు ఇదే నా కన్నీటి నివాళి' అంటూ ఏడుస్తూ పోస్ట్ చేశారు.
కాగా.. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ బుధవారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో మంగళవారం ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు చెన్నై మియాట్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment