
అన్నాడీఎంకేపై ధ్వజమెత్తిన విజయకాంత్
దిందిగల్(తమిళనాడు): అధికార అన్నాడీఎంకే పార్టీపై ప్రతిపక్ష నాయకుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఆగడాలు అధికమయ్యాయని మండిపడ్డారు. మరే పార్టీ పోటీ చేయకుండా అధికార పార్టీ అడుపడుతోందని ఆరోపించారు.
మరేయితర పార్టీ పోటీ చేయకూడదనుకుంటే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్నాడీఎంకే ప్రలోభాలు, బెదిరింపులకు దిగుతోందని ఆయన ఆరోపించారు.