రాజకీయాల్లో ఆయన నా సీనియర్‌..! | Kamal Haasan meets Vijayakanth | Sakshi
Sakshi News home page

విజయకాంత్‌తో కమల్‌హాసన్‌ భేటీ

Published Tue, Feb 20 2018 2:55 AM | Last Updated on Tue, Feb 20 2018 2:55 AM

Kamal Haasan meets Vijayakanth - Sakshi

డీఎండీకే ప్రధాన కార్యాలయంలో విజయకాంత్‌తో భేటీ అయిన కమల్‌హాసన్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ పార్టీ ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ఇటీవల పలు పార్టీల నేతలను, సహచర నటులను కలుస్తున్నారు. ఆ కోవలోనే ఆయన నటులు రజనీకాంత్, డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్‌లను ఆదివారం కలిశారు. తాజాగా, సోమవారం చెన్నైలోని కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి విజయకాంత్‌తో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ‘మీవంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడం అవసరం’ అని కమల్‌కు విజయకాంత్‌ శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీని ప్రారంభించే ముందు నేతలను కలుస్తున్నట్లే రాజకీయాల్లో తన కంటే సీనియర్‌ అయిన విజయకాంత్‌ను కలిసానని కమల్‌ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కాగా,  కమల్, రజనీ కలవడం వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని మంత్రి జయకుమార్‌ వాఖ్యానించారు.ఈ నెల 21న రామేశ్వరంలో కమల్‌ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అదే రోజు మథురైలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత, విజయకాంత్‌ ఇలా అందరూ తమ రాజకీయ తొలి అడుగును మథురై జిల్లా నుంచే ప్రారంభించడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement