
విజయకాంత్ (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : సినీరంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి తనదైన ముద్ర వేసిన నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో కెప్టెన్ సతమతమవుతున్నారు. ఇందుకోసం పలుమార్లు శస్త్రచికిత్సలు కూడా ఆయన చేయించుకున్నారు.
తాజాగా అనారోగ్యానికి గురైన డీఎమ్‌డీకే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అయ్యారు. చికిత్స నిమిత్తం అమెరికా వెళ్తున్నట్లు ట్విట్టర్‌లో విజయ్‌కాంత్ ట్వీట్ చేశారు. ఈ నెల 7వ తేదీన వెళ్తున్నానని, వీడ్కోలు చెప్పేందుకు ఎయిర్‌పోర్టుకు రావొద్దని అభిమానులను కోరారు.
— Vijayakant (@iVijayakant) July 5, 2018
Comments
Please login to add a commentAdd a comment