
న్యూఢిల్లీ: వైద్యం కోసం అమెరికాకు వెళ్లిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శనివారం రాత్రి భారత్‌కు తిరిగి వచ్చారు. జైట్లీ గైర్హాజరీతో తాత్కాలిక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పీయూశ్ గోయల్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. జైట్లీ రాకపై సంతోషం వ్యక్తం చేసిన గోయల్..బడ్జెట్ సమర్పణలో తనకు మద్దతు, మార్గదర్శనం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మృదుకణజాల కేన్సర్‌కు చికిత్స చేయించుకోవడానికి జైట్లీ గత నెలలో న్యూయార్క్ వెళ్లారు.