నిరాశలో డీఎండీకే శ్రేణులు | DMDK a series of desperation! | Sakshi
Sakshi News home page

నిరాశలో డీఎండీకే శ్రేణులు

Published Mon, Mar 14 2016 4:14 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

నిరాశలో డీఎండీకే శ్రేణులు

నిరాశలో డీఎండీకే శ్రేణులు

పళ్లిపట్టు: డీఎంకేతో దోస్తి కట్టడం ఖాయమని డీఎండీకే కార్యకర్తలు ఆశతో ఎదురుచూసిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ఒంటరి పోరు ప్రకటన పార్టీ క్యాడర్‌ను  నిరాశలో ముంచింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో  పొత్తు ఏర్పాటు చేసి అన్నాడీఎంకేను అధికారానికి దూరం చేస్తామని సవాల్ పలుకుతూ వచ్చారు. ఈ క్రమంలో  కాంచీపురంలో నిర్వహించిన    మహానాడులో పొత్తుపై ప్రకటిస్తారని  ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఆ మహానాడులో  మాట్లాడిన విజయకాంత్  కింగ్ కావాలా కింగ్ మేకర్ కావాలా అనే ప్రశ్న లేవనెత్తి  కూటమి విషయంలో  సస్పెన్స్‌లో పెట్టారు.

అనంతరం  పార్టీ తరఫున పోటీ చేసేందుకు నామినేషన్ చేసిన శ్రేణుల నుంచి విజయకాంత్ లేవనెత్తిన ప్రశ్నలకు తమ పొత్తు నిర్ణయాన్ని 90 శాతం పార్టీ జ్లిలా కార్యదర్శులు, యూనియన్ కార్యదర్శులు, అధికార ప్రతనిధులు, రాష్ట్ర స్థాయి  నిర్వాహకులు సైతం అన్నాడీఎంకేను ఓడించేందుకు డీఎంకేతో జతకట్టాలని  తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎంకేతో డీఎండీకే  పొత్తు ఖాయమని మీడియాలో వచ్చిన వార్తలతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా  కనిపించారు. ఎన్నికలకు సైతం సిద్ధమవుతూ వచ్చారు.

ఈ క్రమంలో చెన్నైలో నిర్వహించిన మహిళా దినోత్సవ డీఎండీకే  బహిరంగ సభలో  పాల్గొన్న  విజయకాంత్ మాట్లాడుతూ డీఎండీకే ఓంటరిగా పోటీ చేస్తుందని కుండ బద్దలు కొట్టడంతో  పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా  షాక్‌కు గురైయ్యారు. విజయకాంత్ నిర్ణయం పట్ల డీఎండీకే శ్రేణుల దిగ్భ్రాంతి విజయకాంత్ డీఎండీకే ను 1996 లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలు, మహానాడులో, ఎన్నికల్లో  పోటి చేసి పార్టీ కోసం  తమ ఆస్తులు సైతం కోల్పోయాం. 2006 లో అన్నాడీఎంకేతో జతకట్టి విజయం సాధించినా పొత్తు మూడు నెలలు కూడా కాకముందే అధికార పార్టీతో విభేదించడంతో తీవ్రంగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

2014 లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిలో చేరినా విజయం సాధించేకోలేని పరిస్థితి. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహానాడులు, సమావేశాలు, వివిధ వేడుకలు, పార్టీకి నిధులు అందజేశాం. ప్రజా వ్యతిరేక అన్నాడీఎంకే ప్రభుత్వానికి అంతం పలికేందుకు  పొత్తు పెట్టడం ఖాయమని చెప్పుకుంటూ రావడంతో నమ్మకంతో అప్పులు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాం.

అయితే  పార్టీ క్యాడర్‌కు ఏ మాత్రం ఇష్టం లేని విధంగా ఒంటరి పోరుతో తమ బతుకులు ఇక బజారు బతుకులు కాక తప్పదు. అన్నాడీఎంకేను  ఇంటికి పంపాలనే లక్ష్యంతో వ్యవహరిస్తూ వచ్చిన కెప్టెన్ ఎన్నికల నాటికి ఒంటరి పోరుతో ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి భవిష్యత్ ఉండాలంటే కచ్చితంగా క్యాడర్  ఆశయం ప్రకారం డీఎంకేతో పొత్తు పెట్టాలన్నదే ఆ పార్టీలోని ప్రతి ఒక్కరి ఆశయంగా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement