
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత, తమిళ ప్రముఖ నటుడు విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. అయితే సాధారణ హెల్త్ చెకప్ కోసమే విజయకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. శనివారం ఉదయం డిశ్చార్జ్ అవుతారని పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.