ప్రజా సంక్షేమమే ధ్యేయం | aim is to public welfare | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే ధ్యేయం

Published Sun, Nov 20 2016 11:57 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

aim is to public welfare

- కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, 
 
సిమెంట్‌నగర్‌ (బేతంచెర్ల) : ప్రజాసంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అచ్చెం నాయుడు అన్నారు. ఆదివారం మండలంలోని  కొలుములపల్లె, బుగ్గానిపల్లె, సిమెంట్‌నగర్‌ గ్రామాల్లో  టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్, మండల నాయకులు బుగ్గన సంజీవరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జన చైతన్య యాత్ర  నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి జన చైతన్య యాత్రలు నిర్వహిస్తుట్లు తెలిపారు.  అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ  శిల్పా చక్రపాణిరెడ్డి , జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌, జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం చైర్మన్‌  నాగేశ్వరరావు యాదవ్,  జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి, జిల్లా మహిళా టీడీపీ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి, సిమెంట్‌ నగర్‌ గ్రామ సర్పంచ్‌ లక్ష్మీదేవి, గౌరి రామిరెడ్డి, మద్దిలేటిరెడ్డి, భీమేశ్వర్‌రెడ్డి, జేసీ వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement