ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌ సీపీ ధ్యేయం | Public welfare is the YSRCP goal | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌ సీపీ ధ్యేయం

Published Mon, May 7 2018 10:40 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

Public welfare is the YSRCP goal - Sakshi

విజయనగరం మున్సిపాలిటీ: ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయమని, ఇందుకోసం పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాట పటిమే సాక్షాత్కరంగా నిలుస్తుందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన 35 మంది యువత పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, ఐదవ వార్డు అధ్యక్షుడు ఇప్పిలి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో పార్టీలో ఆదివారం చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కోలగట్ల, పార్టీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్‌ వారందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ నాలుగేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారు అవినీతి, అక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని మండిపడ్డారు. 

ఐదు కోట్ల మంది ప్రజల  ఆకాంక్ష, హక్కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద వారి స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారన్నారు. పార్టీలో చేరిన వారంతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయటం ద్వారా  రానున్న ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో జె.రమణమూర్తి, జె.గురువులు, బి.గంగరాజు, జి.జైరామ్, ఎం.ధనరాజ్‌ తదితరులు  ఉండగా... కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయనగరం నగర కన్వీనర్‌ ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన.శ్రీనివాసరావు, సీనియర్‌ కౌన్సిలర్‌ ఎస్‌వివి.రాజేష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు, పార్టీ నాయకులు బొద్దాన అప్పారావు, బోడసింగి ఈశ్వరరావు, మార్రోజు శ్రీనివాసరావు, రెడ్డి గురుమూర్తి, పూసర్ల చిన్ని, 5వ వార్డు నాయకులు డి.పద్మావతి, ఇప్పిలి త్రినా«ధ్, జె.కామేష్, బి.భాస్కరరావు, సింహాద్రి, ప్రసాదరావు, ఆడారి శ్రీను, పి.కృష్ణ, చందక పైడిరాజు, ఇప్పలి శ్రీను, పిట్ట శ్రీను కన్ని కళ్యాన్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement