ఫ్లెక్సీ.. పైత్యం | Flexi .. bilious in Political parties | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీ.. పైత్యం

Published Sat, Jan 3 2015 2:47 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM

Flexi .. bilious in Political parties

రౌతులపూడి : రాజకీయ పార్టీలు, వర్గాలకతీతంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన మండల పరిషత్ కార్యాలయంపై టీడీపీ ఫ్లెక్సీ ఉండడం పలు విమర్శలకు తావిస్తోంది. నూతన సంవత్సరం దినోత్సవం సందర్భంగా అధికార తెలుగు దేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు  పర్వత చిట్టిబాబు, ఎంపీపీ ఇటంశెట్టి సూర్యభాస్కరరావు, టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని మండల పరిషత్ కార్యాలయంపై ఏర్పాటు చేశారు.

దీంతో ఇది టీడీపీ కార్యాలయమా, ప్రభుత్వ కార్యాలయమా అని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆశ్చర్యపోయారు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి చర్యలను ఖండించి ప్రభుత్వ కార్యాలయాలపై రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధించాలని పలువురు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement