ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | government target of public welfare | Sakshi
Sakshi News home page

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Published Sun, Jan 12 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

government target of public welfare

 ఏన్కూరు, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఏన్కూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వైరా నియోజకవర్గంలోని గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాలకు చెందిన 1250 మంది నిరుపేద గిరిజన రైతులకు 2150 ఎకరాలను పంపిణీ చేశామని అన్నారు.

 రానున్న రోజుల్లో భూమి లేని గిరిజన రైతులను గుర్తించి పట్టాలు పంపిణీ చేస్తామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూ పంపిణీ ప్రవేశపెట్టారని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకాన్ని ప్రవేశపెట్టలేదని, అది కేవలం మనరాష్ట్రంలో మాత్రమే ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే బాణోత్ చంద్రావ తి, జేసీ సురేంద్రమోహన్, కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమా ర్, జూలూరుపాడు, ఏన్కూరు, కారేపల్లి తహశీల్దార్లు తిరుమలాచారి, నాగమల్లేశ్వరరావు, రజని, అధికారులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement