land distribution program
-
చెరగని ముద్ర
నేడు మహానేత వైఎస్ఆర్ వర్ధంతి ♦ జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ♦ పేదల గుండెల్లో సుస్థిరస్థానం ♦ {పతిష్టాత్మక పథకాలు ఇక్కడినుంచే ప్రారంభం సమసమాజ నిర్మాణమే ఆయన ధ్యేయం.. సకలజనుల సౌభాగ్యమే ఆయన లక్ష్యం.. ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలుచేసి పేదల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆ మహానేత కురిపించిన వరాలు జిల్లా అభివృద్ధికి నాంది పలికాయి. ఆరోగ్యశ్రీ ఎంతోమందికి ప్రాణం పోసింది. కుయ్..కుయ్ అంటూ పరుగులుతీసే 108అంబులెన్స్ మరెందరో అభాగ్యుల ప్రాణాలు కాపాడింది. పేదల సొంతింటి కలనెరవేరింది. జలయజ్ఞంతో కృష్ణాజలాలు కరువు నేలపై గలగల పారాయి.. మహబూబ్‌నగర్ అర్బన్ : పాలమూరు జిల్లాపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేకమైన అభిమానం చూపారు. జిల్లానుంచే ప్రారంభించిన ఇంది రమ్మ ఇళ్లు, రూ.2కే కిలోబియ్యం, పేదలకు భూపంపిణీ పథకాలు ఎంతో లబ్ధిచేకూర్చాయి. అందుకే ఆయన పేదల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నా రు. సీఎం హోదాలో ఆయన అలంపూర్ ని యోజకవర్గంలో మూడుసార్లు పర్యటించి వరాలజల్లు కురిపించారు. మొదటిసారిగా ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని 2006లో అలంపూర్ పట్టణంలో ప్రారంభించారు. అలంపూర్- ర్యాలంపాడు గ్రామాల మధ్య తుంగభద్ర నదిపై రూ.35కోట్ల వ్యయంతో బ్రిడ్జిని మంజూరుచేసి శంకుస్థాపన చేశారు. అలాగే వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదుసార్లు పర్యటించారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా భూపంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడినుంచే ప్రారంభించారు. జలయజ్ఞ ప్రదాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా రూ.1478కోట్లతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 25వేల ఎకరాల నుంచి రెండులక్షల ఎకరాలకు పెంచడంతో పాటు, అదేస్థాయిలో నిధులు విడుదల చేసిన వైఎస్ జలయజ్ఞ ప్రదాతగా వెలుగొందారు. ప్రతిపక్షనేత హోదాలో గద్వాల ప్రాంతంలో పర్యటించి పెండింగ్ ప్రాజెక్టుల పునాది రాళ్ల వద్ద మొక్కలు నాటి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత నగరబాటతో పట్టణాభివృద్ధికి ఇక్కడినుంచే శ్రీకారం చుట్టారు. అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినతరువాత సీఎం హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి కొల్లాపూర్‌కు వచ్చారు. ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,995కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సింగోటం శ్రీవారిసముద్రాన్ని మినీరిజర్వాయర్‌గా మారుస్తామని ప్రకటించారు. అక్కడే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరును మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంగా మారుస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. 2007 జనవరి నెలలో మంచాలకట్ట వద్ద కృష్ణానదిలో పుట్టిమునిగి 61మంది మృతిచెందడంతో బాధిత కుటుంబాలను పరామర్శించారు. రూ.110కోట్ల వ్యయంతో సోమశిల- సిద్ధేశ్వరం వంతెన, రూ.85కోట్ల వ్యయంతో కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు డబుల్‌లైన్ రహదారి పనులకోసం పైలాన్లను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.2కే బియ్యం పథకాన్ని జడ్చర్లలో ప్రారంభి పేదల అభిమానాన్ని చూరగొన్నారు. నియోజకవర్గ తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.55కోట్ల వ్యయంతో రామన్‌పాడు తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. పీయూ అభివృద్ధికి పునాది పాలమూరు యూనివర్శిటీ: వెనుకబడిన పాలమూరు జిల్లాకు ఉన్నత చదువుల కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవ చూపించి జిల్లాకు యూనివర్శిటీని మంజూరుచేశారు. ఉస్మానియా పీజీ సెంటర్ స్థాయి పెంచుతూ 2008లో జిల్లాకు పాలమూరు యూనివర్శి టీ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. 2008 ఆగష్టు 28న అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులమీదుగా పీయూ ప్రా రంభానికి శిలాఫలకం వేశారు. ఆ తర్వాత పీయూకు వీసీ గోపాల్‌రెడ్డిని నియమించి త్వరగా అభివృద్ధి పనులు చేయాలని వీసీని ఆయన ప్రో త్సహించారు. మొదట ఐదుకోర్సులతో ప్రారంభించిన పీయూ ప్రస్తుతం 17కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. పీయూ లో అన్ని కోర్సుల్లో కలిపి 2500 మంది విద్యార్థులు చదువుతున్నారు. -
ఎమ్మెల్యేపై ఆరోపణలు అవాస్తవం
ఎవరి భూములూ కబ్జా చేయలేదు అప్రతిష్టపాలు చేసేందుకే ఆరోపణలు ధైర్యముంటే ఎర్రాపహడ్‌కు వచ్చి నిరూపించండి అఖిలపక్షానికి టీఆర్ఎస్ సవాల్ కామారెడ్డి : నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏనుగు రవీందర్‌రెడ్డిని ఎదుర్కొనలేక, ఓటమి చెందినవారు ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఎర్రాపహడ్‌కు వచ్చి ఎవరి భూములు ఆక్రమణకు గురయ్యాయో నిరూపించాలని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు. శుక్రవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదాశివనగర్, గాంధారి జడ్పీటీసీ సభ్యులు రాజేశ్వర్రావ్, తానాజీరావ్, ఎల్లారెడ్డి ఎంపీపీ నక్క గంగాధర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నవారు ఎర్రాపహడ్‌లో ఆక్రమణలను రుజువు చేస్తే తామంతా పదవులకు రాజీనామా చేస్తామని, గజం ఆక్రమించినట్టు తేలితే గజానికి ఎకరం భూమి ఇప్పిస్తామని స్పష్టం చేశారు. భూములను కొలవడానికి అధికారులు వ చ్చినపుడు అఖిలపక్ష నేతలంతా వచ్చి ప్రత్యక్షంగా చూసి ఎక్కడ ఆక్రమణకు గురయ్యూయో చూపించాలన్నారు. ఎన్నికలప్పుడే కనిపించే నాయకులు ఎమ్మెల్యేను ఎదుర్కొనలేక భూ ఆక్రమణలంటూ దళితులను మో సం చేస్తున్నారని ఆరోపించారు. అఖిల పక్ష నేతలు ఎల్లారెడ్డిలోనో, తాడ్వాయిలోనో, కామారెడ్డిలోనో మాట్లాడకుండా ఎర్రాపహడ్‌లో గ్రామ సభకు సిద్దం కావాలని అన్నారు. తేదీ ప్రకటిస్తే ప్రజల సమక్షంలో మాట్లాడి, ప్రజల సమక్షంలో కొలతలు వేయించేందుకు సిద్ధమని ప్రకటించారు. రవీందర్‌రెడ్డి దళితుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, భూపంపిణీ కార్యక్రమంలో జిల్లాలో అన్ని మండలాల కంటే ఎక్కువగా తాడ్వాయి మండల దళితులకే ఇప్పించారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అమాయక ప్రజలను మోసం చేయడం మంచిది కాదన్నారు. ఎల్లారెడ్డిలో అఖిలపక్ష సమావేశానికి అనుమతి తీసుకోలేదని పోలీసులు అరెస్టు చేస్తే, ఎమ్మెల్యేనే చేయించాడంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఎమ్మెల్యే భూములను సర్వే చేసిన అధికారులు అక్కడ దళితుల భూములు లేవని ప్రకటించారని గుర్తుచేశారు. సమావేశంలో డీసీసీబీ డెరైక్టర్ సంపత్‌గౌడ్, ఎంపీపీలు బసంత, విజయ, జడ్పీటీసీలు కాశినారాయణ, సామెల్, సావిత్రి, టీఆర్ఎస్ నాయకులు నారెడ్డి లింగారెడ్డి, గడ్డం రాంరెడ్డి, మహేందర్‌రెడ్డి, ముదాం సాయిలు, శివాజీరావ్, భూంరెడ్డి, సాయిరెడ్డి, సంతోష్‌రెడ్డి, భూమాగౌడ్ పాల్గొన్నారు. -
కూలీలు రైతులుగా మారాలి
తీసుకున్న భూముల్లో పంటలు పండించాలి ఆకస్మికంగా తనిఖీ చేస్తా... సాగును పరిశీలిస్తా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్ : కూలీలను రైతులుగా మార్చే బృహత్తర ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగానే దళితులకు భూ పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 270 మంది దళితులకు రూ.30 కోట్ల విలువైన 659 ఎకరాలను పంపిణీ చేశామన్నారు. సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌కు చెందిన 13 మంది దళితులకు రూ.1.42 కోట్ల విలువ చేసే 38 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూమి పత్రాలను శుక్రవారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పట్టాలు పొందిన దళితులు ఆ భూములను సద్వినియోగ పర్చుకోవాలన్నారు. తాను భవిష్యత్తులో ఆకస్మికంగా తనిఖీ చేసి సాగు భూముల స్థితిగతులను పరిశీలిస్తానన్నారు. పంటలు పండించి రైతులుగా నిలదొక్కుకోవాలని సూచించారు. భూ పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుందన్నారు. గత పాలకులు సాగుకు యోగ్యం కాని భూములను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నట్టు విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం సాగుకు యోగ్యంగా ఉన్న భూములను పంపిణీ చేయడమే కాకుండా తొలి పంటకు రుణాలు అందిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 3.59 లక్షల మందికి ఆసరా పింఛన్లు పేద వాడికి కడుపు నిండా అన్నం పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆ దిశగా గత 11 ఏళ్లుగా సిద్దిపేట ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నానని.. ఆ పథకాలు అర్హులకు అందినప్పుడే తనకు సంతోషం కలుగుతుందన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని ఆసరా లబ్ధిదారులకు మలివిడత పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉండాలన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 3.59 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని అర్హత కలిగిన చివరి వ్యక్తి వరకు కూడా పింఛన్లు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండరాదన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఉండాలని కోరుకోవడం అర్థరహితమన్నారు. కోనసీమను తలపించేలా సిద్దిపేట నంగునూరు: సిద్దిపేట ప్రాంతాన్ని కోనసీమను తలపించేలా తీర్చిదిద్దుతామని రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంత పంట పొలాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. శుక్రవారం నంగునూరు మండలం పాలమాకులలో భూపంపిణీలో భాగంగా రాంపూర్, పాలమాకుల గ్రామాల లబ్ధిదారులకు పట్టా పాస్‌పుస్తకాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... తపాసులపల్లి దాక వచ్చిన నీళ్లను తడ్కపల్లికి తెచ్చి కాలువల ద్వారా సాగు నీరందిస్తామని హామీ ఇచ్చారు. తడ్కపల్లి వద్ద ఆరు వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి చేయడం ద్వారా సిద్దిపేటతోపాటు హుస్నాబాద్, కోహెడ మండలాల్లోని ప్రతి ఎకరా భూమిని నీళ్లతో తడుపుతామని చెప్పారు. దేవాదుల ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని ఎంత కష్టమైనా ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతన్నకు సాగు నీరందిస్తామన్నారు. ఇంటి నుంచే ఎరువుల కొనుగోలు.. రైతులు ఇంటి నుంచే ఎరువులు, విత్తనాలు కొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ‘మీ-సేవ’ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇందుకుగాను మూడు గ్రామాలకో పాయింట్‌ను ఏర్పాటు చేసి నేరుగా రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి, నాగలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు శివశంకర్, లావణ్య, దువ్వల మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్లు సోమిరెడ్డి, రమేశ్‌గౌడ్, ఓఎస్డీ బాల్‌రాజు, ఎంపీడీఓ ప్రభాకర్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో భూ పంపిణీ ఓ బూటకం
మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో భూ పంపిణీ కార్యక్రమం ఒక బూటకంగా మారిందని, మాయమాటలతో దళితులను మభ్యపెడుతున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండుమడుగు నర్సింహ, జాన్‌వెస్లీ అన్నారు. మంగళవారం స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్హాల్లో వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీఎం పదవి దళితుడికి ఇస్తానన్న కేసీఆర్.. ఆయనే సీఎం సీటులో కూర్చున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేస్తానని మేనిఫెస్టోలో పొందుపరిచి ఆ డబ్బులను ఇతర సంక్షేమ కార్యక్రమాలకు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. దళితులకు మూడు ఎకరాలు అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు వ్యవసాయాధికారిత దళితులకు మాత్రమే మూడు ఎకరాలు పంపిణీ చేస్తామని మెలికపెట్టడం శోచనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల ద్వారానే భూమిని కొనుగోలు చేసి దళితులకు ఇస్తామనడం సరైంది కాదన్నారు. కేం ద్రంలోని మోదీ ప్రభుత్వం మతోన్మాదాన్ని సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. సమావేశంలో డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరశురాములు, టి.స్కైలాబ్‌బాబు, కొడిరెక్క మల్లయ్య తదితరులున్నారు. -
బడ్జెట్లో దళితకు అన్యాయం
మెదక్ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో దళిత, బలహీన వర్గాలకు పూర్తిగా అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్అండ్ బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాం తంలో 50 శాతం ఉన్న బలహీన వర్గాలకు మొక్కుబడి నిధులు కేటాయించ డం దారుణమన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ కార్యక్రమం భూస్వాములను పెంచి పోషించడానికేనన్నారు. భూ స్వాము ల దగ్గరున్న భూమిని అధిక ధరకు కొనుగోలు చేసి దళితులకు భూమి ఇ స్తామని చెప్పడం హాస్యాస్పదమన్నా రు. సమావేశంలో రాజు, రాములు, బాల్‌రాజ్, కిషన్ పాల్గొన్నారు. హామీలు విస్మరిస్తున్నారు హత్నూర : ఎస్సీ వర్గీకరణకు తోడ్పా టు నందిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే విస్మరిస్తున్నారని మందకృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని దౌల్తాబాద్ శివారులోని ఎస్ఎస్ఆర్ గార్డెన్లో నర్సాపూర్ తాలూకా స్థాయి ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల స మావేశం ఆయన పాల్గొని మాట్లాడా రు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా దళితులకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి కొండూరి రాజ య్య ఎల్లయ్య, నర్సింలు, లక్ష్మయ్య, మండల నాయకులు ప్రసాద్, మొగులయ్య, లింగయ్య, పెంటయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణతో ఒరిగిందే మీ లేదు తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ చేగుంట : మందకృష్ణతో మాదిగలకు ఒరిగిందేమీ లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు యాతాకుల భాస్కర్ అన్నారు. శుక్రవారం చేగుంటలో సిద్దిపేట డివిజన్ స్థాయి ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్న మాట్లాడారు. మందకృష్ణ 20 ఏళ్లుగా మాదిగల పక్షాన పోరాటం చేస్తున్నా.. వారి సంక్షేమం కోసం ఏ ప్రభుత్వమూ చర్యలు తీసుకోలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈనెల 10న హైదరాబాద్‌లో జరుగుతున్న మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశం లో శివరాజ్, రాంచంద్రం, రత్నయ్యలు పాల్గొన్నారు. -
పంపిణీ సరే...పట్టాలేవీ?
భూముల రిజిస్ట్రేషన్లలో ఎడతెగని జాప్యం - తొమ్మిది నియోజకవర్గాల్లోనే దళితులకు భూపంపిణీ అమలు - ప్రైవేటు భూముల కొనుగోలుపైనే తర్జనభర్జన - చేతులెత్తేసిన రెవెన్యూ అధికారులు నీలగిరి : కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమం జిల్లాలో మందగించింది. పంద్రాగస్టునాడు శ్రీకారం చుట్టిన ఈ పథకానికి ఆది నుంచి అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. మొదట్లో మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసి భూమిలేని దళితులకు మూడెకరాలు పంపిణీ చేయాలని భావించారు. అది ఆచరణ సాధ్యంకాకపోవడంతో నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి అర్హులైన లబ్ధిదారులకు భూపంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ పథకం అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యల దృష్ట్యా కేవలం 9 నియోజకవర్గాలకే పరిమితం చేశారు. మునుగోడు, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో భూములు కొరతతో లబ్ధిదారులను ఎంపిక చేసి పక్కన పెట్టేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నప్పటికీ భూసమస్య వల్లనే అందరికి ఈ పథకం వర్తింపచేయలేకపోయారు. భూముల కొనుగోలు భారం పన్నెండు నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో దళిత కుటుంబాలు 1489 మంది ఉండగా...వీరిలో అసలు భూమి లేని నిరుపేద కుటుంబాలు, పథకానికి అర్హులైన 260 మందిని గుర్తించారు. దీంట్లో 102 కుటుంబాలకు 247 ఎకరాలు భూ పంపిణీ చేశారు. అయితే మొత్తం పంపిణీ చేసిన దాంట్లో ప్రభుత్వ భూమి కేవలం 18 ఎకరాలకు మించి లేదు. మిగతా 229 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి ఇచ్చిందే. ప్రభుత్వ నిర్ణయించిన రేటు ప్రకారం ఎకరాకు రూ.3 లక్షల చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. కానీ ఇంతవరకు భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం చేయించలేదు. కేవలం పంద్రాగస్టు రోజున మంజూరు పత్రాలు ఇచ్చారు. ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల లభ్యతను బట్టి లబ్ధిదారులకు పత్రాలు ఇచ్చారు. చాలా చోట్ల భూములు ఉన్న గ్రామాల్లో లబ్ధిదారులు ఉండకపోవడం, లబ్ధిదారులు ఉన్న గ్రామాల్లో భూములు లభించకపోవడం వంటి సమస్యలు అధికారులకు ప్రధాన అడ్డంకిగా మారాయి. ప్రైవేటు భూము లు అమ్మేందుకు భూయజమానులు ముందుకు వస్తున్నా, ప్రభుత్వం నిర్ణయించిన ధరను అమ్మేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి ఈ పథకాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారన్నది వేచిచూడాల్సిందే. వచ్చేవారంలో పూర్తిచేస్తాం : శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రెవెన్యూ యంత్రాంగం సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీలో బిజీగా ఉంది. వచ్చే వారంలో లబ్ధిదారులకు భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తాం. చాలా చోట్ల భూమి కొరత ఉంది. పట్టాదారులు అమ్మేందుకు ముందుకు వస్తు న్నా, మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధర చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ ప్రభుత్వ ఆదేశానుసారం పథకాన్ని అమలు చేయడానికి కృషి చేస్తాం. -
అభివృద్ధే నినాదం
‘రాష్ట్ర అవతరణతో మన బాధ్యత మరింత పెరిగింది. సుదీర్ఘ పోరాటాలు.. అమరుల త్యాగాల ఫలితంగా 29వ రాష్ట్రంగా సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముంది. కలిసికట్టుగా.. అభివృద్ధే నినాదంగా ముందుకుసాగాల్సిన సమయం ఆసన్నమైంది.. దీనికి ప్రతిఒక్కరం కలిసివద్దాం.. బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుదాం..’ - ఈటెల రాజేందర్,రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ►బంగారు తెలంగాణకు పునరంకితమవుదాం ►దసరా నుంచి కొత్త పింఛన్లు ►పటిష్టంగా పోలీసు వ్యవస్థ ►కాకతీయ కెనాల్ సామర్థ్యాన్ని పెంచుతాం ►గల్ఫ్ బాధితులకు కేరళ తరహా ప్యాకేజీ ►సమగ్రంగా కుటుంబ సర్వే ►స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఈటెల ముకరంపుర : రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారి జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లాకు వన్నెతెచ్చాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా వందనం చేసి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 200 మందికి ప్రశంసాపత్రాలు అందించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. దళితులకు పట్టాలు అందించి మొదటివిడత భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. రాష్ట్రం గ్రామ స్థాయిలో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాకు రూ.5.424కోట్లతో 7,444 పనులను గుర్తించాం. వాటికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం. నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నాం. నియోజకవర్గానికో గ్రామాన్ని ఎంపిక చేసి అందులో గుర్తించిన లబ్ధిదారులకు భూమి ఇస్తాం. ఇందుకు ప్రభుత్వం రూ.ఐదు కోట్లు విడుదల చేసింది. రుణమాఫీతో ఐదు లక్షల మందికి లబ్ధి పంటరుణాలు మాఫీ చేయడం ద్వారా జిల్లాలో ఐదు లక్షలమందికి లబ్ధి చేకూరనుంది. దసరా నుంచి కొత్త పింఛన్లు ఇస్తాం. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ అందిస్తాం. దళిత, గిరిజన కుటుంబాల్లో పుట్టిన అమ్మాయిల పెళ్లి ఖర్చులకు ‘కళ్యాణలక్ష్మి’ పథకం కింద రూ.50 వేల చొప్పున అందిస్తాం. గిరిజనతండాలను, గూడాలను పంచాయతీలుగా మారుస్తాం. అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తాం. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలకు రవాణా పన్నును రద్దు చేశాం. గల్ఫ్ బాధితులకు కేరళ తరహా ప్యాకేజీ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి తిరిగొచ్చిన వారిని ఆదుకునేందుకు కేరళ తరహా ప్యాకేజీ అమలు చేస్తాం. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కోసం కమిషన్ ఏర్పాటు చేశాం. మైనార్టీ కమిషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. ఆర్థిక స్థోమత లేక విద్యార్థులు చదువులకు దూరం కావద్దనే లక్ష్యంతో ఫాస్ట్ పథకాన్ని తీసుకొచ్చాం. కరీంనగర్ చుట్టూ రింగురోడ్డు కరీంనగర్ నగరం చుట్టూ రింగురోడ్డు, నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేస్తాం. జిల్లా పోలీస్ విభాగానికి అత్యాధునిక వాహనాలను అందించి వ్యవస్థను పటిష్టం చేస్తాం. రామగుండంలో ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నాం. సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో మెడికల్ కాలేజీ, అనుబంధంగా ఆధునాత ఆసుపత్రిని నిర్మిస్తాం. అక్కడే మైనింగ్ పాలిటెక్నిక్ ఏర్పాటు, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం.జిల్లాకేంద్ర ఆసుపత్రిని నిమ్స్‌స్థాయిలో అభివృద్ధి చేస్తాం. మంథని ఆసుపత్రిని వంద పడకలు, హుస్నాబాద్ ఆసుపత్రిని 50 పడకల స్థాయికి పెంచుతాం. అన్ని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించాం. కాకతీయ కెనాల్ సామర్థ్యం పెంచుతాం కాకతీయ కెనాల్ నీటి సామర్థ్యాన్ని 12వేల నుంచి 14 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు మధ్య మరో జలాశయం నిర్మిస్తాం. రాయికల్- బోర్నపల్లి వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మిస్తాం. ఏడు కొత్త వ్యవసాయ మార్కెట్లు ప్రారంభిస్తాం. బతుకమ్మ నిమజ్జనం కోసం మానకొండూర్ చెరువును అభివృద్ధి చేస్తాం. కొండగట్టును ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు 300 ఎకరాల స్థలాన్ని గుర్తిస్తాం. హుజురాబాద్‌ను కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేసి ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాం. రామగుండం పట్టణానికి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తాగునీరందిస్తాం. ఇంటి సర్వే ముఖ్యం ఈ నెల 19న నిర్వహించనున్న ఇంటింటి సర్వే చాలా ముఖ్యమైనది. అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందించేందుకు ఈ సర్వే దోహదపడుతుంది. ఆరోజు సెలవు ప్రకటించినందున ప్రజలు ఇంటివద్దనే ఉండి ఎన్యుమరేటర్లకు సమాచారం అందించాలి. ప్రాజెక్టుల పూర్తికి చర్యలు అసంపూర్తిగా ఉన్న మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేస్తాం. గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి చేసి జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తాం. అదే సమయంలో తాగునీటికి కొరత లేకుండా చూస్తాం. తాగునీటి సమస్య పరిష్కారానికి అన్ని పథకాలను సమన్వయం చేసి 160 టీఎంసీలతో గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. యంత్ర పరికరాలకు సబ్సిడీ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందించేందుకు జిల్లాకు రూ.18.60 కోట్ల మంజూరు చేశాం. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు బిందు, స్ప్రింక్లర్ల సేద్యానికి ప్రాధాన్యత నివ్వాలి. ఈ ఏడాది జిల్లాలో 3500 హెక్టార్లలో బిందు సేద్యం, 1208 హెక్టార్లలో తుంపర్ల సేద్యం లక్ష్యంగా పెట్టుకున్నాం. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, బొడిగే శోభ, కొప్పుల ఈశ్వర్, చెన్నమనేని రమేశ్‌బాబు, పుట్ట మధు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్, ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఐజీ నాయక్, ఎస్పీ శివకుమార్ , అదనపు ఎస్పీ జనార్దన్, డీఎస్పీ రవీందర్, ఏజేసీ నంబయ్య, డీఆర్వో వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
రేపు భూపంపిణీ
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమం ఆగస్టు 15న జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీ చేయనున్న భూములను గుర్తించారు. లబ్ధిదారులకు ప్రాథమిక స్థాయిలో హక్కు పత్రాలు ఇచ్చి.. తర్వాత పూర్తి స్థాయి రికార్డు డాక్యుమెంట్లు ఇవ్వాలా... లేక అదే రోజు పూర్తి స్థాయిలో పత్రాలు ఇవ్వాలా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. రెవెన్యూ పరంగా ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేలా వీటి విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆగస్టు 15న భూముల పంపిణీకి సంబంధించి జిల్లాలో 64 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిసింది. వీరిలో ఐదుగురు మహిళలకు హైదరాబాద్‌లోని గోల్కొండలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేతుల మీదుగా భూముల పత్రాలు ఇవ్వనున్నారు. మరో ఐదుగురు మహిళలకు జిల్లా కేంద్రంలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, జిల్లా కలెక్టర్ అందజేయనున్నారు. మిగిలిన వారికి ఆయా నియోజకవర్గాల్లో జరగనున్న కార్యక్రమాల్లో భూముల పంపిణీ పత్రాలు ఇవ్వనున్నారు. పూర్తిగా భూమి లేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాలు, ఎకరం ఉంటే రెండు ఎకరాలు, రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరం చొప్పున ప్రభుత్వం భూములు పంపిణీ చేయనుంది. నర్సంపేట నియోజకవర్గంలో 27 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆగస్టు 15న పంపిణీ చేయనున్న భూముల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాకు రూ.5 కోట్లను విడుదల చేసింది. భూముల కొనుగోలు కోసం రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేసే యోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. పూర్తిగా సాగుకు యోగ్యంగా ఉండే భూములనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసే భూముల విషయంలో పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. భూగర్భ జలాల పరిస్థితి, వ్యవసాయ పంటలకు అనువుగా ఉన్నా యా, భూముల రకాలు వంటి అంశాలతోపాటు రెవెన్యూ పరంగా ఉండే సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అధికార వర్గాల సమచారం ప్రకారం జిల్లాలో భూములు పంపిణీ చేయనున్న పది నియోజకవర్గాల్లోని గ్రామాలు ఇవీ... స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ధర్మసాగర్ మండలం పీసర గ్రామంలో భూ పంపిణీ పత్రాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో మొగుళ్లపల్లి మండలం పిడిసిల్లలో భూములు పంపిణీ చేయనున్నారు. పంపిణీకి అవసరమైన భూములను ఇక్కడ సేకరించే పక్రియ చివరి దశలో ఉంది. జనగామ నియోజకవర్గంలో నర్మెట మండలం అమ్మాపూర్‌లో దళిత మహిళలకు భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడ అవసరమైన భూములను కొనుగోలు చేస్తున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో గూడూరు మండలం పొనుగోడులో భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడ ఉన్న భూములను గుర్తించి పంపిణీ అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేట మండలం బాంజిపేటలో భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించారు. డోర్నకల్ నియోజకవర్గంలో మరిపెడ మండలం బీచరాజుపల్లిలో భూములను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో సంగెం మండలం రా మచంద్రాపురంలో దళిత మహిళలకు భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడే పంపిణీకి అనువుగా ఉన్న భూములను గుర్తించి సేకరిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కొడకండ్ల మండలం నర్సింగాపురంలో దళిత మహిళలకు భూములు పంపిణీ చేయనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్వతగిరి మండలం వడ్లకొండలో భూముల పంపిణీ కార్యక్రమం జరగనుంది. దీని కోసం రెవెన్యూ అధికారులు భూములు కొనుగోలు చేస్తున్నారు. ములుగు నియోజకవర్గం ములుగు మండలం కాసిందేవిపేటలో భూములు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి భూముల విషయంలో ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. -
చింతమడక నుంచే భూ పంపిణీ!
సిద్దిపేట రూరల్: దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15న చింతమడక నుంచి ప్రారంభిస్తున్నట్లు భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన సిద్దిపేట మండలం నారాయణరావుపేట శివారులోని శ్రీ బుగ్గరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ సమీపంలో సామూహిక మండపం నిర్మాణానికి, బంజేర్‌పల్లి పాఠశాల భవనం ప్రారంభోత్సవంతో పాటు అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, మాచాపూర్, చింతమడక గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. వృద్ధులు, వితంతు, వికలాంగులకు దసరా నుంచి పింఛను డబ్బులను పెంచనున్నట్లు తెలిపారు. అంతకు ముందు బంజేర్‌పల్లి పాఠశాలలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి లింగారెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి సర్పంచ్ రామస్వామిని పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, జెడ్పీటీసీ గ్యార వజ్రవ్వ యాదగిరి, సర్పంచ్‌లు కృష్ణవేణి వెంకట్‌రెడ్డి, భూమయ్య, ఎర్రోళ్ల లక్ష్మి శేఖర్, ఎంపీటీసీలు రోమాల శాంత రాజయ్య, చెప్యాల దేవవ్వ రాజయ్య, నాయకులు బాలకిషన్‌రావు, సత్యనారాయణగౌడ్, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి రోజూ సిద్దిపేటకు మంచినీటి సరఫరా సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణానికి ప్రతి రోజు తాగునీరందించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించాలని మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాల్టీలోని 34 వార్డులకు ప్రతి రోజు తాగునీరందించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ కోసం సూచనలను, సలహాలను అందజేశారు. నీటి సరఫరా సమయంలో లీకేజీలను అరికట్టేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. నీటి వృధాపై ప్రజల్ని చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. వినియోగదారులు నల్లాలకు బిరడాలను బిగించకపోవడంతో నీరంతా వృధాగా పోతోందన్నారు. ప్రతి రోజు ఒక్కో కనెక్షన్‌పై రూ. 100ల విద్యుత్తును ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. రోజు అరగంట పాటు నీటి సరఫరాతో పట్టణంలోని ప్రతి ఇంటికి మంచినీరు అందించవచ్చన్నారు. ప్రతి ఇంటికి నల్లా పెట్టించాలని, తాగునీటిని తోడుతున్న మోటార్లను స్వాధీనం చేసుకోవాలని, అనధికార నల్లాలను నిరోధించాలని, కమర్షియల్ భవనాలకు నల్లా కనెక్షన్ రేటు పెంచాలని, పవర్ బోర్లపై వస్తున్న విద్యుత్ బిల్లులను తగ్గించుకునేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రతి రోజు నీరందించే పట్టణంగా సిద్దిపేటను రూపొందించడమే తన లక్ష్యమన్నారు. ఇందుకు తొమ్మిది మంది అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ, ఎంఈవో, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, తహశీల్దార్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ 34 వార్డుల్లో వార్డు కమిటీలను నియమించి ప్రతి వార్డుకు ఒక్కో అధికారి స్పెషల్ ఆఫీసర్‌గా కొనసాగుతారన్నారు. పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలతో కమిటీ త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ఆయా వార్డుల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నీటి వృధాపై ప్రజల్ని చైతన్య పరుస్తుందన్నారు. సమావేశంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, ఎంఈవో నాగరాజు, ఎంపీడీఓ బాల్‌రాజు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి శ్రీనివాసచారి, పీఆర్ అధికారి కనకరత్నం, తహశీల్దార్ ఎన్‌వైగిరి తదితరులు పాల్గొన్నారు. రంజాన్ ఏర్పాట్లు భేష్ రంజాన్ పండుగ నిర్వహణకు అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో రంజాన్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. ఉత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తోందన్నారు. సిద్దిపేటలో హజ్ హౌస్ నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మచ్చవేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, పాలసాయిరాం, మోహన్‌లాల్, నర్సింహారెడ్డి, నాయకం వెంకట్, మల్లేశం, యోగి, బాలకిషన్ రావు, కాముని నగేష్, నందు, రమేష్‌గౌడ్, లక్కరసు ప్రభాకర్ వర్మ, సికిందర్,అక్బర్ పాల్గొన్నారు. -
కొలిక్కిరాని భూ పంపిణీ గ్రామాల ఎంపిక
ముకరంపుర : ప్రభుత్వం చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమానికి లబ్ధి పొందాల్సిన గ్రామాల ఎంపిక ఇంకా కొలిక్కిరాలేదు. ఇప్పటివరకు ఈ ప్రక్రియపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి లో మార్గదర్శకాలు జారీ కాకపోవడం.. ఆగస్టు 15న భూపం పిణీ కార్యక్రమం చేపడతామని ప్రకటించడంతో అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. 40 శాతం ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేయా లా..? భూములు ఉన్న గ్రామాలను ఎంపిక చేయాలా..? అని తర్జనభర్జన పడుతున్నారు. భూములున్న చోట దళితులు ఉండడం లేదు. 40 శాతం దళిత జనాభా ఉన్న చోట భూములు లేకపోవడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. దళిత కుటుంబాలను సర్వే చేయాలని ప్రభుత్వం డీఆర్‌డీఏను ఆదేశించడంతో గ్రామాల ఎంపిక పూర్తికానప్పటికీ.. షెడ్యూల్లో భాగంగా శుక్రవారం నగరంలోని స్వశక్తి కళాశాలలో జగిత్యాల, మంథని డివిజన్లకు చెందిన వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు, వీఎస్ఏ (విలేజ్ సోషల్ ఆడిటర్)కు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఇప్పటివరకు ఎంపిక చేసిన గ్రామాలకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆమోదం తెలపలేదు. ఒకవేళ మార్పులుచేర్పులు ఉంటే అందుకనుగుణంగా సిద్ధంగా ఉం డేందుకు ఆయా గ్రామాల సిబ్బంది కి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం పెద్దపల్లి, సిరిసిల్ల, 28న కరీంనగర్ డివిజన్ల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. -
దళితులకు భూములు దక్కేనా..!
- భూ పంపిణీతో దళితుల్లో చిగురిస్తోన్న ఆశలు - ప్రభుత్వ భూముల వివరాలు నమోదు పూర్తి - మూడెకరాల భూమి ఇస్తే వందలాది కుటుంబాలకు లబ్ధి యాచారం: ప్రభుత్వం చేపట్టబోయే భూ పంపిణీ కార్యక్రమంతో వందలాది మంది దళిత కుటుంబాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా భూమి లేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండే అవకాశం ఉంది. తాము ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని ఆశలు చిగురిస్తున్నాయి. మండలంలోని 20 గ్రామాల్లో 24,168 ఎకరాల 2 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో 8,441 ఎకరాల 19 గుంటల భూమిని 1976 నుంచి ఇప్పటివరకు అసైన్మెంట్ కింద పేదలకు పట్టాలు ఇచ్చారు. వారం కింద అధికారులు తేల్చిన లెక్కల ప్రకారం ఇంకా మండలంలో సాగుకు యోగ్యంగా లేని భూమి 5,406 ఎకరాల 19 గుంటలు ఉండగా, కేవలం 376 ఎకరాల 2 గుంటల భూమి మాత్రమే వ్యవసాయానికి యోగ్యంగా ఉంది. పలు గ్రామాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా గుట్టలు, రాళ్లు, రాప్పలతో కూడి ఉండడంతో యోగ్యంగా మార్చుకోవాలంటే పెద్దమొత్తంలో ఖర్చవుతుంది. పలు గ్రామాల్లో వందలాది ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించారు. స్థానిక రెవెన్యూ అధికారుల అండదండలతో దొంగ పట్టదారు పాసుపుస్తకాలను పొందిన ఆక్రమణదారులు బ్యాంకుల్లో కుదువ పెట్టి వివిధ రకాల రుణాలు పొందారు. మండలంలోని నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, కొత్తపల్లి, మొండిగౌరెల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి పాసు పుస్తకాలను సృష్టించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా, ఉన్నతాధికారులకు విన్నవించినా ఆ ప్రభుత్వ భూములను అక్రమార్కుల నుంచి కాపాడలేకపోయారు. -
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఏన్కూరు, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఏన్కూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వైరా నియోజకవర్గంలోని గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాలకు చెందిన 1250 మంది నిరుపేద గిరిజన రైతులకు 2150 ఎకరాలను పంపిణీ చేశామని అన్నారు. రానున్న రోజుల్లో భూమి లేని గిరిజన రైతులను గుర్తించి పట్టాలు పంపిణీ చేస్తామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూ పంపిణీ ప్రవేశపెట్టారని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకాన్ని ప్రవేశపెట్టలేదని, అది కేవలం మనరాష్ట్రంలో మాత్రమే ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే బాణోత్ చంద్రావ తి, జేసీ సురేంద్రమోహన్, కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమా ర్, జూలూరుపాడు, ఏన్కూరు, కారేపల్లి తహశీల్దార్లు తిరుమలాచారి, నాగమల్లేశ్వరరావు, రజని, అధికారులు పాల్గొన్నారు. -
‘భూ పంపిణీకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్సే’
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : నిరుపేదలకు భూములు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ర్ట రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. నగరంలోని కృష్ణకళామందిరంలో మంగళవారం ఏడో విడత భూ పంపిణీ అట్టహాసంగా జరిగింది. అనంతపురం రెవెన్యూ డివిజన్లోని 3833 ఎకరాల భూ పంపిణీకి 2076 మందిని ఎంపిక చేశారు. లబ్ధిదారుల్లో 593 మంది ఎస్సీలు, 147 మంది గిరిజనులు, 1031 మంది వెనుకబడిన తరగతుల వారు, 11 మంది మైనార్టీలు, 294 మంది ఓసీలు ఉన్నారు. వీరిలో కొందరికి మంత్రి రఘువీరా చేతుల మీదుగా పట్టా పాసుపుస్తకాలు, టైటిల్డీడ్లను అందజేశారు. సాగుదారులకే పట్టాలు పంచామని మంత్రి అన్నారు. పేదలకు సామాజిక భద్రతతోపాటు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అసెంబ్లీలో రాష్ర్ట విభజన బిల్లును ఓడించేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఒకేతాటిపైకి రావాలన్నారు. రాష్ర్ట ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ సాగు చేస్తున్న వారికే పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నీటి కేటాయింపుల విషయంలో అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఏజేసీ వెంకటేశం, ఆర్డీఓ హుస్సేన్‌సాబ్ పాల్గొన్నారు. సాగు భూములకు పట్టాలతో భద్రత కదిరి అర్బన్ : ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు భూ పంపిణీకింద అందజేసిన పట్టాలతో భద్రత కల్పిస్తున్నామని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. కదిరి బాలికల ఉన్నతపాఠశాలలో ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. భూ పంపిణీకి కదిరి నియోజకవర్గంలో 1727 మంది, పుట్టపర్తి నియోజకవర్గంలో 985 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరందరికీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మంత్రి చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. త్వరలోనే రెవెన్యూ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సంక్రాంతి లోపు ఇన్పుట్ సబ్సిడీ పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. జిల్లాలోని 63 మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటిస్తామని చెప్పారు. అంతకు ముందు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు.