బడ్జెట్‌లో దళితకు అన్యాయం
మెదక్ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో దళిత, బలహీన వర్గాలకు పూర్తిగా అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్ బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాం తంలో 50 శాతం ఉన్న బలహీన వర్గాలకు మొక్కుబడి నిధులు కేటాయించ డం దారుణమన్నారు.
దళితులకు మూడెకరాల భూమి పంపిణీ కార్యక్రమం భూస్వాములను పెంచి పోషించడానికేనన్నారు. భూ స్వాము ల దగ్గరున్న భూమిని అధిక ధరకు కొనుగోలు చేసి దళితులకు భూమి ఇ స్తామని చెప్పడం హాస్యాస్పదమన్నా రు. సమావేశంలో రాజు, రాములు, బాల్‌రాజ్, కిషన్ పాల్గొన్నారు.
హామీలు విస్మరిస్తున్నారు
హత్నూర : ఎస్సీ వర్గీకరణకు తోడ్పా టు నందిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే విస్మరిస్తున్నారని మందకృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని దౌల్తాబాద్ శివారులోని ఎస్‌ఎస్‌ఆర్ గార్డెన్‌లో నర్సాపూర్ తాలూకా స్థాయి ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల స మావేశం ఆయన పాల్గొని మాట్లాడా రు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా దళితులకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి కొండూరి రాజ య్య ఎల్లయ్య, నర్సింలు, లక్ష్మయ్య, మండల నాయకులు ప్రసాద్, మొగులయ్య, లింగయ్య, పెంటయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
మందకృష్ణతో ఒరిగిందే మీ లేదు
తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్
చేగుంట : మందకృష్ణతో మాదిగలకు ఒరిగిందేమీ లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు యాతాకుల భాస్కర్ అన్నారు. శుక్రవారం చేగుంటలో సిద్దిపేట డివిజన్ స్థాయి ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్న మాట్లాడారు.
మందకృష్ణ 20 ఏళ్లుగా మాదిగల పక్షాన పోరాటం చేస్తున్నా.. వారి సంక్షేమం కోసం ఏ ప్రభుత్వమూ చర్యలు తీసుకోలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈనెల 10న హైదరాబాద్‌లో జరుగుతున్న మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశం లో శివరాజ్, రాంచంద్రం, రత్నయ్యలు పాల్గొన్నారు.