పుల్లమ్మకు రూ.లక్ష బహుమతి
Published Sun, Apr 2 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
- నగదు రహిత లావాదేవీల్లో భాగంగా ప్రోత్సాహకం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాపంపిణీలో నగదు రహిత లవాదేవీలు నిర్వహించిన మహిళకు రూ.లక్ష రూపాయల నగదు బహుమతి లభించింది. ప్రజాపంపిణీలో నగదు రహితాన్ని ప్రోత్సహించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రతి నెలా ప్రోత్సాహక బహుమతులను ప్రకటిస్తోంది. డిప్ ద్వారా కార్డుదారులను ఎంపిక చేస్తోంది. మార్చి నెలలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన వారిలో లాటరీ ద్వారా విజయవాడలో శనివారం కార్డుదారులను ఎంపిక చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో నందికొట్కూరు మండలం కొనిదెల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చందమాల పుల్లమ్మ( కార్డు నెంబరు డబ్ల్యూఏపీ 130802000313)కు రూ.లక్ష నగదు బహుమతి లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రం మొత్తం మీద 5వేల మంది కార్డుదారులు స్మార్ట్‌ఫోన్లకు ఎంపిక కాగా ఇందులో జిల్లాకు సంబంధించి 330 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
నగదు రహితంలో కర్నూలు జిల్లా ఫస్ట్
ప్రజాపంపణీలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. శనివారం సాయంత్రానికి 19,046వేల కార్డులకు సరుకులు ఇవ్వగా నగదు రహితంపై 4,797 కార్డులకు సరుకులు పంపిణీ చేశారు.
Advertisement