ప్రస్తుతం దేశంలో నగదు రహిత చెల్లింపుల హవా పెద్ద ఎత్తున నడుస్తుంది. పెద్ద పెద్ద మాల్స్ నుంచి రోడ్లపై ఉండే చిన్నా చితక దుకాణాల వరకు అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్లే. ఇప్పటి వరకు మనం ఫోన్ లేదా క్యూర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం చేశాం. వాటన్నింటిని తలదన్నేలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడిన మరో చెల్లింపు విధానం వచ్చేసింది. దీన్నిచూస్తే అంతకు మించి..!..అని అనకుండా ఉండలేరు. ఇంతకీ ఏంటా చెల్లింపు విధానం అంటే..
సాంకేతిక రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న చైనాలో ఈ సరికొత్త చెల్లింపు విధానం కనిపిస్తుంది. సాంకేతికతకు సంబంధించిన విషయంలో చైనా సాధించిన పురోగతి ప్రపంచ దేశాలను బాగా ఆకర్షిస్తాయి. అందుకు ఉదాహారణే ఈ సరికొత్త డిజిటల్ చెల్లింపు విధానం. ఔను..! చైనాలోని ఓ దుకాణంలో 'పామ్ పేమెంట్ పద్ధతి'లో చెల్లింపులు చెయ్యొచ్చు.
ఇదేంటీ ఫోన్ లేదా క్యూర్ కాకుండా ఏంటీ పామ్ అంటే..? . ఏం లేదు జస్ట్ మన చేతిని స్కాన్ చేసి చెల్లించేయొచ్చు. అందుకు సంబంధించిన వీడియోని పాకిస్తాన్ కంటెంట్ క్రియేటర్ రానా హంజా సైఫ్ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఎలా చేస్తారంటే..
ఏం లేదు.. జస్ట్ పామ్ పామ్ ప్రింట్ డివైజ్‌లో మీ హ్యాండ్‌ని స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత దాన్ని మన పేమెంట్ ఇన్ఫర్మేషన్‌నికి లింక్ అప్ చేస్తే చాలు. అంటే ఇక్కడ..ఒట్టి చేతులను స్కాన్ చేసి చెల్లింపులు చేసేయొచ్చు అన్నమాట.
ఇది కాస్త భద్రతతో కూడిన సాంకేతికత. పైగా ఎలాంటి సమస్యలు ఉండవు. దీన్ని చూస్తే కచ్చితంగా వాటే టెక్నాలజీ గురూ..! అనాలనిపిస్తోంది కదూ..!.
(చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!)
Comments
Please login to add a commentAdd a comment