చైనీస్ ఇంటర్నెట్, టెక్ దిగ్గజం టెన్సెంట్ తన వుయ్‌చాట్ పే సేవ కోసం పామ్ రికగ్నేషన్ సర్వీస్‌ను ఇటీవల ప్రారంభించింది. ఇది మెట్రో ప్రయాణికులు స్కానర్‌పై అరచేతిని చూపి చెల్లించడానికి వీలు కల్పిస్తుంది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. వినియోగదారులు మెట్రో స్టేషన్ టర్న్స్‌టైల్స్‌లో స్కానర్‌పై చేతులు పెట్టి రాజధానిలోని డాక్సింగ్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో రైడ్‌ల కోసం చెల్లించవచ్చు. ప్రత్యేకమైన పామ్ ప్రింట్ రికగ్నేషన్ యూజర్ వుయ్‌చాట్ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపును ప్రేరేపిస్తుందని నివేదిక పేర్కొంది.
టెన్సెంట్ ప్రకారం.. ఈ పేమెంట్ సర్వీస్ కోసం మెట్రో స్టేషన్‌లోని నిర్దేశిత యంత్రం వద్ద ప్రయాణికులు తమ అరచేతి ముద్రలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సాంకేతికత ఉపరితల స్థాయి అరచేతి ముద్రలు, చేతి సిరలు రెండింటినీ గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది.
కంపెనీకి చెందిన యూటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. టెన్సెంట్ త్వరలో కార్యాలయాలు, క్యాంపస్‌లు, రిటైల్ అవుట్‌లెట్‌లు, రెస్టారెంట్లలో పామ్ పేమెంట్‌లను ప్రారంభించనుంది.
అలీబాబా గ్రూప్ హోల్డింగ్ కూడా తన అలిపే సేవ కోసం ఇలాంటి టెక్నాలజీపై పని చేస్తోంది. యూఎస్‌లో అమెజాన్ 2020లో ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అమెజాన్ వన్ అనే తన సొంత హ్యాండ్ స్కాన్ టెక్నాలజీని ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment