Palm
-
మీ చేయి ఊపితే చాలు పేమెంట్ అయిపోతుంది
-
తాటి ఆకుల కళ..! 75 ఏళ్ల బామ్మ..
అవసరం ఒక ఆవిష్కరణకు దారి వేసింది. ఆర్థిక అవసరాలే తనను హ్యాండీక్రాఫ్ట్ కళాకారిణిగా తీర్చిదిద్దాయని చెప్పారు బాల త్రిపుర సుందరి. తాటి ఆకులతో గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తారామె. వీటి తయారీలో మహిళలకు శిక్షణనిస్తారు కూడా. తాటి ఆకు కళారూపాల తయారీలో యాభై ఏళ్ల అనుభవం ఆమెది. ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేసింది! త్రిపుర సుందరికి 75 ఏళ్ల వయసు. ఆమెది తూర్పుగోదావరి జిల్లాలో ఓ కుగ్రామం. చదువుకు నోచుకోని త్రిపుర సుందరి 1972లో ముంబయికి వెళ్లి హస్తకళాకృతుల తయారీలో సర్టిఫికేట్ కోర్సు చేశారు. అక్కడ నేర్పించిన కళారూపాల తోపాటు తన క్రియేటివిటీతో మరికొన్ని రూపాలను తయారు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హస్తకళాకృతుల ఎగ్జిబిషన్లలో స్టాల్ పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో పామ్ క్రాఫ్ట్ కళాకృతులను ప్రదర్శిస్తున్నారు. పనిలోనే ఆనందం ‘‘మా ఊరిలో తెలిసిన వాళ్ల ద్వారా ముంబయిలో శిక్షణ కోర్సు గురించి తెలిసింది.. మూడు నెలల కోర్సు, బస భోజన వసతులు వాళ్లే ఏర్పాటు చేస్తారని చెప్పారు. చదువు లేదు, భాష ఇబ్బందవుతుందేమోనని భయంతోనే వెళ్లాను. కానీ అక్కడ తెలుగు వాళ్లు కూడా ఉండడంతో ఇబ్బంది కలగలేదు. క్రమంగా హిందీలో చెప్తున్న విషయాలు అర్థం కాసాగాయి. కోర్సు పూర్తయిన తర్వాత మా ఊరికి వచ్చి, నిడదవోలులో ఉన్న తాటిబెల్లం ఫెడరేషన్ లో ట్రైనర్‌గా ఉద్యోగంలో చేరాను. బదలీ మీద 1983లో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కి వచ్చాను. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌తో కూడా పని చేశాను. ఆ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు కూకట్పల్లి, హౌసింగ్ బోర్డులో మా ఇంటి దగ్గర నాకు నచ్చిన కళారూపాలు అల్లుకుంటూ, ఎగ్జిబిషన్లలో స్టాల్ పెడుతున్నాను. వీటితోపాటు తుక్కుగూడలోని నీరా యూనిట్లో శిక్షణనిస్తున్నాను. బంధువులు, స్నేహితులు ఇంకా పని చేయడం ఎందుకని అడుగుతుంటారు. పిల్లల బాధ్యతలు పూర్తయ్యాయి, నేను పని చేయకపోతే అడిగేవాళ్లు కూడా లేరు. కానీ నాకు పని చేయకుండా కూర్చుని తినడం ఇష్టం ఉండదు. ఆరోగ్యం బాగున్నప్పుడు పని మానేయడం ఎందుకు?’’ అంటూ స్టాల్లో ఆమె బొమ్మల ధరలు అడుగుతున్న వారికి బదులివ్వడంలో మునిగిపోయారామె. -విఎమ్ఆర్ఫోటోలు: ఎస్ఎస్ ఠాకూర్(చదవండి: నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?) -
ఇదేదో బాగుందే.. వట్టి చేతులు చాలు! పేమెంట్ ఈజీ
చైనీస్ ఇంటర్నెట్, టెక్ దిగ్గజం టెన్సెంట్ తన వుయ్‌చాట్ పే సేవ కోసం పామ్ రికగ్నేషన్ సర్వీస్‌ను ఇటీవల ప్రారంభించింది. ఇది మెట్రో ప్రయాణికులు స్కానర్‌పై అరచేతిని చూపి చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. వినియోగదారులు మెట్రో స్టేషన్ టర్న్స్టైల్స్లో స్కానర్‌పై చేతులు పెట్టి రాజధానిలోని డాక్సింగ్ ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్లో రైడ్ల కోసం చెల్లించవచ్చు. ప్రత్యేకమైన పామ్ ప్రింట్ రికగ్నేషన్ యూజర్ వుయ్‌చాట్ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపును ప్రేరేపిస్తుందని నివేదిక పేర్కొంది. టెన్సెంట్ ప్రకారం.. ఈ పేమెంట్ సర్వీస్ కోసం మెట్రో స్టేషన్‌లోని నిర్దేశిత యంత్రం వద్ద ప్రయాణికులు తమ అరచేతి ముద్రలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సాంకేతికత ఉపరితల స్థాయి అరచేతి ముద్రలు, చేతి సిరలు రెండింటినీ గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. కంపెనీకి చెందిన యూటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. టెన్సెంట్ త్వరలో కార్యాలయాలు, క్యాంపస్‌లు, రిటైల్ అవుట్లెట్లు, రెస్టారెంట్లలో పామ్ పేమెంట్లను ప్రారంభించనుంది. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ కూడా తన అలిపే సేవ కోసం ఇలాంటి టెక్నాలజీపై పని చేస్తోంది. యూఎస్‌లో అమెజాన్ 2020లో ఆఫ్‌లైన్ స్టోర్లలో అమెజాన్ వన్ అనే తన సొంత హ్యాండ్ స్కాన్ టెక్నాలజీని ప్రారంభించింది. -
హైదరాబాద్‌లో నీరా కేఫ్ రెడీ
సాక్షి, హైదరాబాద్: తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన పానీయం నీరా. నగరవాసులకు ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం నెక్లెస్ రోడ్డులో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. మొదట వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించి ఆ తర్వాత డిసెంబర్ రెండో వారం నుంచి పూర్తి స్థాయిలో నీరా కేఫ్ సేవలను వినియోగంలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ అధికారులు ఇటీవల కేఫ్‌ను సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో నెక్లెస్ రోడ్డులో రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. నీరాను సురక్షితంగా నిల్వ చేసేందుకు అన్ని రకాల శీతలీకరణ యంత్రాలను సైతం ఏర్పాటు చేశారు. పామ్ ప్రొడక్ట్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ అసోసియేషన్ (పీఆర్డీఏ) ఆధ్వర్యంలో నీరాతో పాటు అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ‘పానీయంలోని స్వచ్ఛతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తాటిచెట్ల నుంచి నీరాను సేకరించడం మొదలుకొని దానిని వినియోగదారులకు చేర్చడం వరకు పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిని పాటిస్తున్నట్లు’ పీఆర్డీఏ వ్యవస్థాపకుడు వి.సత్యగౌడ్ తెలిపారు. ‘వేదామృత్’ పేరుతో స్వచ్ఛమైన నీరా రుచులను నగరాసులకు పరిచయం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: Dalit Bandhu: అత్యంత పేదలకు జాబితాలో ముందు చోటు! తెలంగాణ రుచులు సైతం.. ఈ కేఫ్‌లో రెస్టారెంట్ సేవలు కూడా లభిస్తాయి. నీరాతో పాటు తెలంగాణ వంటకాలన్నీ లభిస్తాయి. ఒకేసారి సుమారు 3 వేల మందికి పైగా సందర్శించేందుకు అనుగుణంగా కేఫ్‌ను ఏర్పాటు చేశారు. ►పర్యాటక ప్రియులు, నగరవాసులు ఎక్కువగా సేదదీరే హుస్సేన్‌సాగర్ తీరంలోని నెక్లెస్ రోడ్డులో నీరా, తెలంగాణ వంటకాలను ఆస్వాదించవచ్చు. తాటి, ఈత చెట్ల పానీయంలోని సహజత్వాన్ని ప్రతిబింబించేవిధంగా నీరా కేఫ్‌ను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ►భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్ సమీపంలోని ముద్విన్‌లో ఏర్పాటు చేసిన తాటివనం ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేయనున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరా నుంచి తయారయ్యే బెల్లం, సిరప్, బుస్ట్ వంటివి కూడా కేఫ్‌లో విక్రయిస్తారు. పోషకాలు పుష్కలం నీరాలో పోషకాలు పుష్కలం. ప్రొటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఏ, బీ–6, బీ–12 వంటివి సమృద్ధిగా లభిస్తాయి. మొత్తం 20 అమైనో ఆసిడ్స్‌లో 18 అమైనో యాసిడ్స్ నీరా నుంచి లభిస్తాయి. ఈ పానీయం రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. అన్ని విధాలుగా ఇది ఆరోగ్య ప్రదాయిని. –వి. సత్య గౌడ్, పీఆర్డీఏ -
తాటి.. పోషకాల్లో మేటి
రంపచోడవరంలో డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో ‘తాటి’పై జరుగుతున్న పరిశోధనలు సత్పలితాలనిస్తున్నాయి. అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథకంలో భాగంగా 1993 నుంచి చేపట్టిన పరిశోధనల ద్వారా తాటి నీరా(అప్పుడే తీసిన తాటి కల్లు)తో అనేక ఉత్పత్తులు తయారు చేయవచ్చని నిరూపించారు. సాధారణంగా తాటికి సంబంధించి అందరికీ తెలిసింది తాటి బెల్లం మాత్రమే. అయితే హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త డాక్టర్ సీవీ వెంగయ్య తన ప్రయోగాలతో తాటి ద్వారా అనేక పదార్థాలు తయారు చేయవచ్చని నిరూపించారు. ఈ మేరకు ఐసీఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్)కు తన ప్రయోగ ఫలితాలను సమర్పించారు. ఏజెన్సీలో గిరిజనులకు తాటి చెట్ల ద్వారా ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో ఈ పరిశోధనలు చేసినట్లు వెంగయ్య తెలిపారు. తాటి తాండ్ర తయారీ ఇలా.. 1993 నుంచి తాటిపై పరిశోధనలు భారతదేశంలో తాటిపై పరిశోధనలు సాగిస్తున్న రీసెర్చ్ స్టేషన్ పందిరిమామిడిలోనే ఉంది. 1993 నుంచి ఇప్పటి వరకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ 270 రకాల తాటి చెట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల తాటి చెట్లు ఉంటాయని ఒక అంచనా. 2019 సంవత్సరంలో తాటి కల్లు నుంచి నీరా(హెల్త్ డ్రింక్) తయారు చేసే యూనిట్‌ను నెలకొల్పారు. దీని ద్వారా తాటి నుంచి కల్లు సేకరించి నీరా తయారు చేస్తారు. జనవరి నుంచి నీరా తయారీ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం తాటి పండ్లు నుంచి గుజ్జును సేకరించి తాటి తాండ్రను తయారు చేసి విక్రయిస్తున్నారు. తాటి గుజ్జును సేకరించేందుకు ఒక యంత్రాన్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేశారు. తాటి పండ్లు, తాటి తేగలు, తాటి కల్లు ద్వారా తాటి బెల్లం, జెల్లీ, నూక, పిండి, సిరప్లు, తాండ్ర తయారు చేస్తున్నారు. తాటికి సంబంధించి తెలంగాణ, బిహార్, తమిళనాడుకు చెందిన అనేక మంది రైతులు హెచ్ఆర్సీ వచ్చి శిక్షణ పొందుతున్నారు. తాటి తాండ్ర డీఎస్టీకి ప్రతిపాదనలు గ్రామస్థాయిలో తాటి ఉత్పత్తులు తయారీపై శిక్షణ ఇచ్చేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రతిపాదనలు పంపించాం. టీఎస్పీ నిధులు రూ.కోటి కేటాయించాలని కోరాం. గ్రామస్థాయిలో శిక్షణ ఇస్తే తాటిపండ్ల వినియోగం పెరుగుతుంది. ప్రస్తుతం మనకు లభిస్తున్న తాటి చెట్లు నుంచి 2 శాతం మాత్రమే వినియోగించుకుంటున్నాం. :::సీవీ వెంగయ్య, శాస్త్రవేత్త, ఫుడ్ అండ్ టెక్నాలజీ, హెచ్ఆర్ఎస్, పందిరిమామిడి తాటి బెల్లం తాటి సిరా -
ఇండోనేషియాలో ప్రాజెక్టు.. ఇండియన్లకి తాకిన పన్నుల పోటు
న్యూఢిల్లీ : ఇండోనేషియాలో నిర్మిస్తున్న పామ్‌బేస్‌డ్ బయో డీజిల్ ప్రాజెక్టు ఇండియాకు చేటు తెచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం భారీగా నిధులు సమకూర్చుతోంది ఇండోనేషియా. అందు కోసం ఆ దేశ ప్రధాన ఆదాయ వనరులో ఒకటైన పామాయిల్ ఎగుమతులపై భారీగా కస్టమ్స్ డ్యూటీ విధిస్తోంది. ఏడు నెలలుగా ఓ వైపు అమెరికా, బ్రెజిల్‌లలో కరువు కారణంగా వంట నూనె ధరలు పెరిగాయి. వాటికి ప్రత్యామ్నాయంగా పామాయిల్‌కి మళ్లుదామన్నా వీలు కాని పరిస్థితి నెలకొంది. వంట నూనెల్లో ఎప్పుడు చవకగా లభించే పామాయిల్ ధర సైతం లీటరు రూ. 150 దగ్గర ఉంది. దీనికి కారణం ఇండోనేషియాలో పెరిగిన ఎగుమతి పన్నులు. నిధుల సేకరణ పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా పామ్ బేస్డ్ బయో డీజిల్ ఉత్పత్తి ప్రాజెక్టును ఇండోనేషియా చేపట్టింది. దీనికి నిధుల సమీకరణకు పామ్నే ఎంచుకుంది. దీంతో ఒక్కసారిగా పామాయిల్ ఎగుమతిపై గత డిసెంబరులో ఉన్నట్టుండి పన్నులు పెంచింది. టన్ను పామాయిల్ కస్టమ్స్ డ్యూటీని 438 డాలర్లకు పెంచింది. అంతటితో ఆగకుండా క్రూడ్ పామాయిల్ లేవీని టన్నుకు రూ. 225 డాలర్లుగా నిర్ణయించింది. మన దేశ పామాయిల్ అవసరాల్లో యాభై శాతం ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. గత డిసెంబరు నుంచి పెరిగిన పన్నులతో ఇండియాలో కూడా పామాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మలేషియా ఇండోనేషియాలో పన్నుల భారం భరించలేని విధంగా పెరిగిపోవడంతో మలేషియా నుంచి పామ్ఆయిల్ ఇండియా దిగుమతి చేసుకుంటోంది.మలేషియా సైతం సుంకాలు తగ్గించడంతో ఇండియాకి పామాయిల్ ఎగుమతులు ఏకంగా 238 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఇండోనేషియా దిగుమతులు 32 శాతం తగ్గాయి. ధరలు తగ్గేదెన్నడు ఇండోనేషియాలో ఎగుమతి సుంకం పెరిగిపోవడంతో మలేషియా వైపు ఇండియా మళ్లింది. దీంతో ఎగుమతి పన్నులు తగ్గించాలంటూ ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ఇండియా అవసరాలను గమనించిన మలేషియా సైతం క్రమంగా క్రమంగా పన్నులు పెంచుతోంది. ఏతావతా ఇండోనేషియా, మలేషియాల మధ్య జరుగుతున్న పామాయిల్ వాణిజ్యంలో ఇండియాలో సామాన్యుల జేబులు గుల్ల అవుతున్నాయి. కనీసం పామాయిల్ ధరలైనా తగ్గేలా చూడాలని కోరుతున్నారు. చదవండి : చమురు ధరలు: ప్రత్యామ్నాయాలపై భారత్ చూపు! -
సినిమా ట్విస్ట్‌ను తలపించే ఘటన
చండీగఢ్: చనిపోయే ముందు ఓ పోలీస్ కానిస్టేబుల్ చూపించిన సమయస్ఫూర్తితో అతడి హత్యకు కారణమయిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా ట్విస్ట్‌ను తలపించే ఈ ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. వివరాలు.. గత వారం బుటానా పోలీస్ స్టేషన్ సమీపంలో సోనిపట్ జింద్ రోడ్డు పక్కన కొందరు దుండగులు తమ వాహనాన్ని నిలిపి రోడ్డు మీదే మద్యం సేవించసాగారు. కర్ప్యూ కొనసాగుతున్నప్పటికి వారు దాన్ని లెక్క చేయక రోడ్డు మీదే మందు తాగారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ రవీందర్ సింగ్(28), కప్తాన్ సింగ్(43) వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దాంతో దుండగులు, కానిస్టేబుల్స్‌కు మధ్య వివాదం జరిగింది. ఈ ఘర్షణలో రవీందర్ సింగ్, కప్తాన్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. అయితే చనిపోయే ముందు రవీందర్ సింగ్ తన చేతి మీద దుండగుల వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ని నోట్ చేశాడు. ఆ తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు రవీందర్ చేతి మీద ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా దుండగులను గుర్తించారు. చనిపోయే ముందు కూడా రవీందర్ చూపిన సమయస్ఫూర్తిని పోలీసులు తెగ ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా హరియాణా పోలీసు చీఫ్ మనోజ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘చనిపోయే ముందు మా పోలీస్ కానిస్టేబుల్ రవీందర్ సింగ్ చూపిన తెగువ అభినందనీయం. ఇది ఓ సాధారణ పోలీసింగ్ స్కిల్. చనిపోయే ముందు రవీందర్ సింగ్ దుండగులు వాహనం నంబర్ని తన చేతి మీద రాసుకున్నాడు. పోస్టుమార్టం సమయంలో దీని గురించి తెలిసింది. కేసు దర్యాప్తులో ఈ క్లూ ఎంతో సాయం చేసింది. లేదంటే నిందితులను పట్టుకునేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది’ అన్నారు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఆరుగురుని అరెస్ట్ చేశారు. -
ప్రజలు లేకుండానే పోప్ ప్రార్థనలు
వాటికన్ సిటీ: కరోనా కారణంగా వాటికన్ సిటీ వెలవెలబోయింది. ఏటా గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం జరుపుకునే మ్రానికొమ్మల (పామ్) ఆదివారం ప్రార్థనలకు దేశ, విదేశాల నుంచి వేలాది సంఖ్యలో హాజరయ్యే వారు. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ఈ ఏడాది వాటికన్ సిటీని మూసివేయడంతో, భక్తులు లేకుండానే పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యేక దివ్యబలి పూజను సెయింట్ పీటర్స్ బసిలికా లోపలే నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనూ అతి తక్కువ మంది హాజరు కాగా, వారు కూడా భౌతిక దూరాన్ని పాటించారు. ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి మానవాళి ఆశలపై గండి కొట్టిందని, హృదయాలపై మోయరాని భారాన్ని పెట్టిందని అన్నారు. -
తాటి నీరా తరుణమిదే!
తాటి చెట్ల నుంచి నీరాను సేకరించడం డిసెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుంది. తాటి నీరా అత్యంత ఆరోగ్యదాయకమైన ప్రకృతిసిద్ధమైన పానీయం. తాటిచెట్టు గెలల నుంచి స్రవించే పోషక ద్రవాన్ని పులియకుండా సేకరిస్తే నీరా, పులియబెట్టి సేకరిస్తే కల్లు అవుతాయి. తాజా నీరా చక్కటి రుచితో అంతకుమించిన పోషకాలతో కూడి ఉంటుంది. దీన్ని హెల్త్ డ్రింక్‌గా తాగవచ్చు. తాటినీరాతో బెల్లం, పాకం(సిరప్), పంచదార, పటిక బెల్లం తయారు చేయవచ్చు. ఇళ్లలో, బేకరీల్లో చక్కెరకు బదులుగా వీటిని వాడుకోవచ్చు. తాటి ఉత్పత్తుల గ్లైసెమిక్ ఇండెక్స్(జి.ఐ.) తక్కువ కాబట్టి సాధారణ వ్యక్తులతోపాటు షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడుకోవచ్చని తూ.గో. జిల్లా పందిరిమామిడిలోని ఉద్యాన పరిశోధనా కేంద్రానికి చెందిన ఫుడ్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య చెబుతున్నారు. ఈ పరిశోధనా కేంద్రంలో తాటి నీరాతో వివిధ ఉత్పత్తుల తయారీ కోసం అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పారు. గీత కార్మికులు, రైతులు, గ్రామీణులకు శిక్షణ ఇస్తున్నారు. తాటి నీరా ప్రకృతి సిద్ధంగా తాటి చెట్టు నుంచి లభించే పానీయాన్ని పులియకుండా సేకరిస్తే.. దాన్ని నీరా అంటారు. ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. నీరా తియ్యగా ఉండటమే కాకుండా సుక్రోజు వంటి పిండి పదార్థాలు ఎక్కువగా కలిగి ఉంటుంది. నీరాలో ఇంకా అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. నీరా చక్కెర శాతం ఎక్కువగా కలిగిన పానీయం. దీనిలో చక్కెరతోపాటు ఐరన్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్, ఆస్కార్బిక్ ఆమ్లాలు వంటి విటమిన్లు ఉన్నాయి. నీరా జీర్ణశక్తిని పెంచుతుంది. కామెర్లు వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉన్న నీరాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడవచ్చు. దీనిలో మినరల్స్, అవశ్యకమైన అమైనో ఆమ్లాలు, బి–కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. గర్భవతులకు, బలహీనంగా ఉన్న పిల్లల ఆరోగ్య రక్షణకు ఉపయోగించే ఆయుర్వే ఔషధాల్లో నీరాను వాడుతున్నారు. గర్భవతులు నీరాను వారానికి మూడు లేదా నాలుగు రోజులు తీసుకోవడం వల్ల పుట్టబోయే శిశువు మంచి రంగులో, ఆరోగ్యంగా జన్మిస్తుంది. బలహీనంగా ఉన్న పిల్లలకు రోజూ తక్కువ మోతాదులో ఇస్తే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు. మధుమేహం, ఊబకాయం, దంత క్షయం ఉన్న వారికి నీరా ఉపయోగపడుతుంది. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన కేలరీలు తక్కువగా ఉండే పదార్థాలు ఇష్టపడేవారు నీరాతో తయారు చేసిన పదార్థాలను వాడవచ్చు. తాటి నీరా సిరప్ (పాకం), బెల్లం, పంచదారను ఇళ్లలో, బేకరీలో వివిధ రకాల పదార్థాల తయారీలో చక్కెరకు బదులుగా వాడవచ్చు. నీరాను పాకం, బెల్లం, పంచదార వంటి పదార్థాలుగా మార్చడం వలన వీటిని సాంప్రదాయ వంటలు, ఇతర పదార్థాల తయారీలో చెరకు నుంచి తయారు చేసిన బెల్లం, పంచదారకు బదులుగా వాడవచ్చు. తాటి పటిక బెల్లం తాజాగా సేకరించిన నీరా (తాజా నీరా ఉదజని సూచిక 7–8 ఉంటుంది)ను 103–105 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద బాగా మరిగించాలి. నీరా బాగా మరిగి దాదాపు మూడో వంతు వరకు ఇగిరిన తర్వాత మంటను ఆర్పివేసి.. సన్నని దారాలు లేదా తీగలతో తయారు చేసిన క్రిష్టలైజర్లో పోయాలి. దీన్ని కదలకుండా, గాలి తగలకుండా ఉన్న చోటనే 35–40 రోజుల పాటు ఉంచాలి. తరువాత దారాలు లేదా తీగలకు అంటుకొని ఏర్పడిన స్ఫటికాల(అదే పటిక బెల్లం)ను బయటకు తీసి కడిగి, ఆరబెట్టి నిల్వచేసుకోవచ్చు. తాటి బెల్లం తాటి నీరాతో బాండీలో పోసి మరిగించి సులభంగానే బెల్లం తయారు చేసుకోవచ్చు. తొలుత 103–105 డిగ్రీల ఉష్ణోగ్రతతో బాగా మరగబెట్టి, తరువాత తక్కువ మంట మీద కలుపుతూ ఉండాలి. చిక్కబడిన తర్వాత అచ్చులలో పోస్తే బెల్లం తయారవుతుంది. ఎటువంటి ఎంజైములు, రసాయనాలు కలపనవసరం లేదు. తాటి పంచదార తాటి చెట్ల పెంపకంలో రసాయనాలు వాడే అవసరం లేదు. కాబట్టి తాటి నీరాతో తయారు చేసే పంచదారను కూడా ప్రకృతి సిద్ధంగా, ఏ విధమైన రసాయనాలు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. రసాయనాలు వాడకుండానే తాటి పంచదారను తయారు చేసుకోవచ్చు. ఇంతులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. నీరా పంచదారను వాడటం వలన బరువు తగ్గడం, మధుమేహం అదుపులో ఉండటంతోపాటు సీరమ్ కొలస్ట్రాల్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కూడా నీరా పంచదార ఉపయోగపడుతుంది. తాజా నీరా(ఉదజని సూచిక 7–8)ను 103–105 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగించి, బాగా చిక్కబడిన తరువాత క్రిస్టలైజర్, సెంట్రిఫ్యూజులను ఉపయోగించి పంచదారను తయారు చేస్తారు. తాటి సిరప్ (పాకం) తాజా నీరాను బాణలిలో పోసి 103–105 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బాగా మరిగించాలి. నీరా బాగా మరిగి దాదాపు సగం పరిమాణానికి తగ్గినప్పుడు మంటను ఆర్పివేసి, చల్లబర్చి గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. దీన్ని చక్కెరకు బుదులుగా వాడుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. టీ, కాఫీలలోను, కషాయాల లోను, బేకరీ ఉత్పత్తులలోను, ఐస్‌క్రీమ్‌ల తయారీలోను నీరా సిరప్‌ను ఎక్కువగా వాడతారు. 4 కోట్ల తాటి చెట్లున్నా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 4 కోట్ల తాటిచెట్లు ఉన్నాయి. ముదురు చెట్ల నుంచి డిసెంబర్ నుంచి 4 నెలల పాటు నీరాను సేకరించవచ్చు. చెరకు రసంతో తయారు చేసే పంచదార, బెల్లం కన్నా తాటి బెల్లం, తాటి పంచదార ఎంతో మేలైనవి. ఈ సహజ తీపి ఉత్పత్తులను గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహ రోగులు కూడా తినొచ్చు. ఇంత ప్రయోజనకరమైన తాటి చెట్లలో 1 శాతాన్ని కూడా మనం ఉపయోగించుకోకపోవడం దురదృష్టకరం. ప్రతి తాటి చెట్టు నుంచి ఏటా గరిష్టంగా రూ. 10 వేల ఆదాయం పొందవచ్చు. గ్రామీణులకు ఉపాధి అవకాశాలను ఇవ్వగల శక్తి తాటి, ఈత చెట్లకు ఉందని ప్రభుత్వాలు, గీత కార్మికులు, రైతులు గుర్తించాలి. – పి. సి. వెంగయ్య (94931 28932), సీనియర్ శాస్త్రవేత్త (ఫుడ్‌సైన్స్, టెక్నాలజీ), అఖిల భారత తాటిపరిశోధనా పథకం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పందిరి మామిడి, తూ. గో. జిల్లా తాటి నీరాతో తయారవుతున్న తాటి బెల్లం, తాజా తాటి నీరా -
తాటి బెల్లంతో ఆరోగ్యానికి ఎంతో మేలు
కుత్బుల్లాపూర్: మనిషికి తీపి ఎంత జిహ్వ చాపల్యం కలిగిస్తుందో అంతగా చెడు చేస్తుందంటారు. అలాంటి తీపి పదార్థాల్లో శరీరానికి అత్యంత మేలు కలిగించేది ‘తాటి బెల్లం’. సాధారణ చెరుకు బెల్లంతో పోలిస్తే తాటి బెల్లం చేసే మేలు అనంతం. బిజీబిజీ యాంత్రిక జీవనంలో ఆరోగ్య శైలిలో మార్పులు తప్పనిసరి.గత దశాబ్దకాలంగా ప్రతీఒక్కరి ఆహార శైలిలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పటి పాత కాలం నాటి ఆహార పద్ధతులను ఇప్పుడు ఆచరిస్తున్నారు. అందులో భాగంగా చెరుకు బెల్లానికి ప్రత్యామ్నాయంగా తాటి బెల్లానికి డిమాండ్ బాగా పెరిగింది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తాటిబెల్లం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తాటిబుట్టల్లో పెట్టి.. తాటి బెల్లానికి పెరుగుతున్న డిమాండ్ రీత్యా ఇçప్పుడు నగరంలోని పలు ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన వ్యాపారులు పెద్ద సంఖ్యలో దీనిని విక్రయిస్తున్నారు. దేశంలోని తీర ప్రాంత రాష్ట్రాల్లో తాటిబెల్లం ఉత్పత్తి అధికంగా జరుగుతోంది. వీటిలో తమిళనాడు తాటిబెల్లం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ఈ క్రమంలో తుత్తుకూడి, తిరునల్వేరి, ఒడంకుడి, తిరుచందూర్, తిరువనలై తదితర ప్రాంతాలకు చెందిన తాటి బెల్లం తయారీ, అమ్మకందారులు నగరంలో విక్రయిస్తున్నారు. మౌలాలీ, సికింద్రాబాద్, మేడ్చల్, కొంపల్లి, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్.. ఇలా నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్డు పక్కన తాటిబుట్టల్లో అమ్ముతున్నారు. తాటినీరా నుంచి తయారీ.. తాటిబెల్లం అత్యంత సహజసిద్ధంగా తయారు చేస్తామని విక్రయదారులు చెబుతున్నారు. తాటి చెట్లనుంచి సేకరించిన పులియని తాటి నీరాను బాగా వేడి చేయగా వచ్చేదే తాటి బెల్లమని, ఇందులో ఎలాంటి రంగు, ఇతర పదార్థాలను కలపమని తెలిపారు. తాటి బెల్లంతో పాటు మరో రకమైన ‘అల్లం బెల్లం’ ను కూడా తమిళ వ్యాపారులు విక్రయిస్తున్నారు. అయితే ఇందులో తాటి బెల్లం తయారీ సమయంలోనే అల్లం, ఇలాచీ, లవంగం, మిరియాలు వంటి పదార్థాలను కలిపి తయారు చేస్తారు. మామూలు తాటి బెల్లం కేజీ రూ.100 నుంచి రూ. 140 వరకు ఉండగా.. అల్లం బెల్లం కేజీ రూ.190 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. హైటెక్ సిటీ వంటి ఐటీ హబ్‌ల ప్రాంతంలో మాత్రం మామూలు తాటి బెల్లాన్నే రూ.240కు విక్రయిస్తున్నట్లు సమాచారం. రుగ్మతలు దూరం.. పులియని తాటి నీరాతో తయారు చేసే తాటి బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజ్ 76.86 శాతం, మాంసకృతులు 1.04, ఖనిజ లవణాలు 3.15 శాతం, ఇనుము సమృద్ధిగా ఉంటుంది. వంద లీటర్ల తాటి నీరా నుంచి దాదాపు 12 నుంచి 15 కిలోల తాటి బెల్లం ఉత్పత్తి అవుతుంది. రక్తహీనతకు చెక్ పెట్టడంతో పాటు శరీర పుష్టి, వీర్యవృద్ధి కలుగుతుంది. తక్కువ సోడియం ఎక్కువ పొటాషియం ఉండడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత రుగ్మతలు దరిజేరకుండా ఉంచుతుంది. విక్రయాలు బాగానే ఉన్నాయి.. ఒకప్పుడు తాటి బెల్లాన్ని అంతగా ఇష్టపడే వారు కాదు. కాని ఇప్పుడు దీనికి మంచి గిరాకీ ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో తాటి బెల్లం విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి. అందుకే నేను మావాళ్లు మొత్తం 16 మంది మధురై నుంచి నగరానికి వచ్చి తాటిబెల్లం విక్రయిస్తున్నాం.– కుంభయ్య, తాటిబెల్లం వ్యాపారి, మధురై -
రేపు కొల్లేరులో తాటిదోనెల పోటీలు
కైకలూరు: కొల్లేరు సాంప్రదాయక వేటకు తాటి దోనెలు చిరునామాలు. మూడేళ్ల విరామం అనంతరం అటవీశాఖ తాటి దోనెల పోటీలు నిర్వహించనుంది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కైకలూరు మండలం సర్కారు కాల్వ వద్ద ఈ పోటీలు జరుగుతాయి. మత్స్యకారులు ఈ పోటీలకు సిద్ధమవుతున్నారు. ప్రథమ బహుమతి రూ.10,000, ద్వితీయ బహుమతి రూ.5,000, తృతీయ బహుమతి రూ.3,000గా నిర్ణయించారు. కొల్లేరులో 2005 ఫిబ్రవరి 2న అప్పటి రేంజర్ సునీల్‌కుమార్ మొదటిసారి దోనెల పోటీలను నిర్వహించారు. నీటిలో రాకెట్లు తాటి దోనెలు కొల్లేరు సరస్సులో చేపల వేటకు తాటి దోనెలను ఉపయోగిస్తారు. ముందుగా ఓ బలమైన తాటిచెట్టును ఎంపిక చేసుకుని దానిని మొదలుతో సహా తీసుకొస్తారు. 15 రోజుల పాటు బరిసెతో చెక్కుతారు. నీరు చేరకుండా తారును అద్దుతారు. దీనిలో ఇద్దరు ప్రయాణించవచ్చు. తాటిదోనెలపై మావులను (చేపలు పట్టడానికి ఉపయోగించే కర్రల బుట్ట) తీసుకెళ్లి వేట సాగిస్తారు. ఈ తాటిదోనెలను నడపడం ఎంతో కష్టం. సాంప్రదాయ చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులు మాత్రమే వీటిని ఉపయోగించగలరు. సంప్రదాయం కొనసాగించాలి కొల్లేరు సరస్సులో చేపల చెరువుల సాగు విస్తీర్ణం పెరగడంతో తాటి దోనెల ఉపయోగం తగ్గింది. ఇంజను ఇనుప పడవల వాడకం ఎక్కువైంది. పూర్వం కొల్లేరులో 4వేల జనాభాలో కనీసం 1000 తాటి దోనెలు ఉండేవి. ప్రస్తుతం ఒక్కో గ్రామానికి కేవలం 10 దోనెలకు పరిమితమైంది. మయ్యింది. ఈ సందర్భంగా అటవీ శాఖ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్ రామచంద్రరావు మాట్లాడుతూ చిత్తడి నేలల ఆవశ్యకతను తెలిపేందుకు తాటి దోనెల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. -
నమ్మకం: అరచేతిలో అంత కథ ఉందా!
అదృష్టం దురదృష్టం: అదృష్టం చేతి గీతల్లో ఉంటుంది అంటారు కొందరు. అయితే కొందరు చేతిలో పుట్టే దురదలో కూడా ఉంటుందంటారు. పలు దేశాల వారు అరచేతిలో పుట్టే దురదతో తమ అదృష్ట దురదృష్టాలను అంచనా వేసుకుంటున్నారు. నమ్మనివారికి ఇది విచిత్రం. నమ్మేవారికి ఓ బలమైన విశ్వాసం. అరచేయి దురదపెడితే ఏదో జరుగుతుందన్న నమ్మకం ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాల నుంచీ జనం దీన్ని నమ్ముతున్నారని తెలుస్తోంది. అయితే ఎక్కడా, ఏ ఒక్కరూ కూడా ఈ నమ్మకం ఎలా పుట్టింది అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాగని తమ విశ్వాసాన్ని కూడా పక్కన పెట్టలేకపోతున్నారు. మన దేశంలో అరచేయి దురద పెడితే డబ్బులు వస్తాయని అంటారు. అయితే ప్రపంచంలోని పలు దేశాలవారు అదృష్టంతో పాటు దురదృష్టం కూడా కలుగుతుందని అంటున్నారు. కుడి అరచేయి దురద పెడితే మంచి జరుగుతుందని, ఎడమది పెడితే చెడు జరుగుతుందని కొందరు అంటే... కొన్ని దేశాల్లో మాత్రం ఇది రివర్సులో ఉంది. కుడి చేయి కనుక దురద పెడితే.. సంపద సర్వనాశనమైపోతుందట. ఎక్కడలేని ఖర్చులూ ఒకేసారి వచ్చి చుట్టుముడతాయట. దివాలా తీసి రోడ్డున పడేంత వరకూ శని వదలదట. అయితే ఎడమ చేయి దురద పెడితే... ఊహించని సంపద వెతుక్కుంటూ వస్తుందట. పేదవాడిని పేద్ద ధనవంతుడిగా మార్చేస్తుందట. కొన్ని దేశాల్లో అయితే... చేతి దురద అనేది శక్తికి సంబంధించినది అన్న నమ్మకం కూడా ఉంది. మనిషిలో అంతర్గతంగా ఒక గొప్ప శక్తి ఉంటుందని, ఆ శక్తి, మనిషి అరచేతుల గుండా ప్రవహిస్తూ ఉంటుందని అంటారు వారు. అంతేకాదు, కుడి చేయి శక్తి వంతమైనదని, ఎడమచేయి బలహీనమైనదని నమ్ముతారు. అందుకే కుడి అర చేయి దురదపెడితే శక్తి పెరుగుతుందని, ఎడమచేయి దురదపెడితే శక్తి క్షీణిస్తుందని నమ్ముతారు. ఆ విధంగా శక్తి క్షీణించిపోయి అతడు మరణానికి చేరువవుతాడని కూడా చెబుతారు. మరి రెండు చే తులూ ఒకేసారి దురద పెడితే ఏంటి పరిస్థితి? ఉంది. దాని గురించీ ఒక విశ్వాసం ఉంది. రెండు చేతులూ కనుక ఒకేసారి దురదపెడితే... కచ్చితంగా మంచే జరుగుతుందట. అదృష్టమే వరిస్తుందట. కాబట్టి దిగులు చెందాల్సిన పని లేదు అంటారు. అసలు ఎలా నమ్మాలి వీటిని? దురద అనేది శరీరానికి కలిగే ఒక ఇబ్బంది. అపరిశుభ్రత వల్లనో, చర్మ సమస్య వల్లనో, ఏదైనా పురుగు వంటిది వాలడం వల్లనో, ఏదైనా కీటకం కుట్టడం వల్లనో కూడా దురద పుడుతుంది. మరి అలాంటిదాని గురించి ఇన్ని విశ్లేషణలు, ఇన్ని వివరణలు ఏమిటో అర్థం కాదు. అయినా శరీరంలో ఎక్కడ దురద పుట్టినా రాని అదృష్ట దురదృష్టాలు అరచేతిలో దురద పుడితేనే ఎందుకు వస్తాయి అంటే సమాధానం కూడా దొరకదు. కాబట్టి... దీనిని నమ్మాలో వద్దో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే! కుడి అరచేయి దురద పెడితే ఓ కొత్త వ్యక్తి జీవితంలోకి వస్తారని ఐర్లాండు వారు భావిస్తారు! అమెరికాలో ఉన్న అటవీ ప్రాంతంలో నివసించే కొన్ని తెగల వారు... కుడి అరచేయి దురద పెడితే అదృష్టంగా భావిస్తారు. ఎడమ అరచేయి దురద పెడితే కంగారు పడిపోతారు. వెంటనే ఎడమ చేతిలో ఉమ్మి వేసి, ఆ చేతిని నడుము దగ్గర రుద్దుకుంటారు. అలా చేస్తే ఏ ఆపదా రాదంటారు! హంగేరీ వారు... అరచేయి కనుక దురద పెడితే వెంటనే జుట్టుతో చేతిని రుద్దుకుంటారు. తర్వాత అదే చేతితో జుట్టును ఒడిసిపడతారు. మొత్తం జుట్టుని ఒడిసి పట్టుకుంటే అదృష్టం వరిస్తుందట. అలా కాకుండా కాస్త బయట ఉండిపోతే కష్టాలు తప్పవని విశ్వసిస్తారు! రెండు చేతులూ ఒకేసారి దురదపెడితే... వెంటనే చేతుల్ని జేబుల్లో ఉంచుకోవాలట. అప్పుడా అదృష్టం ఎక్కడికీ పోదని పలు ఐరోపా దేశాల వారు నమ్ముతారు!