ప్యాక్ చేసి విక్రయించే వస్తువులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్యాకేజీపై తెలియజేయాలని భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ డ్రాఫ్ట్(ముసాయిదా)ను జారీ చేసింది. అందులో భాగంగా లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్ 2011లో సవరణలు చేయాలని ప్రతిపాదించింది.
ఈ సవరణలు ఆమోదం పొందితే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్కెట్‌లో విక్రయించే ప్యాకేజ్డ్ కమోడిటీలు అన్నింటికీ ఈ నియమాలు వరిస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం.. అన్నిరకాల వినియోగ వస్తువుల ప్యాక్‌లపై తయారీదారు/ ప్యాకర్/ దిగుమతిదారు పేరు, చిరునామా, వారి మాతృదేశం, ఆ వస్తువుల కామన్, జనరిక్ పేరు, నికర పరిమాణం, తయారు చేసిన నెల, సంవత్సరం, గరిష్ఠ చిల్లర ధర, ఒక్కో యూనిట్ అమ్మకం ధర, ఏ తేదీలోపు వినియోగించాలి, వినియోగదారుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలు ఉండాలి. అన్ని బ్రాండ్లకూ ఒకేరకమైన విధానం అమలుచేయడం వల్ల వినియోగదారులకు ఆ వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే వీలవుతుందని ప్రభుత్వం తెలిపింది.
జులై 29, 2024లోపు ప్రతిపాదిత సవరణలపై వినియోగదారులు, తయారీదారులు తమ అభిప్రాయాలను కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖకు సమర్పించవచ్చని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు
ఈ ప్రతిపాదనల నుంచి మినహాయింపు ఉన్న వస్తువులు
25 కిలోగ్రాములు లేదా 25 లీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ప్యాకేజీలు.
50 కేజీలు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో విక్రయించే సిమెంట్, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు.
పారిశ్రామిక లేదా సంస్థాగత వినియోగదారుల కోసం ఉద్దేశించిన ప్యాకేజీ వస్తువులు.
Comments
Please login to add a commentAdd a comment