హాస్టల్ విద్యార్థులతో ‘చంద్రన్న’ చెలగాటం | Student hostel with the 'Will' Ileana | Sakshi
Sakshi News home page

హాస్టల్ విద్యార్థులతో ‘చంద్రన్న’ చెలగాటం

Published Wed, Apr 13 2016 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

Student hostel with the 'Will' Ileana

పేద బిడ్డల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. చదివించుకోలేక సంక్షేమ హాస్టల్‌లో చేర్చితే ప్రజాప్రతినిధులు, అధికారులు ‘హాస్టల్లో ఉండేవాళ్లకు ఏమైతే నేం’ అడిగేదెవరన్నట్టు ప్రవర్తిస్తున్నారు. తమకు గుర్తుకొచ్చినప్పుడు హాస్టల్లో నిద్రించి, పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యమంటూ ప్రకటనలు ఇస్తారు. ఫొటోలకు ఫోజులిస్తారు. నిజానికి ఆ పిల్లల పట్ల అధికారులకున్న ప్రేమ ఏపాటిదో ఇటీవల హాస్టళ్లకు అందించిన సరుకులే చెబుతున్నాయి.


చంద్రన్న కానుకల పేరుతో రేషన్‌షాపులకు ఇటీవల పంపినవి కొంతమంది వినియోదారులు నాసిరకంగా ఉన్నాయని తీసుకోలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల సరుకులు మిగిలిపోయాయి. సగానికి సగం పురుగులు పట్టాయి. వాటిని సంక్షేమ హాస్టళ్లకు తరలించి విద్యార్థులకు ఆహార పదార్థాలు తయారుచేసి వడ్డిస్తున్నారు.

 

 

 తిరుచానూరు:

 తిరుపతిలోని హాస్టళ్లలో చంద్రన్న సరుకులతో త యారు చేసిన ఆహార పదార్థాలను  విద్యార్థులు తినలేక పోతున్నారు. తిరుపతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలురు, బాలికల సంక్షేమ గృహాలున్నాయి. వీటిలో 3నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు సుమారు 800మంది ఉన్నారు. వీరికి  రోజూ ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం వడ్డిస్తా రు. ఇందుకోసం ప్రభుత్వం నిత్యావసర సరుకులను  అంది స్తుంది.   ఇటీవల  కాలం చెల్లిన చంద్రన్న కానుక సరుకులను రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలకు సరఫరా చేసింది.ఇందులోని గోధుమ పిండి, రంగుమారిన బెల్లం, పుచ్చిన కంది పప్పు, శెనగపప్పు ఉన్నాయి. వీటినే ఆహార పదార్థాలలో వినియోగిస్తున్నారు. జనవరి 2015లో తయారుచేసిన గోధుమ పిండి ప్యాకెట్లపైన రెండు నెలలలోపు వాడాలని ముద్రించి కూడా ఉన్నారు. గడువు తేదీ దాటి ఏడాదిపైనే గడిచిన గోధుమ పిండి ప్యాకెట్లను సరఫరా చేశారు. ఇవి పురుగులు పట్టి ఉన్నాయి. వీటినే జల్లించి పిల్లలకు చపాతీ, పూరీలు తయారు చేస్తున్నారు. పురుగులు పట్టిన కంది పప్పులతో సాంబారు తయారు చేస్తున్నారు. పేద విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వ పెద్దలు శ్రద్ధచూపాలని, నాసిరకం, కాలం చెల్లిన ఆహారపదార్థాలను సరఫరా చేయడం మానుకోవాలని విద్యావేత్తలు, మేధావులు కోరుతున్నారు. నాశిరకం వస్తువులతో తయారు చేసిన పదార్థాలు తింటే పౌష్టికాహరం మాట అటుంచితే లేనిపోని రోగాలు వ స్తాయని వైద్యాధికారులు చెబతున్నారు.

 నాణ్యత కొరవడింది..

 పీలేరు /వాల్మీకిపురం/ గుర్రంకొండ: నియోజకవర్గ పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు పంపిణీ చేసిన నాణ్యతలేని చంద్రన్న సరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు.  ఈ పదార్థాలు తినలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని పీలేరు, కేవీ పల్లె, కలకడ, గుర్రంకొండ, కలికిరి, వాల్మీకిపురం మండలాల్లోని హాస్టళ్లకు కాలం చెల్లిన చంద్రన కానుకలను గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చే శారు.  సరఫరా చేసిన  సరుకుల్లో నాణ్యత కొరవడింది.  కా లం చెల్లిన గోధువు పిండి ప్యాకెట్‌పై వూర్కర్‌తో తేదీ వూ ర్పు చేసి ఉన్నారు. రంగువూరిన, నాణ్యత లేని  కంది ప ప్పు, బుడ్డశెనగలు, బెల్లం సరఫరా చేశారు. కందిపప్పు సగానికిపైగా పుచ్చిపోరుు రంగువూరి మగ్గిపోయి ఉంది. గోధువు పిండిలో కూడా నాణ్యత కొరవడింది. ప్యాకింగ్ కవర్‌పై ఉన్న 2015 సంవత్సరంలోని 5ను వూర్కర్‌తో 6గా వూర్చిన విషయుం స్పష్టం గా కనిపిస్తోంది.  ఈ లెక్కన ఏడాది క్రితం తయూరు చేసిన గోధువు పిండినే ప్రస్తుతం చంద్రన్న కానుకల్లో పంపిణీ చేసారనే విషయుం స్పష్టంగా అర్థవువుతోంది. గోధువు పిండిలో  పురుగులు ఉన్నాయని విద్యార్థులు అంటున్నారు. రంగువూరిన బెల్లంతోనే  పాయుసం చేసి పెడుతున్నారు. వీటితో తయారు చేసే ప దార్థాలు తిని విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు.    ఉచితంగా ఇస్తున్నావుని ఇలాంటి సరుకులను హాస్టళ్లకు అంటగట్టడం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తలి ్లదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయుమై హాస్టల్ వార్డన్లను వివరణ కోరగా,   గోధువు పిండిని జల్లెడ పట్టి వాడుకుంటున్నావుని చెబుతున్నారు. రంగువూరిన, పనికిరాని బెల్లంను పారవేస్తున్నావుని పేర్కొంటున్నారు. పై అధికారుల ఆదేశాలను పాటిస్తున్నామని చెబుతున్నారు.

 అన్నీ నాసిరకమే..

 వి.కోట :  వుండలంలోని ఎస్సీ బాలురు, బీసీ బా లికల హాస్టళ్లకు చంద్రన్న కానుకల సరుకులను పంపిణీ చేశారు. బాలుర హాస్టల్‌కు పంపిణీ చేసిన గోధువుపిండిలో పురుగులు ఉండడంతో జల్లించి వాడుకుం టున్నారు. కందిపప్పులో పురుగులు ఉన్నాయి. బాలికల హాస్టల్‌కు పంపిణీ చేసిన   వస్తువులు నాణ్యతగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. 

 చెడిన సరుకులు తినిపించేశారు..

 పలమనేరు : పలమనేరు నియోజకవర్గంలో పది సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి.  సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పట్టణంలో మూడు, మండలాల్లో ఏడు సాంఘిక సంక్షేమశాఖ హాస్టళ్ళున్నాయి. చంద్రన్న సంక్రాంతి మిగిలిన సరుకులను హాస్టళ్లకు పంపిణీ చేశారు. సరుకులు నాసిరకంగా ఉన్నాయి. గోధుమపిండి, నెయ్యి మగ్గిన వాసన వస్తున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. కందిపప్పు పుచ్చిపోయి ఉందని, బెల్లం  బంకపట్టి ఉందని చెబుతున్నారు. వీటితోనే పాయసం, తీపి బోం డాలు, తదితరాలను వండి పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం తం చంద్రన్న సరుకులు పూర్తిగా ఖాళీ అయినట్టు వార్డెన్లు చెబుతున్నారు.

 

 

 

 

 పురుగులు కనిపిస్తున్నా..

 తిరుపతి రూరల్ : చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 16 హాస్ట ళ్లు ఉన్నాయి.1348 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో1348 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.  హాస్టళ్లకు  గత నెలలో చంద్రన్న కానుకలకు సంబంధించి గోధుమపిండి 1,860 కిలోలు, పచ్చి శెనగపప్పు  960 కిలోలు, కందిపప్పు 960 కిలోలు, బెల్లం 960 కిలోలు, నెయ్యి 18.6 కిలోలు, పామోలిన్ ఆయిల్ 1,860 లీటర్లను సరఫరా చేశారు. కందిపప్పు పుచ్చిపోయి ఉంది. పురుగులు పైకి కనిపిస్తున్నాయి. పచ్చిశెనగపప్పు సైతం పురుగులు పట్టి ఉంది. బెల్లం రంగుమారి ఉంది. కాలం చెందిన గోధుమ పిండిని సరఫరా చేశారు. వీటితో తయారు చేసిన పదార్థాలనే విద్యార్థులకు వడ్డిస్తున్నారు.

 

 

 కంపుకొడుతున్న బెల్లం

 శ్రీకాళహస్తి:  చంద్రన్న కానుకలో కాలం చెల్లిన బెల్లం,గోధువుపిండి, పామారుుల్,కందిపప్పు, శెనగపప్పును  నియోజకవర్గంలోని 14 హాస్టళ్లకు పంపిణీ చేశారు. సరుకుల్లో నాణ్యత లేకపోవడంతోపాటు దీర్ఘకాలంగా వస్తువులు నిల్వ ఉండడంతో బెల్లం, కందిపప్పు, పా మారుుల్ కంపుకొడుతున్నారుు. గోధువుపిండి, శెనగపప్పు పురుగులు పట్టి ఉన్నాయి. వాటితో తయారు చేసిన పదార్థాలనే  వడ్డిస్తుండడంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా పంపిణీ చేసిన సమయంలో నాశిరకంగా ఉన్నాయని ఫిర్యాదు వెల్లువెత్తినా, సరుకులు బాగా లేవని వార్డెన్లు చెబుతున్నా హాస్టళ్లకు సరఫరా చేయడం పేద విద్యార్థులపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement