welfare hostel
-
గ్యాస్ అయిపోయిందని భోజనం వండని సిబ్బంది
ఓజిలి: వంట గ్యాస్ అయిపోయిందని విద్యార్థులకు వసతిగృహ సిబ్బంది భోజనం తయారు చేయలేదు. ఈ సంఘటన మండల కేంద్రమైన ఓజిలి బీసీ బాలుర వసతిగృహంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గృహంలో 105 మంది విద్యార్థులున్నారు. అయితే 37 మంది మాత్రమే ఉదయం గృహానికి వచ్చి ఉన్నత పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చారు. రాత్రి ఏడు గంటలు దాటినా వారికి భోజనం తయారు చేయలేదు. ఈ విషయం ఓజిలిలోని కొందరు యువకులకు తెలిసింది. వారు వసతిగృహానికి వెళ్లి ప్రశ్నించగా గ్యాస్ అయిపోందని, దీంతో తాము భోజనం వండలేదని సిబ్బంది తెలిపారు. దీంతో యువత స్వచ్ఛందంగా కట్టెలు తీసుకొచ్చి భోజనం తయారు చేయించి తొమ్మిది గంటలకు విద్యార్థులకు వడ్డించారు. అప్పటి వరకు విద్యార్థులు ఆకలితో అలమటించారు. 37 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటే 105 మందికి హాజరు వేసి ఉండడం గమనార్హం. గత నెలలో చిట్టమూరు వసతిగృహం నుంచి వార్డెన్ తిరుపాలయ్య ఓజిలికి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటికి రెండురోజులు మాత్రమే ఆయన హాస్టల్‌కు వచ్చారని చెబుతున్నారు. కానీ రిజిస్టర్లో మాత్రం జూన్ నెల నుంచి సంతకాలు చేసి ఉన్నారు. కాగా ఈ వ్యవహారంపై జిల్లా బీసీ సంక్షేమాధికారిణి రాజేశ్వరిని వివరణ కోరగా వసతిగృహాన్ని పరిశీలించి వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులకు భోజనం తయారు చేయని విషయంపై వార్డెన్ నుంచి వివరణ తీసుకుంటామన్నారు. చిలమానుచేను వార్డెన్ రమణయ్యను హాస్టల్‌కు పంపి విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేస్తామన్నారు. -
చదువు ఇష్టం లేక..
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడో తరగతి చదువుతున్న వేణు(12) దసరా సెలవులకు ఇంటికి వెళ్లి బుధవారం హాస్టల్‌కి తిరిగి వచ్చాడు. ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు. మేళ్లచెరువు మండలం వేపల మాదవరం గ్రామానికి చెందిన వేణు చదువు ఇష్టం లేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చదువు ఇష్టం లేక..
-
ముగ్గురు విద్యార్ధినుల అదృశ్యం
భీమడోలు : పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అదృశ్యమైన విద్యార్థినులు అనప హేమ(9వ తరగతి), జి. నైమిష(10వ తరగతి), మాతంగి సుమాని(10వ తరగతి)గా గుర్తించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి హాస్టల్లో కనపడకపోయేసరికి పాఠశాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హాస్టల్ విద్యార్థులతో ‘చంద్రన్న’ చెలగాటం
పేద బిడ్డల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. చదివించుకోలేక సంక్షేమ హాస్టల్లో చేర్చితే ప్రజాప్రతినిధులు, అధికారులు ‘హాస్టల్లో ఉండేవాళ్లకు ఏమైతే నేం’ అడిగేదెవరన్నట్టు ప్రవర్తిస్తున్నారు. తమకు గుర్తుకొచ్చినప్పుడు హాస్టల్లో నిద్రించి, పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యమంటూ ప్రకటనలు ఇస్తారు. ఫొటోలకు ఫోజులిస్తారు. నిజానికి ఆ పిల్లల పట్ల అధికారులకున్న ప్రేమ ఏపాటిదో ఇటీవల హాస్టళ్లకు అందించిన సరుకులే చెబుతున్నాయి. చంద్రన్న కానుకల పేరుతో రేషన్‌షాపులకు ఇటీవల పంపినవి కొంతమంది వినియోదారులు నాసిరకంగా ఉన్నాయని తీసుకోలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల సరుకులు మిగిలిపోయాయి. సగానికి సగం పురుగులు పట్టాయి. వాటిని సంక్షేమ హాస్టళ్లకు తరలించి విద్యార్థులకు ఆహార పదార్థాలు తయారుచేసి వడ్డిస్తున్నారు. తిరుచానూరు: తిరుపతిలోని హాస్టళ్లలో చంద్రన్న సరుకులతో త యారు చేసిన ఆహార పదార్థాలను విద్యార్థులు తినలేక పోతున్నారు. తిరుపతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలురు, బాలికల సంక్షేమ గృహాలున్నాయి. వీటిలో 3నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు సుమారు 800మంది ఉన్నారు. వీరికి రోజూ ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం వడ్డిస్తా రు. ఇందుకోసం ప్రభుత్వం నిత్యావసర సరుకులను అంది స్తుంది. ఇటీవల కాలం చెల్లిన చంద్రన్న కానుక సరుకులను రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలకు సరఫరా చేసింది.ఇందులోని గోధుమ పిండి, రంగుమారిన బెల్లం, పుచ్చిన కంది పప్పు, శెనగపప్పు ఉన్నాయి. వీటినే ఆహార పదార్థాలలో వినియోగిస్తున్నారు. జనవరి 2015లో తయారుచేసిన గోధుమ పిండి ప్యాకెట్లపైన రెండు నెలలలోపు వాడాలని ముద్రించి కూడా ఉన్నారు. గడువు తేదీ దాటి ఏడాదిపైనే గడిచిన గోధుమ పిండి ప్యాకెట్లను సరఫరా చేశారు. ఇవి పురుగులు పట్టి ఉన్నాయి. వీటినే జల్లించి పిల్లలకు చపాతీ, పూరీలు తయారు చేస్తున్నారు. పురుగులు పట్టిన కంది పప్పులతో సాంబారు తయారు చేస్తున్నారు. పేద విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వ పెద్దలు శ్రద్ధచూపాలని, నాసిరకం, కాలం చెల్లిన ఆహారపదార్థాలను సరఫరా చేయడం మానుకోవాలని విద్యావేత్తలు, మేధావులు కోరుతున్నారు. నాశిరకం వస్తువులతో తయారు చేసిన పదార్థాలు తింటే పౌష్టికాహరం మాట అటుంచితే లేనిపోని రోగాలు వ స్తాయని వైద్యాధికారులు చెబతున్నారు. నాణ్యత కొరవడింది.. పీలేరు /వాల్మీకిపురం/ గుర్రంకొండ: నియోజకవర్గ పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు పంపిణీ చేసిన నాణ్యతలేని చంద్రన్న సరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఈ పదార్థాలు తినలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని పీలేరు, కేవీ పల్లె, కలకడ, గుర్రంకొండ, కలికిరి, వాల్మీకిపురం మండలాల్లోని హాస్టళ్లకు కాలం చెల్లిన చంద్రన కానుకలను గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చే శారు. సరఫరా చేసిన సరుకుల్లో నాణ్యత కొరవడింది. కా లం చెల్లిన గోధువు పిండి ప్యాకెట్‌పై వూర్కర్తో తేదీ వూ ర్పు చేసి ఉన్నారు. రంగువూరిన, నాణ్యత లేని కంది ప ప్పు, బుడ్డశెనగలు, బెల్లం సరఫరా చేశారు. కందిపప్పు సగానికిపైగా పుచ్చిపోరుు రంగువూరి మగ్గిపోయి ఉంది. గోధువు పిండిలో కూడా నాణ్యత కొరవడింది. ప్యాకింగ్ కవర్‌పై ఉన్న 2015 సంవత్సరంలోని 5ను వూర్కర్తో 6గా వూర్చిన విషయుం స్పష్టం గా కనిపిస్తోంది. ఈ లెక్కన ఏడాది క్రితం తయూరు చేసిన గోధువు పిండినే ప్రస్తుతం చంద్రన్న కానుకల్లో పంపిణీ చేసారనే విషయుం స్పష్టంగా అర్థవువుతోంది. గోధువు పిండిలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు అంటున్నారు. రంగువూరిన బెల్లంతోనే పాయుసం చేసి పెడుతున్నారు. వీటితో తయారు చేసే ప దార్థాలు తిని విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఉచితంగా ఇస్తున్నావుని ఇలాంటి సరుకులను హాస్టళ్లకు అంటగట్టడం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తలి ్లదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయుమై హాస్టల్ వార్డన్లను వివరణ కోరగా, గోధువు పిండిని జల్లెడ పట్టి వాడుకుంటున్నావుని చెబుతున్నారు. రంగువూరిన, పనికిరాని బెల్లంను పారవేస్తున్నావుని పేర్కొంటున్నారు. పై అధికారుల ఆదేశాలను పాటిస్తున్నామని చెబుతున్నారు. అన్నీ నాసిరకమే.. వి.కోట : వుండలంలోని ఎస్సీ బాలురు, బీసీ బా లికల హాస్టళ్లకు చంద్రన్న కానుకల సరుకులను పంపిణీ చేశారు. బాలుర హాస్టల్‌కు పంపిణీ చేసిన గోధువుపిండిలో పురుగులు ఉండడంతో జల్లించి వాడుకుం టున్నారు. కందిపప్పులో పురుగులు ఉన్నాయి. బాలికల హాస్టల్‌కు పంపిణీ చేసిన వస్తువులు నాణ్యతగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. చెడిన సరుకులు తినిపించేశారు.. పలమనేరు : పలమనేరు నియోజకవర్గంలో పది సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పట్టణంలో మూడు, మండలాల్లో ఏడు సాంఘిక సంక్షేమశాఖ హాస్టళ్ళున్నాయి. చంద్రన్న సంక్రాంతి మిగిలిన సరుకులను హాస్టళ్లకు పంపిణీ చేశారు. సరుకులు నాసిరకంగా ఉన్నాయి. గోధుమపిండి, నెయ్యి మగ్గిన వాసన వస్తున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. కందిపప్పు పుచ్చిపోయి ఉందని, బెల్లం బంకపట్టి ఉందని చెబుతున్నారు. వీటితోనే పాయసం, తీపి బోం డాలు, తదితరాలను వండి పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం తం చంద్రన్న సరుకులు పూర్తిగా ఖాళీ అయినట్టు వార్డెన్లు చెబుతున్నారు. పురుగులు కనిపిస్తున్నా.. తిరుపతి రూరల్ : చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 16 హాస్ట ళ్లు ఉన్నాయి.1348 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో1348 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. హాస్టళ్లకు గత నెలలో చంద్రన్న కానుకలకు సంబంధించి గోధుమపిండి 1,860 కిలోలు, పచ్చి శెనగపప్పు 960 కిలోలు, కందిపప్పు 960 కిలోలు, బెల్లం 960 కిలోలు, నెయ్యి 18.6 కిలోలు, పామోలిన్ ఆయిల్ 1,860 లీటర్లను సరఫరా చేశారు. కందిపప్పు పుచ్చిపోయి ఉంది. పురుగులు పైకి కనిపిస్తున్నాయి. పచ్చిశెనగపప్పు సైతం పురుగులు పట్టి ఉంది. బెల్లం రంగుమారి ఉంది. కాలం చెందిన గోధుమ పిండిని సరఫరా చేశారు. వీటితో తయారు చేసిన పదార్థాలనే విద్యార్థులకు వడ్డిస్తున్నారు. కంపుకొడుతున్న బెల్లం శ్రీకాళహస్తి: చంద్రన్న కానుకలో కాలం చెల్లిన బెల్లం,గోధువుపిండి, పామారుుల్,కందిపప్పు, శెనగపప్పును నియోజకవర్గంలోని 14 హాస్టళ్లకు పంపిణీ చేశారు. సరుకుల్లో నాణ్యత లేకపోవడంతోపాటు దీర్ఘకాలంగా వస్తువులు నిల్వ ఉండడంతో బెల్లం, కందిపప్పు, పా మారుుల్ కంపుకొడుతున్నారుు. గోధువుపిండి, శెనగపప్పు పురుగులు పట్టి ఉన్నాయి. వాటితో తయారు చేసిన పదార్థాలనే వడ్డిస్తుండడంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా పంపిణీ చేసిన సమయంలో నాశిరకంగా ఉన్నాయని ఫిర్యాదు వెల్లువెత్తినా, సరుకులు బాగా లేవని వార్డెన్లు చెబుతున్నా హాస్టళ్లకు సరఫరా చేయడం పేద విద్యార్థులపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
అదృశ్యమైన బాలిక తండ్రి ఆత్మహత్య..
-
అదృశ్యమైన బాలిక తండ్రి ఆత్మహత్య
పోలీసుల వేధింపులతోనే అంటున్న మృతుడి అన్న గూడూరు: వరంగల్ జిల్లా గూడూరు మండలం గుండెంగ శివారు చర్లతండాలో అదృశ్యమైన బాలిక కవిత తండ్రి బోడ రవి(34) గురువారం తన పంట చేను సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నాడు. కూతురు అదృశ్యమైందన్న అవమానభారంతోనే తన తమ్ముడు రవి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి అన్న మంగీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, మీడియూకు మాత్రం తన తమ్ముడు పోలీసుల బెదిరింపులకు భయపడి ఉరివేసుకున్నాడని చెప్పడం గమనార్హం. చర్లతండాకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బోడ కవిత 2 నెలల క్రితం కనిపించకుండాపోగా, ఈనెల 11న ఆ బాలిక తండ్రి రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానితులను విచారిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నర్సంపేట డీఎస్సీ మురళీధర్ బుధవారం రవిని గూడూరు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వివరాలు అడిగారు. అనంతరం చర్లతండా వాసులతోపాటు, బాలిక తల్లి, చెల్లిని కూడా డీఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రవిని బుధవారం రాత్రి ఇంటికి పంపారు. కూతురు అదృశ్యంతో మానసిక క్షోభకు గురైన రవి.. తాను కూడా చనిపోతానని కుటుంబ సభ్యులతో అన్నాడని తండావాసులు చెపుతున్నారు. కాగా, గురువారం ఉదయం చర్లతండాలోని రవి ఇంటికి వెళ్లిన ఇద్దరు పోలీసులు ‘నీ కూతురు అదృశ్య విషయం నీకు తెలుసని తండావాసులు చెబుతున్నారు. ఈ రోజు మా సార్లు నిన్ను స్టేషన్‌కు పిలిచి వాయిస్తారు (కొడతారని).. కవిత ఎక్కడుందో చెప్పు’ అని అడిగి వెళ్లారని తన తమ్ముడు రవి అందరికీ చెప్పి భయకంపితుడయ్యూడని రవి అన్న బోడ మంగీలాల్ సంఘటనా స్థలంలో మీడియా ప్రతినిధులకు చెప్పాడు. బాలిక నోట్‌బుక్‌లో ఓ విద్యార్థి సంఘ నాయకుడి సెల్ నంబర్ కూడా రాసి ఉన్నదని, అతనికి బాలిక అదృశ్యం విషయం తెలుసునని, పోలీసులు అతన్ని అడగడం లేదని మంగీలాల్ అన్నారు. కాగా, అదృశ్యమైన బాలిక తండ్రి రవి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ జాన్‌వెస్లీ, నర్సంపేట డీఎస్పీ మురళీధర్ గూడూరు ఆస్పత్రికి చేరుకుని రవి మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులను పంపామని, తొందరలోనే ఈ కేసును ఛేదిస్తామని మృతుడి బంధువులతో అన్నారు. -
కుమార్తె అదృశ్యం.. తండ్రి ఆత్మహత్య
-
గిరిజన పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి
మారేడుమిల్లి : గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి లో జరిగింది. మామిడిపల్లి గిరిజన సంక్షేమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నైనా శంకర్ మంగళవారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందాడు. పాఠశాల వర్గాలు మాత్రం శంకర్‌కు గజ్జి, తామర శోకిందని దాని నివారణకు తీసుకున్న సిరఫ్ వికటించడంతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. అయితే విద్యార్థి మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వసతుల కోసం విద్యార్థుల ఆందోళన
పెదబయలు: పాఠశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. విశాఖ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పెదబయలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 650 మంది బాలురు చదువుకుంటున్నారు. మెనూ ప్రకారం భోజనం ఇవ్వటం లేదని, తాగు నీరు సరిగా లేదని ఎన్నిసార్లు ప్రిన్సిపాల్‌కు చెప్పినా స్పందన లేదంటూ మంగళవారం విద్యార్థులంతా తరగతులు బహిష్కరించారు. అనంతరం అక్కడే రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. దీంతో సిబ్బంది వారించినా వారు వినలేదు. అనంతరం ర్యాలీగా తరలి వెళ్లి ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. వారికి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. -
పీడీ కొడుతున్నాడని..
పెదబయలు: వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) విపరితంగా కొడుతున్నాడని ఆరోపిస్తూ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయిన సంఘటన విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి. ధనుంజయ్ తమను విపరితంగా కొడుతున్నారని, అనవసరంగా తిడుతున్నారని.. దీనికి నిరసనగా తరగతులు బహిష్కరించి ఇంటిబాటపట్టామని బ్లాక్ బోర్డులపై రాసిమరీ వెళ్లారు విద్యార్థులు. ఈ ఆశ్రమ పాఠశాలలో మొత్తం 430 మంది విద్యార్థులు ఉండగా.. దాదాపు 400 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. -
బాలిక హాస్టల్లో కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు : నెల్లూరు బస్వాడపాలెంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలిక హాస్టల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్ మొత్తం ఆయన కలియ తిరిగారు. హస్టల్లో అందుతున్న వసతులను ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ సిబ్బంది... నిర్వహణ తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే హాస్టల్ భవనాన్ని నూతనంగా నిర్మిస్తామని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు హామీ ఇచ్చారు. -
పాఠశాలలో విద్యార్థిని మృతి
వికారాబాద్ : అనారోగ్యంతో ఓ విద్యార్థిని మృతిచెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం కొత్తగడిలోని సమీకృత సంక్షేమ బాలికల పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... సంక్షేమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మధురవేణి(14) అనారోగ్యం కారణంగా మృతిచెందిందని సోమవారం పాఠశాల సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే తమ కుమార్తెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, పాఠశాల సిబ్బంది తమకు సరైన సమాచారం అందించకుండా మోసం చేసారని నిరసిస్తూ.. బాలిక తల్లిదండ్రులు పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. హాస్టల్లో అపరిశుభ్రత కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని వారు ఆరోపించారు. -
కలుషితాహారం.. 30 మందికి అస్వస్థత
దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోతవరం గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ వసతిగృహంలో కలుషితాహారం వల్ల 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడి హాస్టల్లో ఉన్న 60 మంది విద్యార్థులు గురువారం పప్పు, క్యాబేజి , కోడిగుడ్డులతో భోజనం చేశాక కొందరు కడుపునొప్పితో బాధపడగా, మరికొందరు కళ్లు తిరిగి పడిపోయారు. స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం 28 మందిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాడైన కోడిగుడ్లు వండడమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ విద్యార్థులను పరామర్శించారు.