దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోతవరం గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ వసతిగృహంలో కలుషితాహారం వల్ల 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడి హాస్టల్‌లో ఉన్న 60 మంది విద్యార్థులు గురువారం పప్పు, క్యాబేజి , కోడిగుడ్డులతో భోజనం చేశాక కొందరు కడుపునొప్పితో బాధపడగా, మరికొందరు కళ్లు తిరిగి పడిపోయారు. స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం 28 మందిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాడైన కోడిగుడ్లు వండడమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ విద్యార్థులను పరామర్శించారు.