నెల్లూరు : నెల్లూరు బస్వాడపాలెంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలిక హాస్టల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్ మొత్తం ఆయన కలియ తిరిగారు. హస్టల్లో అందుతున్న వసతులను ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్ సిబ్బంది... నిర్వహణ తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే హాస్టల్ భవనాన్ని నూతనంగా నిర్మిస్తామని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు హామీ ఇచ్చారు.