పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు.
ముగ్గురు విద్యార్ధినుల అదృశ్యం
Oct 26 2016 11:06 AM | Updated on Nov 9 2018 4:45 PM
భీమడోలు : పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అదృశ్యమైన విద్యార్థినులు అనప హేమ(9వ తరగతి), జి. నైమిష(10వ తరగతి), మాతంగి సుమాని(10వ తరగతి)గా గుర్తించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి హాస్టల్లో కనపడకపోయేసరికి పాఠశాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement