
వాషింగ్టన్: అంతరిక్ష కేంద్రంలోకి అత్యాధునిక అలమర (వస్తువులు దాచి ఉంచుకునే పెట్టె)ను శాస్త్రవేత్తలు త్వరలో తీసుకువెళ్లనున్నారు. హెచ్‌టీవీ–7గా పిలిచే ఈ అలమరను 2018 చివరి కల్లా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశపెట్టనున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) బుధవారం వెల్లడించింది. సైంటిస్టులు అంతరిక్ష కేంద్రంపైకి పరిశోధనలకు అవసరమయ్యే పరికరాలను తీసుకువెళుతుంటారు. అయితే అక్కడ మరిన్ని వస్తువులు దాయడానికి వీలుగా ఆధునిక పరికరాలతో అలమరను తయారు చేస్తున్నట్లు నాసా ప్రకటించింది.
అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది అలమరలను పొందుపరిచే వీలున్నట్లు నాసా వెల్లడించింది. ఈ అలమరలను బోయింగ్ కంపెనీ తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఈ అలమరలో పరిశోధనలకు ఉపయోగపడే ప్రామాణిక ఈథర్నెట్ కేబుల్ వైర్లను ఉంచనున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment