బీజింగ్: చైనా తన డ్రీమ్ మిషన్ అయిన షెంజౌ-19ను విజయవంతంగా ప్రయోగించింది. చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈరోజు (బుధవారం)తెల్లవారు జామున 4.27 గంటలకు (చైనా కాలమానం ప్రకారం) ఈ మిషన్ ఆకాశంలోకి దూసుకెళ్లింది.
ఈ మిషన్‌లో భాగంగా ఒక మహిళా స్పేస్ ప్లైట్ ఇంజనీర్‌తో సహా ముగ్గురు వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు బయలుదేరారు. షెంజౌ-19 నింగిలోకి దూసుకెళ్లిన పది నిమిషాల అనంతరం ఆ వ్యోమగాములతో కూడిన అంతరిక్ష నౌక రాకెట్ నుండి విడిపోయి దాని కక్ష్యలోకి ప్రవేశించింది. వ్యోమగాములంతా క్షేమంగా ఉన్నారని, ప్రయోగం విజయవంతమైందని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ వెల్లడించింది.
Congratulations to the successful launch of #Shenzhou19 crewed spaceship🚀 and wish the 3 astronauts all the best! #SpaceChina pic.twitter.com/v26V0pAExK
— CAI Run 蔡润 (@AmbCaiRun) October 29, 2024
ఈ షెంజౌ-19లో మిషన్ కమాండర్ కై జుబేతో పాటు వ్యోమగాములు సాంగ్ లింగ్ డాంగ్, వాంగ్ హవోజ్ ఉన్నారు. కై జుబే ఎంతో అనుభవజ్ఞుడైన వ్యోమగామి. దీనికి ముందు ఆయన 2022లో షెంజౌ-14 మిషన్‌లో పాల్గొని అంతరిక్షంలో ప్రయాణించారు. వాంగ్ ప్రస్తుతం చైనాలో ఏకైక మహిళా అంతరిక్ష ఇంజనీర్‌గా పేరొందారు. ఆమె అంతరిక్ష యాత్రకు వెళ్లిన మూడో చైనా మహిళ అని స్పేస్ ఏజెన్సీ మీడియాకు తెలిపింది.
ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment