బీజింగ్/జియుక్వాన్: అగ్రరాజ్యాలకు దీటుగా అంతరిక్షంలో పాగా వేయడమే లక్ష్యంగా చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చైనా ముగ్గురు వ్యోమగాములను నిర్మాణంలో ఉన్న తమ స్పేస్ స్టేషన్‌లోని కోర్ మాడ్యూల్ ‘తియాన్హే’లోకి విజయవంతంగా పంపించింది. గోబీ ఎడారిలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9.22 గంటలకు షెన్‌జౌ–12 అంతరిక్ష నౌక ముగ్గురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది.
6.50 గంటల పాటు నిరాటంకంగా ప్రయాణించి, మధ్యాహ్నం 3.54 గంటలకు కోర్ మాడ్యూల్‌ను చేరుకుంది. ముగ్గురు వ్యోమగాములు మూడు నెలలపాటు అక్కడే ఉంటారు. స్పేస్‌స్టేషన్ నిర్మాణంలో పాలుపంచుకుంటారు. భూగోళంపై తమ నిఘా నేత్రంగా భావిస్తున్న సొంత స్పేస్‌స్టేషన్‌ను వచ్చే ఏడాదికల్లా సిద్ధం చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. కోర్ మాడ్యూల్ తియాన్హేను ఈ ఏడాది ఏప్రిల్ 29న చైనా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చైనాలో ఆర్బిట్ స్పేస్‌స్టేషన్‌ను నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment