పాడైన బాల సంజీవిని సరుకులు
శ్రీకాకుళం, జలుమూరు: గర్భిణులు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా ప్రభుత్వం బాల సంజీవిని అందిస్తోంది. దీని కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి నెలనెలా అందిస్తుంటారు. అయితే కోటబొమ్మాళి ప్రాజెక్టు పరిధి జలుమూరులో ఇప్పటికీ ఈ సంజీవని ప్యాకెట్లను అందించలేదు. దీనిపై ఆరా తీయగా స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి తీరిక లేక రాలేదని, ఆయన వచ్చిన తర్వాత పంపిణీ చేస్తారని ఐసీడీఎస్ సిబ్బంది ఆ శ్చర్యకర సమాధానం చెప్పారు. అయితే ఎమ్మెల్యే రాకపోవడం వల్ల ఎప్పుడో వచ్చిన సరుకులు పా డైపోయాయి. అంగన్‌వాడీ కార్యకర్తలు కూడా దీని పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాల సం జీవినిలో పాలు, గుడ్లు, న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, బెల్లం, ఎండు ఖర్జూరం, బెన్సీరవ్వ ఇలా ఆరు రకాలు అందించాలి. గత నెలలో వచ్చిన సరుకులను ఇప్పటికీ లబ్ధిదారులకు అందించలేదు. దీంతో సరుకులన్నీ పాడైపోయి కంపు కొడుతున్నాయి.
అలాగే ఈ ఏడాది మే నెల నుంచి అంది స్తున్న నాంది ఫుడ్ కూడా అన్ని కేంద్రాలకు పంపిణీ కాలేదు. సూపర్‌వైజర్లే వీటిని పట్టుకుపోతున్నారని అంగన్‌వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. దీనిపై కోటబొమ్మాళి సీడీపీఓ అనురాధను సంప్రదించగా ఎమ్మెల్యే చేతులమీదుగా బాల సం జీవిని అందిస్తామన్నారు. పాడైన సరుకులపై కలెక్టర్‌కు సమాచారం అందించామని, వాటిని పం పిణీ చేయబోమని తెలిపారు. సరుకుల నాణ్యత చూసి సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. నాంది ఫుడ్‌పై ఫిర్యాదులు పరిశీలిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment