రేషన్‌ అందటం లేదని ఆందోళన | Ration Goods Lack Not worry | Sakshi
Sakshi News home page

రేషన్‌ అందటం లేదని ఆందోళన

Published Sat, Oct 12 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

Ration Goods Lack Not worry

కోటబొమ్మాళి,న్యూస్‌లైన్‌: తమకు మూడు నెలలుగా రేషన్‌ సరుకులు అందడంలేదని కురుడు పంచాయతీ బావాజీపేట గ్రామస్తులు శుక్రవారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తహశీల్దార్‌ ప్రవల్లికప్రియ అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌ ద్వారా ఆమెకు సమస్యను వివరించా రు. రేషన్‌ సరుకులు ఇవ్వాలని కోరితే .. ఇచ్చేదిలేదని, దిక్కున్నచోట చెప్పుకోండంటూ డీలర్‌ తండ్యాల లలితకుమారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. డిపో పరిధిలో సుమారు వంద తెలుపుకార్డులున్నాయని, రేషన్‌ సరుకులు అందకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామ ని తెలిపారు. తహశీల్దార్‌ స్పందిస్తూ సీఎస్‌డీటీతో దర్యాప్తు జరిపించి డీలర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement