సరుకు రవాణా అవసరాల కోసం ఎక్కువ మొత్తంలో బరువు తీసుగల టూ వీలర్ కోసం చేస్తున్నారా.. అది కూడా ఎలక్ట్రిక్ బండి (Electric Scooter) కావాలా.. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి పరిశీలించండి..
పొలం దగ్గరకు వెళ్లడానికి, ఎరువు బస్తాలు, కూరగాయలు, ఇతర బరువైన వస్తువులు తీసుకువెళ్లడానికి కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0 ( KOMAKI XGT CAT 2.0) సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది ఏకంగా 350 కేజీల బరువునైనా లాగగలదు. రైతులు, కూరగాయలు, ఇతర చిరు వ్యాపారులు, దుకాణదారులు ఈ బండిలో సరుకు రవాణా చేయవచ్చు. పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు. ఇంకా మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే.
రేంజ్, ఫీచర్లు, ధరలు
కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0 బండిని ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఎక్స్‌ట్రా క్యారియర్, బీఎల్‌డీసీ హబ్ మోటార్, పార్కింగ్ అసిస్ట్, ఆటో రిపేర్, మల్టీపుల్ సెన్సార్స్, సెల్ఫ్ డయాగ్నసిస్, వైర్‌లెస్ అప్‌డేట్స్, స్మార్ట్ డ్యాష్ బోర్డ్, బ్యాక్ ఎల్ఈడీ లైట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
అలాగే ఎకో, స్పోర్ట్, టర్బో అనే మూడు రైడింగ్ మోడ్స్ ఇందులో ఉంటాయి. మొబైల్ చార్జింగ్ పాయింట్, లాక్ బై రిమోట్, టెలీస్కోపిక్ షాకర్, రిపేర్ స్విచ్, యాంటీ థెఫ్ట్ లాక్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఫోల్డబుల్ సీటు మరో ప్రత్యేకత.
ఇక కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0లో రెండు వేరియంట్‌లు ఉన్నాయి. కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న దాని ప్రకారం.. 72వీ 31 ఏహెచ్ వేరియంట్ ధర రూ.1.01 లక్షలు . దీని రేంజ్ 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 72వీ 44 ఏహెచ్ వేరియంట్ ధర రూ. 1.14 లక్షలు. దీని రేంజ్ 150 కిలోమీటర్ల వరకు ఉంది.
ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్ బైక్‌లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం!
Comments
Please login to add a commentAdd a comment