heavy weight
-
ఈ ఎలక్ట్రిక్ బండి 350 కేజీలు మోస్తుంది.. ఒక్కసారి చార్జ్‌కి 150 కిలోమీటర్లు!
సరుకు రవాణా అవసరాల కోసం ఎక్కువ మొత్తంలో బరువు తీసుగల టూ వీలర్ కోసం చేస్తున్నారా.. అది కూడా ఎలక్ట్రిక్ బండి (Electric Scooter) కావాలా.. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి పరిశీలించండి.. పొలం దగ్గరకు వెళ్లడానికి, ఎరువు బస్తాలు, కూరగాయలు, ఇతర బరువైన వస్తువులు తీసుకువెళ్లడానికి కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0 ( KOMAKI XGT CAT 2.0) సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది ఏకంగా 350 కేజీల బరువునైనా లాగగలదు. రైతులు, కూరగాయలు, ఇతర చిరు వ్యాపారులు, దుకాణదారులు ఈ బండిలో సరుకు రవాణా చేయవచ్చు. పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు. ఇంకా మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే. రేంజ్, ఫీచర్లు, ధరలు కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0 బండిని ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఎక్స్ట్రా క్యారియర్, బీఎల్డీసీ హబ్ మోటార్, పార్కింగ్ అసిస్ట్, ఆటో రిపేర్, మల్టీపుల్ సెన్సార్స్, సెల్ఫ్ డయాగ్నసిస్, వైర్లెస్ అప్డేట్స్, స్మార్ట్ డ్యాష్ బోర్డ్, బ్యాక్ ఎల్ఈడీ లైట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఎకో, స్పోర్ట్, టర్బో అనే మూడు రైడింగ్ మోడ్స్ ఇందులో ఉంటాయి. మొబైల్ చార్జింగ్ పాయింట్, లాక్ బై రిమోట్, టెలీస్కోపిక్ షాకర్, రిపేర్ స్విచ్, యాంటీ థెఫ్ట్ లాక్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఫోల్డబుల్ సీటు మరో ప్రత్యేకత. ఇక కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0లో రెండు వేరియంట్లు ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం.. 72వీ 31 ఏహెచ్ వేరియంట్ ధర రూ.1.01 లక్షలు . దీని రేంజ్ 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 72వీ 44 ఏహెచ్ వేరియంట్ ధర రూ. 1.14 లక్షలు. దీని రేంజ్ 150 కిలోమీటర్ల వరకు ఉంది. ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్ బైక్‌లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం! -
Sakshi Cartoon: ఊబయకాయ కౌగిలిలో దేశం
ఊబయకాయ కౌగిలిలో దేశం.. అధికమవుతున్న బాధితుల సంఖ్య -
బరువుగా పెంచకండి
కొంతమంది తల్లులు పిల్లల మీద ప్రేమతో వారు వద్దంటున్నా వినకుండా కొసరి కొసరి తినిపిస్తారు. తల్లులతోపాటు నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యల వంటి వారు కూడా లేకలేక పుట్టారనో, బోలెడంత మంది ఆడపిల్లల్లో ఒక్కగానొక్క మగపిల్లాడని లేదా అందరు మగపిల్లల మధ్య మహాలక్ష్మి లా ఒకే ఆడపిల్ల అనో అతిగా గారం చేసి వారికి అతిగా తినిపిస్తారు. దాంతో పిల్లలు విపరీతంగా బరువు పెరిగిపోతారు. బొద్దుగా ఉంటే ముద్దుగానే ఉంటారు కానీ, క్రమేణా ఆ బొద్దుతనం కాస్తా ఊబకాయంగా మారిపోతుంది. ఫలితంగా పెద్దయ్యేకొద్దీ రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. దేనినైనా చేతులు దాటకముందే పరిష్కరించుకోవాలి లేదంటే డాక్టర్ల దాకా వెళ్లాల్సి వస్తుంది. పిల్లలు బొద్దుగా ఉండటం కాదు... ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. లావుగా ఉండే పిల్లల ఆహారపుటలవాట్లలో, జీవనశైలి లో చిన్నచిన్న మార్పులు చేస్తే వారు ఆరోగ్యంగా పెరుగుతారు. దీనిపై అవగాహన కోసం... కొంతమంది పిల్లలు లావుగా ఉన్నప్పటికీ, టీనేజీకొచ్చేసరికి సన్నబడిపోతారు. కానీ ఒక్కోసారి అలా జరగకపోవచ్చు. ఒక పరిశోధన ప్రకారం 5.5 ఏళ్ల వయసులో బరువు ఎక్కువ ఉన్న పిల్లలలో 60 శాతం మంది 20 ఏళ్ల వయస్సులో కూడా బరువు ఎక్కువే ఉన్నారు. రెండున్నర ఏళ్ల వయసులో బరువు ఎక్కువ ఉన్న పిల్లలలో 44 శాతం మంది 16 ఏళ్ల వయస్సులో కూడా ఎక్కువ బరువే ఉన్నారు. ఎందుకంటే, వయసు పెరిగిన కొద్దీ, కాస్తో కూస్తో లావెక్కడం సహజం. అలాగని చిన్నప్పుడు సన్నగా ఉన్నవారు పెద్దయ్యాక లావెక్కరని కాదు. చిన్నప్పటినుంచి ఉన్న బరువు అలాగే కొనసాగడం వల్ల వారు రకరకాలయిన ఇబ్బందులు పడతారు. స్కూల్లో, కాలేజీలో తోటిపిల్లలు వారికి పేర్లు పెడతారు. అదేవిధంగా తమకు నచ్చిన దుస్తులు ధరించలేరు. పిల్లలు టీనేజీలోకి వచ్చాక సామాజికంగా వారే తెలుసుకుని తాము తగ్గాలో పెరగాలో అనేది వారే డిసైడ్ చేసుకుంటే అది ఒక రకం కానీ, పెద్దల గారం మూలంగా బరువు పెరిగిన పిల్లలు పెద్దయ్యాక స్థూలకాయులుగా తయారు కాకుండా ఏం చేయాలో చూద్దాం. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచాలి: చాక్లెట్లు, స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ఫుడ్స్ వంటివి అలవాటు చెయ్యకుండా ఉండడం అత్యవసరం. బరువు పెంచే లక్షణాలు వాటిలోనే అధికంగా ఉంటాయి. పైగా ఆయా పదార్థాల రుచిని పెంచడం కొరకు అజీనమోటో వంటి హానికర రసాయన పదార్థాలు కలుపుతారు. అవి పిల్లల శారీరక ఎదుగుదలతోపాటు మెదడులోని నరాల ఎదుగుదలను దెబ్బతీస్తాయి కాబట్టి అటువంటి వాటిని అతిగా ఇవ్వకుండా అప్పుడప్పుడు మాత్రమే తినిపించాలి. ఇక ఇంట్లో చేసిన ఆహారపదార్థాలలో కూడా రుచి కోసం విపరీతంగా నూనెపోసి చేసే వేపుడు కూరలు, మసాలాలు, నెయ్యితో తయారు చేసిన స్వీట్లు కూడా పరిమితికి మించి తినిపించకూడదు. అవి తినకుండా ఉండలేని స్థితికి తీసుకుని రాకూడదు. అంత అతిగా అలవాటు చెయ్యకూడదు. పిల్లలు స్కూల్‌కు వెళ్ళే సమయంలో స్నాక్స్ కావాలని మారాం చెయ్యడం సహజం. అటువంటి సందర్భాల్లో చాక్లెట్లు, చిప్స్ వంటి వాటి బదులు ఇంటిలో చేసిన పల్లీపట్టీలు, బెల్లం వేరుశనగ ఉండలు, మినప సున్నిఉండలు, నువ్వుల ఉండలు, ఇంట్లోనే చేసిన బూందీ, కారా వంటివి ఇవ్వడం ఉత్తమం. పిల్లలు ఏం తినాలి? ఎంత తినాలి? ఎలా తినాలి? జంక్ ఫుడ్ నుండి పిల్లలను ఎలా రక్షించుకోవాలి? బిడ్డకు ఊబకాయం వచ్చేసిన తరవాత తల్లిదండ్రులు చెయ్యగలింగింది ఎక్కువ ఉండదు. అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మన్యూనతాభావం: బిడ్డ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పనులు, మాటలకు దూరంగా ఉండటం ఉత్తమం. పొట్టమాడ్చకూడదు: పిల్లలు లావు అవుతున్నారు కదా అని ఒక్కసారిగా తిండి తగ్గించడానికి ప్రయత్నం చెయ్యకండి. ఆలా చేస్తే వారి పసిమనసుకు తప్పుడు సంకేతాలు వెళతాయి. మెల్లి మెల్లిగా తగ్గించాలి. తక్కువ క్యాలరీలుండే మరమరాలు, అటుకులు, పుచ్చకాయ, బొప్పాయి ముక్కలు వంటి వాటిని ఎక్కువ అలవాటు చెయ్యాలి. వ్యాయామం: శారీరక శ్రమను ప్రోత్సహించండి. వారి చేత గార్డెనింగ్ చేయించడం, చిన్న చిన్న దూరాలు నడిపించడం, లిఫ్ట్‌కు బదులుగా మెట్లెక్కేలా చేయడం వంటివి. మానసిక ఆరోగ్యం: బిడ్డ ఎక్కువ తినటానికి కారణం వత్తిడి, ఆందోళన, అభద్రతా భావం కావచ్చును. సందర్భాన్ని బట్టి నిపుణులను సంప్రదించండి. జీవనశైలి: ఏవైనా మార్పులు ఎల్లకాలం పాటించగలిగేలా ఉండాలి. రోజూ స్నానం చేసినట్లు, లేదా పళ్ళు తోముకున్నట్లు. మార్పులు జీవనశైలిలో భాగం కావాలి. అంతేకానీ, జబ్బుకన్నా మందు కష్టం కాకూడదు. నిరంతరం బరువు తగ్గటం లేదన్న భావనతో బాధ పడటం కన్నా ఊబకాయంతో బాధపడటం కొంతలో కొంత మేలు. -
Hyderabad: 50% మంది మహిళలకు ఒకే సమస్య.. కారణమదే అంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య 15వేల దాకా ఉంటుంది. కిడ్నీ సమస్యలున్నవారు లక్ష మంది దాకా ఉంటారని కేర్ ఆస్పత్రి వైద్యుడు డా.వంశీకృష్ణ చెబుతున్నారు. మొత్తం కిడ్నీ రోగుల్లో 40 శాతం మందికి అధిక రక్తపోటుతో కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతుందంటున్నారాయ. దురదృష్టకర విషయమేంటంటే వీరిలో ఎవరికి తాము రక్తపోటు బాధితులమని తెలియకపోవడం. తాజాగా నగరానికి చెందిన 51 శాతం మంది మహిళలు అధిక బరువుతో లేదా తమ బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 25కేజీ/ఎమ్2 కన్నా ఎక్కువగా లేదా సమానమైన ఒబెసిటీతో బాధపడుతున్నారని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ (సీఎస్డీ) వెల్లడించింది. రాష్ట్ర ప్రణాళిక శాఖ కోసం ప్రచురించినదీ సారాంశం. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన వివరాలతో రూపొందించిన గణాంకాలివీ. దీనిలో నగరం అత్యధిక శాతం అధిక బరువున్న మహిళలతో ముందంజలో ఉండడం గమనార్హం. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అన్నీ ఉన్నా...ఆరోగ్యం? నిజానికి నగరంలో విద్యాధికులకు కొదవలేదు. వైద్య సౌకర్యాలకు కొరత లేదు. అయినప్పటికీ డయాబెటిస్ మొదలుకుని ఏ వ్యాధికి సంబంధించి చూసినా నగరంలోనే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్టు పలుమార్లు అధ్యయనాలు వెల్లడించాయి. శారీరక శ్రమ కరువైన జీవనశైలి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వినియోగం, సూర్య కాంతికి ఎక్కువగా తగలకపోవడం... వంటివి నగర మహిళల్ని అధిక బరువు దిశగా నడిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘కోవిడ్ నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి పద్ధతులు కొత్తగా వచ్చాయి. ఈ పరిణామం చాలా మందిని ఊబకాయులుగా మార్చింది. నగరాల్లో ఒత్తిడి స్థాయి ఎక్కువగా ఉండడం కూడా మరో కారణం’ అని న్యూట్రిషనిస్ట్ సుజాత స్టీఫెన్ అభిప్రాయపడ్డారు. వేగం.. నగర జీవననాదం.. నగర జీవనంలో ఉరుకులు పరుగులు సర్వసాధారణంగా మారాయి. రోజుకు 24 గంటలు ఉంటున్నా సరిపోవడం లేదన్నట్టుగా తయారైంది పరిస్థితి. దీనికి మరోవైపు సోషల్ మీడియా సరికొత్త సోమరితత్వాన్ని మోసుకొస్తోంది. దీంతో ఆహారపు అలవాట్లు ఛిన్నా భిన్నమయ్యాయి. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు అన్నట్టుగా ఆహార విహారాలు మారడంతో అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. ‘మారుతున్న జీవన శైలిలో భాగంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరైన సమయానికి నిద్ర లేవకపోవడం, సరైన సమయంలో భోజనం చేయకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటివి నగరవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వ్యాయామం, ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం’ అని కిమ్స్ హాస్పిటల్స్‌కు చెందిన కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, డాక్టర్ వేదస్విరావు వెల్చల చెప్పారు. -
షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
-
లాటరీలో లక్కీ చాన్స్! 150 కిలోల బరువు ఉండటంతో టికెట్ ఫ్రెండ్‌కు ఇచ్చి..
కేప్ కానవెరల్: ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ గతేడాది చేపట్టిన తొలి పౌర అంతరిక్షయానం ‘ఇన్స్పిరేషన్ 4’కు లాటరీలో టికెట్ గెలుచుకున్న వ్యక్తి దాన్ని తన స్నేహితుడికి ఇచ్చాడని తెలుసా? బరువు ఎక్కువున్నందు వల్ల స్పేస్‌లో ప్రయాణించే అవకాశాన్ని అతను కోల్పోయాడంటే నమ్ముతారా? అక్షరాలా నిజం. టికెట్ గెలుచుకున్న అసలు వ్యక్తి పేరు కైల్ హిప్చెన్. తన కాలేజీ స్నేహితుడు క్రిస్ సెంబ్రోస్కీకు ఆ టికెట్‌ను ఇచ్చాడు. అలా స్నేహితుడికి టికెట్ ఇచ్చిన విషయాన్ని హిప్చెన్ ఎప్పుడో తన స్నేహితులు, బంధువులకు చెప్పినా ఇటీవలే ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఫ్లోరిడాకు చెందిన ఎండీవర్ ఎయిర్ అనే విమానయాన సంస్థలో హిప్చెన్ కెప్టెన్‌గా పని చేస్తున్నాడు. 1990ల్లో ఏరోనాటికల్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు క్రిస్ సెంబ్రోస్కీ, హిప్చెన్ కలిసి ఒకే రూమ్‌లో ఉన్నారు. అప్పటి నుంచి వీరికి పరిచయం ఉంది. తర్వాత కాలంలో హిప్చెన్ కెప్టెన్‌గా ఫ్లోరిడాలో, క్రిస్ డేటా ఇంజనీర్‌గా వాషింగ్టన్లో ఉంటున్నారు. రూ. 48 వేలు పెట్టి లాటరీలో పాల్గొని.. స్పేస్ ఎక్స్ అంతరిక్షయానానికి సంబంధించిన ఓ సీటును ‘షిఫ్ట్4 పేమెంట్స్’ వ్యవస్థాపకుడు, సీఈవో జారెడ్ ఇసాక్‌మన్ కొనుగోలు చేశాడు. ఓ పిల్లల రీసెర్చ్ ఆస్పత్రి కోసం డబ్బులు పోగు చేయడానికి దాన్ని లాటరీ ద్వారా అమ్మతున్నట్టు ప్రకటించాడు. అది తెలుసుకున్న హిప్చెన్ రూ. 45 వేలు, క్రిస్ రూ. 3 వేలు కలిపి రూ. 48 వేలతో లాటరీలో పాల్గొన్నారు. 72 వేల మంది దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరిలో లాటరీ తీస్తే హిప్చెన్ పేరొచ్చింది. గెలిచిన వ్యక్తి 2 మీటర్ల లోపు పొడవు, 113 కిలోల వరకు బరువుండాలని స్పేస్ ఎక్స్ షరతు విధించింది. కానీ హిప్చెన్ 150 కిలోలున్నాడు. లాంచింగ్‌కు 6 నెలలుంది. బరువు తగ్గుదామనుకున్నాడు. కానీ ఒకేసారి అంత బరువు తగ్గడం మంచిదికాదని తెలుసుకున్నాడు. దీంతో తన స్నేహితుడు క్రిస్ సెంబ్రొస్కీని హిప్చెన్ ఎంచుకున్నాడు. -
అరుదైన బాలుడు.. ప్రతి వెయ్యి మందిలో ఒకరు మాత్రమే ఇలా..
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు కిలోల బరువుతో మగ శిశువు జన్మించాడు. పాల్వంచకు చెందిన శ్రావణి నెలలు నిండడంతో ప్రసవం కోసం భద్రాచలంలోని సురక్ష ఆస్పత్రికి వచ్చింది. కాగా, వైద్యులు డాక్టర్ శ్రీక్రాంతి, డాక్టర్ అక్కినేని లోకేష్, నర్సుల బృందం సోమవారం సాయంత్రం ఆపరేషన్ చేశారు. శ్రావణికి పండంటి బాబు జన్మించగా.. శిశువు ఐదు కిలోల బరువు ఉన్నాడు. సహజంగా పిల్లలు రెండున్నర నుంచి నాలుగు కిలోల వరకు జన్మిస్తారని, ఐదు కేజీలు ఉండడం అరుదైన విషయమని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి 1000 మందిలో ఒకరు మాత్రమే ఇలా అధిక బరువుతో జన్మిస్తారని తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వివరించారు. -
దేహం తేలికైంది.. జీవితం బరువైంది
మిల్లీ సాన్‌సోయీ రచయిత్రి. యూకేలో మీడియారంగంలో కెరీర్‌ని నిర్మించుకుంటోంది. ఇరవై ఏడేళ్ల మిల్లీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. మృత్యువు అంచుల వరకూ వెళ్లి వచ్చింది. ఒక రకంగా ముంచుకు వస్తున్న మృత్యువు బారిన పడకుండా ఉండడానికి పెద్ద పోరాటమే చేసింది. పదహారేళ్ల వయసులో 33 కిలోల బరువుతో జీవితాన్ని బరువుగా లాక్కు వచ్చింది మిల్లీ. ఇదంతా చూస్తుంటే ఏ ప్రాణాంతక వ్యాధి వచ్చి తగ్గిందో అనుకుంటాం. కానీ ‘‘అంతా నేను చేతులారా చేసుకున్నదే’’ అంటుంది మిల్లీ. ‘‘అదృష్టవశాత్తూ నేను మృత్యువు ఒడిలోకి జారిపోవాల్సిన సమయానికి రెండు వారాల ముందు డాక్టర్ రక్షణలోకి వెళ్లగలిగాను కాబట్టి వ్యాధి బారి నుంచి బయటపడ్డాను. ఆరోగ్యాన్ని పొందడం కోసం నేను చేసిన పోరాటాన్ని మీతో పంచుకుంటాను. ఎందరో అమ్మాయిలు నా అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటోంది మిల్లీ సాన్‌సోయీ. కేలరీల దహనమే ధ్యేయం ‘‘చిన్నప్పటి నుంచి బొద్దుగా ఆరోగ్యంగా ఉండేదాన్ని. పద్నాలుగేళ్ల వయసులో ఎదురైన ఒక వెక్కిరింత... నా మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఎలాగైనా సరే బరువు తగ్గాలి, నన్ను ఎగతాళి చేసిన అమ్మాయికంటే స్లిమ్‌గా మారాలనే పట్టుదల కలిగింది. ఆహారంలో మార్పులు చేసుకుని, జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ ఆరోగ్యకరంగా బరువు తగ్గాను. డ్రెస్ సైజ్ కూడా మారింది. ఆ మార్పును గుర్తిస్తారని ఆశించాను. కానీ అలా జరగలేదు. దాంతో ఇంకా మొండితనం వచ్చేసింది. తీవ్రంగా బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నాను. అంతలో ఒక యాక్సిడెంట్. మోకాలికి గాయమైంది. జిమ్‌లో వర్కవుట్ సాధ్యం కాదు. మరెలా? ఆహారం పరిమాణం బాగా తగ్గించేశాను. కేలరీలు కొలత చూసుకోవడం, దేహంలోకి వెళ్లిన కేలరీలను దహింప చేయడానికి విపరీతంగా నడవడం దినచర్యగా మారింది. రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారు జామున రెండు వరకు నడుస్తూనే ఉండేదాన్ని. క్రమంగా పీలగా మారిపోయాను. అయినా సరే... ఎగతాళి చేసిన అమ్మాయి కంటే సన్నగా అయ్యాను. కానీ ఆమె నన్ను ఏడిపించడం మానలేదు. ‘మిల్లీ ఇప్పుడు నీ కంటే సన్నగా ఉంది కదా? ఇంకా ఎందుకు ఏడిపిస్తావ్’ అని నా ఫ్రెండ్ నిలదీసింది. అప్పుడా అమ్మాయి ‘మిల్లీ అప్పట్లో లావుగా ఉండేది, ఇప్పుడు పేషెంట్లా ఉంది’ అని వెక్కిరించింది. నాకప్పుడు ఏమీ అర్థం కాలేదు. అసలు నేను ఎలా ఉండాలి? అనే సందేహం. నేను మరీ సన్నబడడంతో ఇంట్లో వాళ్లు నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఇక... రెండు వారాలే! పద్నాలుగేళ్ల వయసులో పడిన ఒక విషబీజం పదహారేళ్లు వచ్చేసరికి ఊడలుగా విస్తరించి ఆరోగ్యాన్ని కబళించింది. ‘దేహంలో అంతర్గత అవయవాల పనితీరు క్షీణించింది. మరో రెండు వారాలకంటే బతకడం కష్టం’ అని చెప్పారు డాక్టర్. నా ఆరోగ్యం కోసం అమ్మ పడుతున్న తపనను చూసి అమ్మకోసం అనొరెక్సియా, ఈటింగ్ డిజార్డర్ సమస్యల నుంచి బయటపడడానికి పెద్ద పోరాటమే చేశాను. ఒక వేసవి మొత్తం హాస్పిటల్లోనే ఉన్నాను. బరువు 33 కిలోల నుంచి 51 కిలోలకు పెరిగిన తర్వాత బయటకు వచ్చాను. ఆ తర్వాత చేసిన మొదటి పని స్కూలు మారడం. ఇదొక పాఠం నా అనారోగ్యం గురించి తెలిసిన తర్వాత మా అమ్మమ్మ నన్ను చూడడానికి వచ్చింది. అప్పుడామె అన్న మాటను నేను మర్చిపోలేను. ‘అందరి దృష్టి నీ మీద ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు ఏదైనా సాధించు. అంతే కానీ అనారోగ్యంతో కాదు. పని చేసుకునే వాళ్లను చూడు, వాళ్లకు దేహాకృతి గురించిన పట్టింపు ఉండదు. తమ పనితోనే గుర్తింపు తెచ్చుకుంటారు’ అని చెప్పింది. స్కూల్ చదువు పూర్తి చేసి కాలేజ్‌లో చేరాను. చదువు పూర్తయ్యేటప్పటికి జీవితం చాలా చిన్నదనే వాస్తవం తెలిసింది. అనొరెక్సియా, ఈటింగ్ డిజార్టర్ల వెనుక అసలైన జీవితం ఉందని కూడా తెలిసింది. ఇప్పుడిలా సంతోషంగా ఉన్నాను. నా అనుభవం ఎందరికో పాఠంగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పింది మిల్లీ సాన్‌సోయీ. మీడియా కూడా ‘సన్నబడడానికి సులువైన మార్గాలు’ అనే కథనాలకు బదులు ఆరోగ్యంగా జీవించడానికి అనువైన మార్గాలను సూచించాలని మిల్లీ కోరుతోంది. అంతేకాదు... తనకు ఎదురైన చేదు అనుభవం నుంచి బాడీ షేమింగ్‌కు పాల్పడే ఆలోచనను పిల్లల్లో మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఉందని కూడా సమాజం తెలుసుకోవాలి. -
ఓడిపోతున్నాననే బాధలో ప్రత్యర్థి చెవి కొరికాడు; వీడియో వైరల్
టోక్యో: ప్రత్యర్థితో జరుగుతున్న మ్యాచ్‌లో ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు కోపం రావడం సహజం. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని మ్యాచ్ ఓడినా పర్లేదు అనేలా క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలి. కానీ కొంతమంది మాత్రం తమ ఓటమిని భరించలేక ప్రత్యర్థిపై దాడికి దిగడం చూస్తుంటాం. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మ్యాచ్‌లో ఓడిపోతున్నాననే అసహనంతో మొరాకొకు చెందిన బాక్సర్ యూనెస్ బాల్లా.. న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ న్యీకా చెవి కొరికాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం బాక్సింగ్‌లో హెవీ వెయిట్ విభాగంలో మొరాకొకు చెందిన బాక్సర్ యూనెస్, న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ నికా మధ్య పోరు జరిగింది. బౌట్లో డేవిడ్ నికా తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించగా.. యూనెస్ తేలిపోయాడు. దీంతో అసహనానికి గురైన యూనెస్.. మూడో రౌండ్లో డేవిడ్ చెవి కొరకడానికి యత్నించాడు. యూనీస్ దంతాలు తగలగానే డేవిడ్ అతడిని దూరంగా నెట్టేశాడు. ఈ మ్యాచ్‌లో డేవిడ్ 5-0 తేడాతో యూనీస్‌ను ఓడించాడు. కాగా, యూనెస్ అనుచిత ప్రవర్తనతో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అతడిని అనర్హుడిగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. Morocco’s Youness Baalla tried to bite the ear of New Zealand’s David Nyika!!! #Boxing #Tokyo2020 pic.twitter.com/N6LJIqjb6S — Ben Damon (@ben_damon) July 27, 2021 -
ఒబెసిటీ.. అధిక బరువే కాదు అంతకు మించి
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సమస్య ఒబెసిటీ. వ్యక్తుల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం వంటి అనేక కారణాలతో ఇప్పుడు ఇదొక జీవనశైలికి సంబంధించిన అంశంగా మారింది. అందరూ దీనిని కేవలం అధిక బరువుతోనే కొలుస్తుంటారు. అయితే ఇది అంతకు మించిన తీవ్రమైన పరిస్థితిగా పరిగణించి పూర్తి స్థాయి చికిత్స చేయాలి అంటున్నారు కేర్ ఆసుపత్రికి చెందిన డా.బిపిన్ సేథీ. రోజువారీ జీవనం మీద ఒబెసిటీ ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. హృద్రోగం, డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్, కీళ్ల నొప్పులు.. ఇంకా అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాలతో పాటు కొన్ని రకాల కేన్సర్లకూ కారణమవుతుంది. కేవలం శారీరకమైనవే కాకుండా డిప్రెషన్, న్యూనతాభావం తదితర మానసిక సమస్యలకూ ఇది దోహదం చేస్తుంది. సరైన కారణం గుర్తించాలి ఒబెసిటీ విషయంలో వ్యక్తిగత బాధ్యతా రాహిత్యం, విల్‌పవర్ లోపించడం.. వంటివి చూపిస్తూ బాధితులపైనే పూర్తిగా నెపం వేస్తుంటారు. అలాగే కేవలం ఎక్కువ తినడం, వ్యాయామం లేకపోవడం వంటివి మాత్రమే ఒబెసిటీకి కారణం కావనేది అర్ధం చేసుకోవాలి. దీనికి జన్యుపరమైన సమస్యలతో పాటు పరిసరాలు, వాతావరణం, ప్రవర్తన... ఇవన్నీ కూడా కారణాల్లో ఉండొచ్చు.. ఒబెసిటీ కారణాల గురించి మనకు తక్కువ అవగాహన ఉంది. హార్మోనల్ కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా దీనిని సరైన రీతిలో అర్ధం చేసుకునే దశలోనే మనం ఉన్నాం. కాబట్టి త్వరపడి ఏదోఒక కారణాన్ని నిర్ధారించుకుని చికిత్స సరికాదు. చికిత్సకు నిర్ణీత వ్యవధి ఒబెసిటీ బాధితులు కూడా తామేదో హార్మోనల్ సమస్య అని భావిస్తూ సరైన క్రమపద్ధతిలో కాకుండా త్వరితంగా సమస్య నుంచి బయటపడే మార్గాలు వెతుకుతుంటారు. అది సరైంది కాదు ఈ సమస్య నుంచి కోలుకోవడానికి జీవిత కాలపు ఆరోగ్య నిపుణుల అవసరం ఉంటుంది. వ్యక్తులకు సంబంధించిన డైట్ మాత్రమే కాకుండా తినే ఆహారం, అలాగే వ్యాయామాలను పరిశీలించాల్సి ఉంది. నెగిటివ్ కేలరీ బ్యాలెన్స్‌తో పాటు ఇదొక దీర్ఘకాలికం కొనసాగాల్సిన ప్రక్రియ, అంతే తప్ప శరవేగంగా ఫలితాలను ఆశించడం, వెంటనే బరువు తగ్గాలని కోరుకోవడం, పెళ్లి వంటి వేడుకల కోసం హడావుడిగా సర్జరీ ప్లాన్స్ ఎంచుకోవడం వల్ల సరైన ఫలితం రాదు. తీవ్రతకు తగ్గ చికిత్స వ్యక్తిగత ఒబెసిటీ తీవ్రతపై ఆధారపడి దీనికి చికిత్స ఉండాలి. అలాగే వ్యక్తిగత ఆరోగ్య ప్రమాదాలు, మానసిక ప్రవర్తన శైలులు, మెటబాలిక్ క్యారెక్టరిస్టిక్స్లతో పాటు గతంలోని అధిక బరువు తగ్గించుకునే యత్నాలు వాటి ఫలితాలు కూడా దీనిలో పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తిగత చికిత్సా పద్ధతులు అనుసరిస్తూ మల్టీ లెవల్ ఒబెసిటీ మేనేజ్మెంట్ నెట్‌వర్క్‌తో సమన్వయంతో పనిచేస్తే లక్ష్యం చేరుకోవడానికి వీలవుతుంది. ఒబెసిటీ మేనేజ్మెంట్లో నైపుణ్యం కలిగిన బృందం పనిచేయాలి. చికిత్సలో భాగంగా అన్ని రకాల ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. రోగి జీవనశైలికి, ప్రాధామ్యాలకు నప్పేలా దీనిని డిజైన్ చేస్తారు. మందుల వాడకాన్ని సమీక్షించడం, మార్పు చేర్పులు, పోషకాల సహకారం, శారీరక కార్యకలాపాలు పెంచడం, కౌన్సిలింగ్, రోగికి నప్పేదైతే బేరియాట్రిక్ సర్జరీ.. వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. పలువురు భావిస్తున్నట్టు ఇది ఒంటరిగా పోరాడే పరిస్థితి కాదు. వైద్య నిపుణుల పర్యవేక్షణ సహకారం అవసరం. - డాక్టర్ బిపిన్సేథీ, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ -
బాల బాహుబలి ఇక లేడు
మాస్కో: పిన్న వయసులో అధిక బరువుతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కి బాల బహుబలిగా పేరు పొందిన ధాంబులత్ ఖటోఖోవ్ మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఈ రష్యా యువ సుమో రెజ్లర్ గత మంగళవారం కన్నుమూశాడు. ఈ విషయాన్ని సుమో రెజ్లింగ్ గవర్నింగ్ బాడీకి చెందిన బెటల్ గుబ్జెవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న ఖటోఖోవ్ మరణానికి సంబంధించిన కారణాలను గుబ్జెవ్ వెలువరించలేదు. రెండేండ్ల వయసులో ఖటోఖోవ్ ఏకంగా 34 కిలోల బరువుతో గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. కాగా 7 ఏళ్ల వయసులో 100 కేజీల బరువు పెరిగిన ఖటోఖోవ్ 'బేబి ఎలిఫెంట్' అనే ట్యాగ్‌ను సంపాదించాడు. చిన్న వయసులోనే బాల బాహుబలిగా పేరు పొందిన ఇతను 13 ఏళ్ల వయసులో 180 కిలోల బరువు పెరిగి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. -
వారికి కరోనా వ్యాక్సిన్ కూడా పనిచేయదట!
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్–19 బారిన పడితే ఆరోగ్యకరమైన బరువు కలిగిన వారికన్నా అధిక బరువు కలిగిన వారు 48 శాతం ఎక్కువ మరణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ నియమించిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అధిక బరువు కలిగిన వారు 113 శాతం ఆస్పత్రుల్లో చేరే అవకాశం ఉండగా, వారిలో 74 శాతం మంది ఆక్సిజన్ వెంటిలేటర్లను ఆశ్రయించాల్సి వస్తుందని కూడా ఆ బృందం హెచ్చరించింది. అధిక బరువు కలిగిన వారికి మధుమేహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దానివల్ల వారి రక్తంలో సుగర్ పెరిగితే రక్తం గడ్డలు కట్టే ప్రమాదం ఉందని, పైగా వారి రక్తనాళాలు ఉబ్బిపోయి పెలుసుగా తయారవుతాయని, అధిక బరువు కలిగిన వారిలో రోగనిరోధక శక్తినిచ్చే కణాలు కూడా దెబ్బతింటాయని, అధిక బరువు కారణంగా వారికి వెంటిలేటర్ చికిత్స ఇవ్వడం కూడా కష్టం అవుతుందని, ఇలాంటి కారణాల వల్లనే అధిక బరువు కలిగిన వారు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తల బృందం తెలియజేసింది. (కోవిడ్ సంక్షోభం తర్వాత అనేక అవకాశాలు) సరిగ్గా ఈ కారణాల వల్లనే కోవిడ్ నిరోధక వ్యాక్సిన్లు కూడా వారికి పెద్దగా పని చేయవని ఆ బందం పేర్కొంది. ప్రధానంగా అధిక బరువు కలిగిన వారిలో రోగ నిరోధ వ్యవస్థ సరిగ్గా పని చేయక పోవడం వల్లనే వ్యాక్సిన్ల ప్రభావం వారిపై ఎక్కువగా ఉండదని శాస్త్రవేత్తల బందం తెలిపింది. బ్రిటన్‌లో ప్రతి ముగ్గురు అధిక బరువు కలిగిన వారుకాగా, అమెరికాలో 40 శాతం మంది అధిక బరువు కలిగిన వారున్నారు. -
నువ్వు మనిషి కాదు.. రాక్షసుడివి..!
లాస్ వేగాస్: ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్(డబ్యూబీసీ) హెవీ వెయిట్ ఛాంపియన్‌షిష్‌లో విజేతగా నిలిచిన తర్వాత బ్రిటన్ బాక్సర్ టైసన్ ఫ్యూరీ చేసిన ఓ పనికి ఎంజీఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనాలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో అమెరికా చాంపియన్ బాక్సర్ డియోంటి వైల్డర్‌పై విజయం సాధించిన ఫ్యూరీ ప్రత్యర్థిని కౌగిలించుకొని అతని నుంచి కారుతున్న రక్తాన్ని నాకడం ఒళ్లు జలదరించేలా చేసింది. ఇరువురి మధ్య ఏడో రౌండ్ వరకూ హోరీ హోరీ పోరు జరగ్గా, ఫ్యూరీ పైచేయి సాధించాడు. వైల్డర్‌కు తన పంచ్‌ల పవర్‌తో చుక్కలు చూపించాడు. తన ప్రొఫెషనల్ కెరీర్లోనే ఓటమి లేని వైల్డర్‌పై కసిదీరా పంచ్‌లు విసిరాడు. ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలనే కసితో రింగ్‌లో పదునైన పంచ్‌లను రుచి చూపించాడు. ఈ క్రమంలోనే వైల్డర్ చెవికి, నోటికి గాయం కావడంతో రక్తం వచ్చింది. బౌట్ జరిగిన తీరు కొందర్నీ ఆశ్చర్య పరిస్తే, ‘జిప్సీకింగ్’గా పలువబడే అతను తన ప్రత్యర్థి రక్తాన్ని నాకడాన్నే అందరూ ఆశ్చర్యంగా గమనించారు. అయితే ఫ్యూరీ రక్తాన్ని నాకుతున్న ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘ఇతను మనిషి కాదు రాక్షసుడు’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ఊపిరికి భారమాయె
సాక్షి, హైదరాబాద్: వాతావరణ కాలుష్యానికి తోడు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో శ్వాస సంబంధమైన కొత్త సమస్యలు వెలుగుచూస్తున్నట్లు ప్రముఖ వైద్య నిపుణులు వెల్లడించారు. ఊపిరితిత్తుల కేన్సర్లకూ ఇదే కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రమాదకరమైన స్లీప్ ఆప్నియా (నిద్రలో శ్వాస ఆగిపోవడం/ నిద్ర అవ్యవస్థ) బారినపడే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం ప్రతి పదిమంది గురక బాధితుల్లో ఇద్దరు స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. శనివారం బేగంపేటలోని హోటల్ మ్యారీగోల్డ్‌లో యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో ‘పల్మొ అప్డేట్’ సదస్సు నిర్వహించారు. మలేసియాకు చెందిన డాక్టర్ టైసివ్ టెక్, వైద్య ప్రముఖులు రితేష్ అగర్వాల్, రవీంద్ర మెహతా, దీపక్‌తల్వార్, బీవీ మురళీమోహన్, సుభాకర్, అమితాసేనె, ఆర్.విజయ్‌కుమార్, నవనీత్‌సాగర్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి సహా పలు ఆస్పత్రులకు చెందిన 500 మంది వైద్యులు హాజరయ్యారు. శ్వాస సమస్యలకు కారణాలివే.. ►ఐటీ, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న యువత డిస్కోలు, పబ్ కల్చర్ పేరుతో రాత్రి పొద్దుపోయే వరకు బయటే గడుపుతున్నారు. ►మద్యం తాగడం, చికెన్, మటన్ బిర్యానీలు ఎక్కువగా తినడం, ఆహారం జీర్ణం కాకముందే నిద్రకు ఉపక్రమించడం వల్ల శ్వాసనాళాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇది శ్వాస సంబంధ సమస్యలతో పాటు స్లీప్ ఆప్నియాకు కారణమవుతోంది. ►చాలామంది దీన్ని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. స్లీప్ ఆప్నియాతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆకస్మిక గుండెపోటు ప్రమాదం ఆరోగ్యంగా ఉన్న వారు గాఢనిద్రలో నాలుగు నుంచి ఆరుసార్లు మేల్కొంటారు. నగరంలో చాలామంది నిద్రపోయిన అరగంటకే మళ్లీ లేచి కూర్చుంటున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం, మెడ సైజులో తేడా ఉండటమే ఇందుకు కారణం. నిద్రలో బలవంతంగా శ్వాస తీసుకునే ప్రయత్నం చేసినా ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ మెదడు, గుండెకు చేరడం లేదు. ఇది ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఏర్పడే గురక.. చికాకు, మతిమరుపు, మధుమేహం వంటి కొత్త సమస్యలకూ కారణమవుతోంది. – డాక్టర్ నాగార్జున, పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి జీవనశైలి మార్చుకోవాలి.. వాతావరణ కాలుష్యానికి తోడు మారిన జీవనశైలి వల్ల శ్వాస సంబంధ సమస్యలు వస్తున్నాయి. దేశంలో పది శాతం మంది ఉబ్బసంతో, ఏటా 3 మిలియన్ల మంది నిమోనియాతో, మరో 2.7 మిలియన్ల మంది పల్మనరి టీబీతో బాధపడుతున్నారు. అంతేకాదు ఏటా లక్ష మంది ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నారు. జీవనశైలిని మార్చుకోవడం, మితాహారం తీసుకోవడం, మద్యం, మాంసం, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం, వాకింగ్, రన్నింగ్, యోగా చేయడం ద్వారా బరువును నియంత్రించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. – డాక్టర్ జీఎస్ రావు, మేనేజింగ్ డైరెక్టర్, యశోద ఆస్పత్రి -
బాబు యూకేజీ.. బ్యాగు ఫైవ్ కేజీ
బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారి మాధ్య రెండో తరగతి చదువుతోంది. ఆమె స్కూల్ బ్యాగు బరువు ఎంతో తెలుసా? 10 కిలోలు. దీంతో ఆమె మేనత్త రోజూ ఆ స్కూల్ బ్యాగును మోసుకొస్తోంది. అలాగే 6వ తరగతి చదువుతున్న పూజ స్కూల్ బ్యాగు బరువు 8.8 కిలోలు. ఇంత బరువు మోయలేక ఆ బాలిక వెన్నుభాగంలో నొప్పి పుడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. మినిస్టర్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1 వ తరగతి చదువుతున్న నాని స్కూల్ బ్యాగు బరువు 8 కిలోలు ఉంది. ప్రతిరోజూ అతడి తల్లి రేఖ కొడుకును వెంటబెట్టుకొని స్కూల్ బ్యాగు మోసుకుంటూ బడికి వెళ్లాల్సి వస్తోంది. వీరే కాకుండా ఎల్కేజీ చదివే చిన్నారుల బ్యాగులు సైతం 4 నుంచి 5 కేజీల బరువు ఉంటున్నాయి. ఇలా వయసుకు మించిన పుస్తకాల బరువుతో బాల్యం కుంగిపోతోంది. నిండా పదేళ్లు లేని పిల్లలు 10 కిలోలకుపైగా బరువు ఉన్న పుస్తకాల బ్యాగును మోయాల్సి వస్తోంది. ఖాళీ స్కూల్ బ్యాగు బరువే కిలో వరకు ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పిల్లలపై పుస్తకాల భారం తగ్గించేందుకు స్కూళ్లలో, తరగతి గదుల్లోనే లాకర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన పుస్తకాలు, నోట్ బుక్స్ మాత్రమే పిల్లలు తమ వెంట తీసుకెళ్లేలా శ్రద్ధ తీసుకోవాలన్న నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. బరువైన బ్యాగులకు బదులు స్కూల్ పిల్లల కోసం తేలికైనవి అందజేసేందుకు అవకాశం ఉన్నా చాలా పాఠశాలల్లో ఏ ఒక్క నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. శనివారం నగరంలో వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లను ‘సాక్షి’ విజిట్ చేసిన సందర్భంగా విస్తుగొలిపే విషయాలెన్నో వెలుగు చూశాయి. – సాక్షి, సిటీబ్యూరో/ నెట్వర్క్ సాక్షి,హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారి మాధ్య రెండో తరగతి చదువుతోంది. ఆమె స్కూల్ బ్యాగు బరువు ఎంతో తెలుసా? 10 కిలోలు. దీంతో ఆమె మేనత్త రోజూ ఆ స్కూల్ బ్యాగును మోసుకొస్తోంది. అలాగే 6వ తరగతి చదువుతున్న పూజ స్కూల్ బ్యాగు బరువు 8.8 కిలోలు. ఇంత బరువు మోయలేక ఆ బాలిక వెన్నుభాగంలో నొప్పి పుడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. మినిస్టర్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1 వ తరగతి చదువుతున్న నాని స్కూల్ బ్యాగు బరువు 8 కిలోలు ఉంది. ప్రతిరోజూ అతడి తల్లి రేఖ కొడుకును వెంటబెట్టుకొని స్కూల్ బ్యాగు మోసుకుంటూ బడికి వెళ్లాల్సి వస్తోంది. వీరే కాకుండా ఎల్కేజీ చదివే చిన్నారుల బ్యాగులు సైతం 4 నుంచి 5 కేజీల బరువు ఉంటున్నాయి. ఇలా వయసుకు మించిన పుస్తకాల బరువుతో బాల్యం కుంగిపోతోంది. నిండా పదేళ్లు లేని పిల్లలు 10 కిలోలకుపైగా బరువు ఉన్న పుస్తకాల బ్యాగును మోయాల్సి వస్తోంది. బరువుల బాధలివిగో ⇒ బంజారాహిల్స్ రోడ్ నెంబర్– 12లోని మినిస్టర్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న నాని స్కూల్ బ్యాగు బరువు 8 కిలోలు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తల్లి రేఖ ఆ బ్యాగును మోసుకెళ్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అనే తేడా లేకుండా అన్ని స్కూళ్లలోనూ పుస్తకాల బరువు భారీగానే ఉంది. ⇒ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 9వ తరగతి విద్యార్థి బ్యాగు బరువు 9.5 కిలోలు ఉంది. 10వ తరగతి పిల్లల బ్యాగులు 10 కిలోల నుంచి 12 కిలోల వరకు ఉన్నాయి. ఎక్కువ పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌బుక్‌లు ఉంటేనే పిల్లలు బాగా చదువుతున్నట్లు భావించే తల్లిదండ్రుల ధోరణితోనూ స్కూల్ యాజమాన్యాలు బ్యాగుల బరువు పెంచేస్తున్నాయి. ⇒ కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న లిఖిత్ సాయి, 5వ తరగతి చదువుతున్న దినేశ్‌ల బ్యాగుల బరువు 6 కిలోలపైనే. లిఖిత్సాయి 6.8 కిలోల బరువు మోస్తుండగా, దినేశ్ బ్యాగ్ బరువు 7.5 కిలోలు ఉంది. ఈ చిన్నారులు వయసుకు మించిన భారాన్ని మోయకతప్పడంలేదు. ⇒ లాలాపేట ఇందిరానగర్‌కు చెందిన శివకుమార్ నాలుగో తరగతి. పుస్తకాల బ్యాగు బరువు సుమారు 8 కిలోలు. చిలకలగూడకు చెందిన హసినీ 6వ తరగతి. ఆమె బ్యాగు బరువు 12 కిలోలు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రతిరోజు ఆరు టెస్ట్బుక్కులు, ఆరు క్లాస్ బుక్కులు, ఆరు వర్క్ బుక్కులు, డైరీ, రఫ్ నోట్‌బుక్, హోంవర్క్ బుక్కులతో కలిపి సుమారు 20 నుంచి 25 పుస్తకాలు స్కూలుకు తీసుకెళ్తున్నారు. వీటితోపాటు టిఫిన్ బాక్స్, వాటర్బ్యాటిల్ బరువుతో కలిపి సుమారు 10 నుంచి 12 కిలోలపైనే ఉంటుంది. వెల్లడైన వాస్తవాలు.. ఎల్కేజీ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లల పుస్తకాల బ్యాగులను పరిశీలించగా.. సగటున 4 నుంచి 10 కిలోల వరకు ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో 10వ తరగతి పిల్లల బ్యాగులు 10కిలోలపైనే ఉన్నాయి. ‘ఎప్పుడు ఏ సబ్జెక్ట్ ఉంటుందో తెలియదు. తరచూ టైం టేబుల్ మారుతూ ఉంటుంది. అందుకోసం అన్ని పుస్తకాలు తెచ్చుకోవలసి వస్తుంద’ని పలువురు విద్యార్థులు నిస్సహాయత వ్యక్తం చేశారు. ‘స్కూల్ మేనేజ్మెంట్లు సూచించిన ప్రకారంగానే పిల్లల బ్యాగుల్లో పుస్తకాలను, నోట్‌బుక్స్‌ను పెడుతున్నా’మని తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో చాలామంది పిల్లలు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పరిష్కార మార్గాలివీ.. స్కూల్ పిల్లలు మోస్తున్న పుస్తకాల బ్యాగుల బరువును తగ్గించాలనే ప్రధానమైన లక్ష్యంతో పెద్ద ఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్న నాగ్‌పూర్‌నకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రాజేంద్ర ఇటీవల హైదరాబాద్‌లోనూ పర్యటించారు. ‘నగరంలోని చాలా స్కూళ్లలో పరిశీలించాను. ప్రతి బ్యాగు 7 కిలోలపైనే ఉంది. ఖాళీ బ్యాగే కిలో వరకు ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. దీన్ని మార్చేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి. స్కూళ్ల యాజమాన్యాలలోనూ మార్పు అవసరం’ అన్నారు ప్రొఫెసర్ రాజేంద్ర. స్కూల్ బ్యాగు బరువును తగ్గించే పరిష్కార మార్గాలను సైతం ఆయన సూచించారు. అవి ఇలా ఉన్నాయి.. ⇒ పాఠ్య పుస్తకాలను చిన్న చిన్న బుక్లెట్లుగా ముద్రించాలి. 16 పాఠాలు ఉన్న పుస్తకాన్ని 4 పాఠాలకు ఒక బుక్లెట్ చొప్పున ముద్రించవచ్చు. దీంతో అవసరమైన బుక్లెట్ మాత్రమే తీసుకెళ్లవచ్చు. ⇒ 200 పేజీల నోట్ పుస్తకాలకు బదులు 100 పేజీల నోట్ పుస్తకాలను ముద్రించాలి. ⇒ పాఠ్యాంశాల బోధనలో ఉపాధ్యాయులు సరైన అవగాహనతో ఉంటే ఎక్కువ పుస్తకాలు తెచ్చుకోవలసిన అవసరం పిల్లలకు ఉండదు. ⇒ కచ్చితమైన టైమ్‌టేబుల్‌ను పాటించాలి. ⇒ ప్రతి పాఠ్య పుస్తంపై దాని బరువును సైతం విధిగా ముద్రించాలి. ⇒ పాఠ్య పుస్తకాలకు, మ్యాప్‌లకు మధ్య సమతుల్యం లేకపోవడంతోనూ పేజీల సంఖ్య పెరిగిపోతోంది. దీనిని నివారించాలి. ⇒ లాకర్లు ఏ మేరకు ప్రత్యామ్నాయం కాగలవనే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ⇒ ఈ– లెర్నింగ్ సదుపాయాలను పెంచాలి. చర్యలు తీసుకోవాలి.. పుస్తకాల బ్యాగు బరువును తగ్గించాలి. ఏ రోజు ఏ సబ్జెక్ట్ బోధిస్తారో దానికి సంబంధించిన పుస్తకాలను మాత్రమే విద్యార్థులు పాఠశాలకు తీసుకువచ్చేలా ఉపాధ్యాయులు సూచించాలి. దీంతో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గుతుంది. – విద్యారాణి, జిల్లెలగూడ వెన్నుపూస నొప్పి పుస్తకాల బరువుతో విద్యార్థులు వెన్నుపూస నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకిచ్చే హోంట్యూషన్ పాఠశాలల్లోనే చేయిస్తే పుస్తకాల భారం తగ్గుతుంది. విద్యాశాఖ అధికారులు స్పందించాల్సిన అవసరముంది. – లక్ష్మణ్, పేరెంట్, జిల్లెలగూడ మోత తప్పడం లేదు.. రోజూ పుస్తకాలు, నోటు పుస్తకాల బరువు మోయాల్సిందే. ఇంకా కొన్నింటిని స్కూల్లోనే పెట్టివస్తాం. ఇంటి నుంచి బడి వరకు అక్కడి నుంచి ఇంటి వరకు మోయాల్సి వస్తోంది. ఇంటికెళ్లి హోంవర్క్ కూడా చేయాలనిపించడం లేదు. కానీ తప్పదు. – నీరజ్, 9వ తరగతి, మదీనాగూడ పిల్లలు అలసిపోతున్నారు.. తరగతి పెరుగుతున్న కొద్దీ పుస్తకాల బరువు రెండింతలు పెరుగుతోంది. పుస్తకాల బ్యాగును మోయడంతో విద్యార్థులు శారీరకంగా అలసిపోతున్నారు. వెన్నుపూస వంగిపోతోంది. పాఠశాలల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థుల పుస్తకాల బ్యాగుల భారం తగ్గించాల్సిన అవసరం ఉంది. – మల్లికార్జున్, పేరెంట్, చిలకలగూడ బ్యాగుల బరువు తగ్గించాలి. స్కూల్ బ్యాగుల బరువు తగ్గించాలి. ఇంటి నుంచి నిత్యం కిలోలకొద్ది బ్యాగ్ మోసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటోంది. మొదటి తరగతి నుంచి ఇదే విధంగా బరువైన బ్యాగ్‌లను మోయించారు. అన్ని రకాల నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలను తీసుకెళ్లాల్సి వస్తుండడంతో వెన్నెముఖ భాగంలో నొప్పి పుడుతోంది. – ఆర్.దీపక్, 8వ తరగతి -
ముందు చూపే మందు
సాక్షి,గుంటూరు : కొండపల్లికి చెందిన వెంకటలక్ష్మికి మధుమేహం ఉంది. కొంతకాలంలో మందులు సరిగ్గా వాడటం లేదు. పది రోజుల కిందట అకస్మికంగా స్పృహ కోల్పోవడంతో నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో శరీరంలో షుగర్ లెవల్స్ 800 ఉండటంతోపాటు, ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ సోకింది. వారం రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స చేయడంతో ప్రాణాపాయం నుంచి బయట పడింది. పటమటకు చెందిన వెంకటేశ్వర్లు రెండు రోజుల కిందట అకస్మాతుగా ఆయాసంతో పడిపోవడంతో నగరంలోని ఓ ప్రవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతనికి ఇసీజీ తీయగా గుండెపోటుగా నిర్ధారణించారు. మధుమేహం కారణంగా ఛాతీ నొప్పి రాలేదని తేల్చారు. అసలు అతనికి అప్పటి వరకూ మధుమేహం ఉన్నట్లు కూడా తెలియకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇలా వీరిద్దరే కాదు..ఇటీవల కాలంలో చాలా మంది మధుమేహం ఉన్నప్పటి తమకు తెలియక పోవడం, తెలిసినా మందులు వాడక పోవడంతో తీవ్రమైన దుష్సలితాలకు దారి తీస్తున్నట్లు చెపుతున్నారు, చిన్న వయస్సులోనే వ్యాధి బారిన ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా 20 ఏళ్లకు మధుమేహం భారిన పడుతున్నారు. జిల్లాలో 2.50 లక్షల మంది మధుమేహులు ఉండగా, మరో 4 లక్షల మంది ఫ్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నారు. మధుమేహుల్లో 10 శాతం మంది 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఉన్నారు. ఒకప్పుడు వంశపారంపర్యంగా 40 సంవత్సరాలు దాటిన వారిలో వచ్చేదని ఇప్పుడు 20 ఏళ్లకే వస్తుంది. దుష్ఫలితాలు ఇలా.. గుండె జబ్బులకు గురవుతున్న వారిలో 50 శాతం మంది మధుమేహమే కారణంగా నిర్ధారిస్తున్నారు. మధుమేహం ఉన్న వారిలో రక్తనాళాలు బిరుసుగా మారడం, స్పర్శ కోల్పోవడంతో గుండెపోటుకు గురైనప్పటికీ నొప్పి తెలియదని, నిద్రలోనే ప్రాణాలు వదిలే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మధుమేహం ఉన్న వారిలో మెదడుపోటుకు గురయ్యే వారు సైతం ఎక్కువగా ఉంటున్నారు. కిడ్నీలు పాడయ్యే ప్రమాదం మధుమేహం అదుపులోలేని వారిలో దాని ప్రభా వం కిడ్నీలపై చూపుతున్నారు. కిడ్నీల పనితీరు క్షీణిస్తున్న కొద్దీ క్రియాటిన్ పెరడగం, రక్తపోటు అదుపులో లేకపోవడం జరుగుతుంది. డయాలజిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొం టుంది. మధుమేహం కారణంగా ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే మరలా దానిని తిరిగి యథాస్థితికి రావడం జరగదు. దీంతో డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన దయనీయ స్థితి నెలకొంటుందని వైద్యులు చెపుతున్నారు. మధుమేహులు ప్రతి ఆరు నెలలకు కిడ్నీలు పరీక్షలు చేయించుకుంటే మేలు కంటిచూపు కోల్పోయే ప్రమాదం మధుమేహం ఉన్న వారిలో కంటిలోని రెటీనా(కంటినరం) మూసుకు పోవడం వలన చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. మధుమేహం ఎక్కువ కాలం అదుపులో లేని వారిలో కంటి రెటీనా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఉన్న చూపును కాపాడుకోవడం మినహా, పోయిన చూపును తిరిగి రావడం కుదరదని వైద్యులు చెపుతున్నారు. అవగాహన అవసరం మధుమేహంపై సరైన అవగాహనతో అదుపులో ఉంచుకో వడం మేలు. మధుమేహం ఉన్న వారిలో 50 శాతం మందికి తమకు వ్యాధి ఉన్నట్లు కూడా తెలియదు. ఉన్నట్లు తెలిసిన వారిలో కూడా 50 శాతం మంది మందులు వాడుతుండగా, వారిలో సగం మంది వ్యాధిని అదుపులో ఉంచుకోగలుగుతున్నారంటే..మొత్తంగా 12.5శాతం మందిలో మాత్రమే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. కొందరు మధుమేహ లెవల్స్ పెరిగిపోవడంతో కోమాకు చేరుకుని చికిత్సకోసం వచ్చిన వారు ఉన్నారు. అలాంటి వారికి ఇన్సులిన్ థెరఫీద్వారా చికిత్స అందిస్తున్నాం. ఆహార నియమాలు పాటిం చడం, శారీరక వ్యాయామం, ఒత్తిడి లేని జీవన విధానంలో అధిగమించవచ్చు. –డాక్టర్ కె వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణులు -
వయస్సు 18 నెలలు..బరువు 29 కేజీలు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): లెప్టిన్ హార్మోన్ లోపం కారణంగా పాలు తాగే ప్రాయంలోనే బిడ్డ బరువు విపరీతంగా పెరిగిపోయింది. వయస్సు 18 నెలలు వచ్చే సరికి 29 కేజీలకు చేరడంతో శ్యాస తీసుకోవడమే కష్టంగా మారింది. అటువంటి దయనీయ స్థితిలో అమృత్‌సర్‌కు చెందిన దంపతులు రాష్ట్రాలు దాటి చికిత్స కోసం కూతురు చాహత్‌ను తీసుకుని విజయవాడకు వచ్చారు. గతంలో అనేక సర్జరీలను విజయవంతంగా నిర్వహించిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ కొంగర రవికాంత్‌ను సంప్రదించగా, బేరియాట్రిక్ సర్జరీ చేసేందుకు ముందుకొచ్చారు. తన వంతుగా కొన్ని సేవలు ఉచితంగా చేసినా, మందులు, ఇతరత్రా ఖర్చులు సైతం లేకపోవడంతో దాతల నుంచి సహాయం అర్థిస్తున్నారు ఆ నిరుపేద దంపతులు. ప్రస్తుతం పాప చికిత్స పొందుతున్న డోర్నకల్ రోడ్డులోని ఎండోకేర్ ఆస్పత్రిలో శుక్రవారం చాహత్ తండ్రి సూరజ్‌కుమార్ మాట్లాడుతూ తాను అమృత్‌సర్‌లో కేబుల్ మెకానిక్‌గా పనిచేస్తుంటానని తెలిపారు. తొలికాన్పులో నెలరోజులకే మొదటి బిడ్డను పోగొట్టుకున్నామని, రెండో బిడ్డ బరువు రోజురోజుకు పెరుగుతుంటే వైద్యం కోసం యూ ట్యూబ్‌లో సమాచారం తెలుసుకుని ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. నెల రోజుల కిందట ఆస్పత్రికి రాగా ఇప్పటివరకూ వైద్యులు ఉచితంగా చికిత్స చేశారని చెప్పారు. సర్జరీ ఇతరత్రా ఖర్చులు రూ.4 లక్షల వరకూ అవుతాయని చెప్పినట్టు తెలిపారు. దాతలు దయతలచి సాయం చేస్తే జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సాయం అందించే వారు 98880 84583ను సంప్రదించి హిందీలో మాట్లాడాలని ఆయన కోరారు. నెల రోజులుగా ఆహార నియమాలు పాటించినా బరువు తగ్గకపోవడంతో బేరియాట్రిక్ చికిత్స చేయాలని నిర్ణయించినట్టు డాక్టర్ కొంగర రవికాంత్ తెలిపారు. -
భారత్‌లోనే ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవి!
-
భారత్‌లోనే ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవి!
సాక్షి, ముంబై : ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరొందిన ఎమాన్ అహ్మద్ చనిపోవడంపై ముంబైలో ఆమెకు చికిత్స అందించిన వైద్యులు స్పందించారు. ఎమాన్‌ను భారత్ నుంచి అబుదాబికి తీసుకెళ్లడమే ఆమె మృతికి కారణమైందని బేరియాట్రిక్ సర్జన్ అపర్ణా గోవిల్ భాస్కర్ ఆరోపించారు. ఆరోగ్యం పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అయ్యేవరకూ ఎమాన్‌ను ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పినా కుటుంబసభ్యులు మమ్మల్ని నమ్మలేదని చెప్పారు. ఎమాన్ చనిపోవడాన్ని సైఫీ ఆస్పత్రి వైద్యులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. 20 మంది డాక్టర్ల బృందం ఎమాన్‌కు మెరుగైన సేవలు అందించినా చివరివరకూ ఇక్కడే ఉండకపోవడం ఎమాన్ ప్రాణాల్ని బలితీసుకుందన్నారు. ఈజిప్టు, భారత్, గల్ఫ్ ఎమిరేట్స్ దేశాల్లో అధిక బరువుకు చికిత్స తీసుకున్న ఎమాన్ నిన్న (సోమవారం) అబుదాబిలోని బుర్జీల్ ఆస్పత్రిలో చనిపోయారు. అధిక బరువుతో సతమతమవుతున్న 37 ఏళ్ల ఎమాన్.. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీలు పనిచేయకపోవడం వంటి సమస్యలు ఆమె మృతికి ప్రధాన కారణాలయ్యాయి. ట్రీట్మెంట్ కోసం గత ఫిబ్రవరిలో ఈజిప్ట్ నుంచి ముంబైకి వచ్చిన ఆమె బేరియాట్రిక్ సర్జరీతో దాదాపు 330 కిలోల బరువు తగ్గారు. చికిత్స పూర్తికాకముందే ఆమె సోదరి షైమా సెలీమ్ మే నెలలో యూఏఈకి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న ఎమాన్ దురృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయి వార్తల్లో నిలిచారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రి యాలో మంగళవారం ఎమాన్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమాన్ మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
బాల... ఘటోత్కచులు
గాంధీనగర్: అమ్మో! లావంటే లావూ కాదు...ప్రపంచంలోని పిల్లల కంటే లావు. పెద్దమ్మాయి పేరు యోగిత. వయస్సు ఐదేళ్లు. బరువు 34 కిలోలు. రెండో అమ్మాయి పేరు అనిష (ఫొటోలో కుడివైపు). మూడేళ్లు. బరువు 48 కిలోలు. కొడుకు పేరు హర్ష. 18 నెలలు. బరువు 15 కిలోలు. వామ్మో.. వీరు తినే తిండి మోతాదు చూస్తే మనలాంటి వాళ్లకు కళ్లు తిరిగి ఒళ్లు తూలుతుంది. ఇద్దరమ్మాయిలు కలిసి రోజుకు 18 చపాతీలు, రెండున్నర కిలోల రైస్, రెండు బగోన్ల రసం, ఆరు క్రిస్ప్ ప్యాకెట్లు, ఐదు బిస్కట్ ప్యాకెట్లు, 12 అరటి పండ్లు, చెరొక లీటరు పాలు. పిల్లలకు ఇంత తిండి పెట్టి గున్న ఏనుగుల్లా తయారు చేస్తున్న వారి తల్లిదండ్రులను తిట్టాలనిపిస్తుంది. ఎప్పుడు తిండి యావ తప్ప మరో యావలేని ఈ పిల్లలకు తిను పదార్థాలు అందించడంలో క్షణమాత్రం ఆలస్యం చేసినా వారు ఇల్లుపీకి పందిరేస్తారు. అందుకోసం తల్లిదండ్రుల పీక కూడా పట్టుకుంటారు. కేవలం ఈ పిల్లల తిండి ఖర్చులే నెలకు 10వేల రూపాయు అవుతున్నాయిని తండ్రి, గుజరాత్‌కు చె ందిన రమేశ్ భాయ్ నంద్వానా వాపోతున్నాడు. పిల్లలకు వంట చేసి పెట్టడానికే తన జీవితం తెల్లారిపోతోందని తల్లి ప్రజ్ఞా బెన్ వాపోతున్నారు. పిల్లలు ఎందుకు విపరీతంగా తింటూ లావవుతున్నారో తెలుసుకునేందుకు ఈ తల్లిదండ్రులు గుజరాత్‌లోని పలు అస్పత్రులు తిరిగారు.జన్యుపరమైన జబ్బు ‘ప్రాడర్ విల్లీ సిండ్రోమ్ లేదా ఎండోక్రినికల్ డిసీస్’ అయి ఉంటుందని డాక్టర్లు చెప్పారట. అందుకు విరుగుడు ఏమిటో స్థానిక డాక్టర్లు చెప్పలేక పోతున్నారని, ఇప్పటికే వైద్యం కోసం యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టానని, ఇంతకుమించి ఖర్చుపెట్టే పరిస్థితి తనకు లేదని తండ్రి నంద్వానా వాపోతున్నాడు. తాను కూలినాలి చేస్తుంటే నెలకు మూడు, నాలుగువేల రూపాయలకు మించి సంపాదించలేక పోతున్నానని, ఇక వైద్యం ఏం చేయిస్తానని ఆ తండ్రి అంటున్నాడు. పిల్లల తిండి ఖర్చుకు అవుతున్న పదివేల రూపాయలను ఇరుగుపొరుగు నుంచి చేబదులు, మిత్రుల నుంచి సహాయం ద్వారా సేకరిస్తున్నానని, అది కూడా కష్టమవుతుందని చెప్పాడు. పిల్లల్ని పోషించేందుకు, వారికి వైద్యం చేయించేందుకు కిడ్నీ అమ్మాలని నిర్ణయానికొచ్చానంటూ నంద్వానా కన్నీళ్లపర్యంతమయ్యాడు. -
ప్రేమ కోసం 'ఆ మాత్రం' తగ్గలేనా..!