
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్–19 బారిన పడితే ఆరోగ్యకరమైన బరువు కలిగిన వారికన్నా అధిక బరువు కలిగిన వారు 48 శాతం ఎక్కువ మరణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ నియమించిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అధిక బరువు కలిగిన వారు 113 శాతం ఆస్పత్రుల్లో చేరే అవకాశం ఉండగా, వారిలో 74 శాతం మంది ఆక్సిజన్ వెంటిలేటర్లను ఆశ్రయించాల్సి వస్తుందని కూడా ఆ బృందం హెచ్చరించింది. అధిక బరువు కలిగిన వారికి మధుమేహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దానివల్ల వారి రక్తంలో సుగర్ పెరిగితే రక్తం గడ్డలు కట్టే ప్రమాదం ఉందని, పైగా వారి రక్తనాళాలు ఉబ్బిపోయి పెలుసుగా తయారవుతాయని, అధిక బరువు కలిగిన వారిలో రోగనిరోధక శక్తినిచ్చే కణాలు కూడా దెబ్బతింటాయని, అధిక బరువు కారణంగా వారికి వెంటిలేటర్ చికిత్స ఇవ్వడం కూడా కష్టం అవుతుందని, ఇలాంటి కారణాల వల్లనే అధిక బరువు కలిగిన వారు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తల బృందం తెలియజేసింది. (కోవిడ్ సంక్షోభం తర్వాత అనేక అవకాశాలు)
సరిగ్గా ఈ కారణాల వల్లనే కోవిడ్ నిరోధక వ్యాక్సిన్‌లు కూడా వారికి పెద్దగా పని చేయవని ఆ బందం పేర్కొంది. ప్రధానంగా అధిక బరువు కలిగిన వారిలో రోగ నిరోధ వ్యవస్థ సరిగ్గా పని చేయక పోవడం వల్లనే వ్యాక్సిన్ల ప్రభావం వారిపై ఎక్కువగా ఉండదని శాస్త్రవేత్తల బందం తెలిపింది. బ్రిటన్‌లో ప్రతి ముగ్గురు అధిక బరువు కలిగిన వారుకాగా, అమెరికాలో 40 శాతం మంది అధిక బరువు కలిగిన వారున్నారు.
Comments
Please login to add a commentAdd a comment