బటన్స్‌తో బెస్ట్ డిజైన్స్..
ఇంటికి - ఒంటికి
ఒక్కోసారి డ్రెస్ పాడైపోతుంది. కానీ దాని బటన్‌స మాత్రం బాగానే ఉంటాయి. అలాంటప్పుడు వాటిని పడేయడానికి మనసొప్పదు. పడేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగో... ఇలా రకరకాల వస్తువులు తయారు చేయవచ్చు.
1. ఒక బెలూన్‌కి సగం వరకూ గ్లూ రాసి, రంగురంగుల బటన్‌సని అతికించండి. తర్వాత చిన్న సూదితో బెలూన్‌కి రంధ్రం చేసి, గాలిని తీసేయండి. ఆపైన బెలూన్‌ని తీసేస్తే బటన్‌స ఇలా బుట్టలా అవుతాయి.
2. పాతబడిన చెప్పులు, బూట్లను తీసుకుని, గ్లూ రాసి చక్కని బటన్‌సని అతికిస్తే... పాతవే కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి.
3. ఓ దళసరి అట్టను తీసుకుని, అంచుల పక్కనంతా జిగురు రాసి, బటన్‌సని అతి కించండి. దాని చుట్టూ ఫ్రేమ్ బిగిస్తే మంచి ఫొటో ఫ్రేమ్ రెడీ.
4. రంగురంగుల బటన్‌సను దారాలకు ఎక్కించి, కళ కోల్పోయిన చెక్కగూళ్ల చుట్టూ వేళ్లాడదీస్తే సూపర్‌బగా ఉంటుంది.
5. సన్నని వైరు తీసుకుని, దానికి బటన్‌స ఎక్కించి ముడివేయండి. ఓ రిబ్బన్ కట్టి ఎక్కడైనా వేళ్లాడదీస్తే ఎంతో బాగుంటుంది.
6. పాడైపోయిన పర్సుకి కూడా రంగురంగుల బటన్‌సను అతికించి కొత్త రూపం తేవొచ్చు.
7. ఓ పేపర్ మీద ఇలా చెట్టు ఆకారంలోనో, మరో ఆకారంలోనే బటన్‌సని అతికించి, ఫ్రేమ్ కట్టించి వేళ్లాడదీస్తే మీ గోడలకు కొత్త అందం వస్తుంది.