గూడ్స్‌ ఆటోలో రూ. 2.73 కోట్లు | Rs 2.73 Crore Cash Recovered From Goods Vehicle In Karnataka Belagavi, More Details Inside | Sakshi
Sakshi News home page

గూడ్స్‌ ఆటోలో రూ. 2.73 కోట్లు

Published Sun, Oct 20 2024 9:59 AM | Last Updated on Sun, Oct 20 2024 12:19 PM

Rs 2.73 crore cash recovered from goods vehicle in Karnataka

బనశంకరి: ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.2.73 కోట్ల నగదును శనివారం బెళగావి సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లి పట్టణం నుంచి హుబ్లీకి గూడ్స్‌ వాహనంలో నగదును తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు మాళమారుతి ఠాణా పరిధిలో వాహనాన్ని అడ్డుకుని సోదాలు చేయగా నగదు లభించింది. 

సాంగ్లికి చెందిన సచిన్‌ మేనకుదుళె, మారుతి మారగుడె అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నగదును తరలించడానికి వీలుగా వాహనంలో అనేక మార్పులు చేయడం గమనార్హం. ఈ నగదు ఎవరిది అనేదానిపై దర్యాప్తు చేపడుతున్నామని డీసీపీ రోషన్‌ జగదీశ్‌ తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement