నడిగూడెం: తెలంగాణ రాష్ట్రంలోని వారికి ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ సరుకులు కేటారుుంచిన విచిత్ర సంఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. నడిగూడెం మం డలం తెల్లబెల్లి గ్రామంలో ఒక రేషన్‌షాపు ఉంది. ఇక్కడ 524 ఇళ్లున్నాయి. అంత్యోదయ, పింక్ కార్డులు ఉన్నారుు. లబ్ధిదారులు ప్రతి నెలా రేషన్ తీసుకెళ్తున్నారు. మార్చి నెల రేషన్ బియ్యం కోసం షాపునకు వెళ్లగా 20 యూనిట్లకు మాత్రం కోటా కేటారుుంచలేదని డీలర్ తెలిపారు.
దీంతో లబ్ధిదారులు మీసేవ కేంద్రానికి వెళ్లి చూసుకోగా.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డివిజన్ పరిధిలోగల పలు రేషన్‌షాపులకు వీరి కోటా కేటారుుంచినట్లు ఉంది. దీంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకు గ్రామంలోనే సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దారు జక్కంపూడి కార్తీక్‌ను వివరణ కోరగా.. వీరి ఆధార్‌కార్డు నంబర్లు ఆంధ్రాకు జంప్ కావడం వల్ల ఇలా జరిగిందని, ఇలాంటి వారు జిల్లాలో ఐదువేల మంది వరకు ఉంటారని తెలిపారు.
తెలంగాణ వారికి ఆంధ్రాలో రేషన్ కోటా
Published Fri, Mar 18 2016 2:34 AM | Last Updated on Sat, Aug 18 2018 9:09 PM
Advertisement
Advertisement