కాల్ డ్రాప్ పై టెలికం కంపెనీలకు ఊరట | Consumers Can't Claim Compensation For Call Drops: Supreme Court | Sakshi
Sakshi News home page

కాల్ డ్రాప్ పై టెలికం కంపెనీలకు ఊరట

Published Wed, May 11 2016 12:51 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

కాల్ డ్రాప్ పై టెలికం కంపెనీలకు ఊరట - Sakshi

కాల్ డ్రాప్ పై టెలికం కంపెనీలకు ఊరట

న్యూఢిల్లీ:  కాల్‌డ్రాప్ విషయంలో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వినియోగదారుడు  ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కట్ అయితే ఆ కాల్స్‌కు  నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాల్ డ్రాప్ పై టెలికం కంపెనీల నుంచి పరిహారం కోరే విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కోర్టు తీర్పుతో టెలికం కంపెనీలకు ఊరట లభించినట్లు అయింది.

కాగా వినియోగదారులు కాల్ చేసినప్పుడు, ఏ కారణం చేతనైనా ఆ కాల్ కట్ అయితే మొబైల్ ఆపరేటర్లు పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ గత అక్టోబర్‌లో టెలికం కన్సూమర్స్ ప్రొటెక్షన్  రెగ్యులేషన్స్‌కు సవరణ చేసింది. ఒక్కో వినియోగదారుడికి ఒక్కో కాల్‌డ్రాప్‌కు రూ. 1 చొప్పున, రోజుకు రూ.3 మించకుండా పరిహారం చెల్లించాలని నిబంధనలను ట్రాయ్ రూపొందించింది. ట్రాయ్ నిర్ణయాన్ని టెలికం కంపెనీలు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన కోర్టు ట్రాయ్ నిర్ణయాన్ని కొట్టివేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement