ఆహార భద్రతకోసం కొత్త యాప్! | Food regulator launches mobile app for consumers | Sakshi
Sakshi News home page

ఆహార భద్రతకోసం కొత్త యాప్!

Published Mon, Mar 14 2016 10:16 PM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

ఆహార భద్రతకోసం కొత్త యాప్! - Sakshi

ఆహార భద్రతకోసం కొత్త యాప్!

వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరో కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆహార భద్రతను నియంత్రించే ఈ మొబైల్ అనువర్తనాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)  కొత్తగా ప్రారంభించింది. ప్యాక్ చేసిన ఆహారం, ఔట్ లెట్లలో తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని వినియోగించే ముందు... వాటి నాణ్యతకు, భద్రతకు సంబంధించిన వివరాలను ఈ కొత్త యాప్ ద్వారా తెలుసుకునే సౌకర్యం కల్పించింది.

వినియోగదారుల ఆహార భద్రతకు కావలసిన ఫుడ్ సేఫ్టీ చిట్కాలతో పాటు... ఆహార భద్రత చట్టానికి సంబంధించిన వివరాలను ఈ  యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించింది.  కొత్తగా ప్రారంభించిన ఫుడ్ సేఫ్టీ యాప్ ద్వారా వినియోగ దారులు ఆహార భద్రతను గూర్చి తెలుసుకోవడమే కాక, భద్రతాసంబంధమైన సిఫార్సులు చేసేందుకు, సమస్యలను తెలిపేందుకు కూడ అవకాశం కల్పించింది. ఈ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులంతా వినియోగించుకునే అవకాశం ఉంది.

తినేంఉదకు సిద్ధంగా ఉన్న, ప్యాక్ చేసిన ఆహారం అమ్మకందారుల వివరాలతోపాటు,  యాప్ ద్వారా వివరణ అడిగే అధికారం కూడ కల్పించింది. యాండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ కొత్త యాప్ ద్వారా ఆయా వ్యాపారస్తుల  అడ్రస్ తో పాటు, వారికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని ఫొటోలవంటి సాక్ష్యాలతో సహా సమర్పించేందుకు వీలుగా ఈ కొత్త యాప్ ను రూపొందించారు. అంతేకాక ప్రతి ఆహార పదార్థాన్ని కొనే ముందు వినియోగదారులు దాని భద్రత గురించి తెలుసుకునే మరెన్నో వివరాలు ఈ యాప్ లో పొందుపరిచారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement