యాపిల్‌ నుంచి స్మార్ట్‌ వాచ్‌, ఎయిర్‌ఫోన్స్‌ | New Apple Watches To Be Launched Soon | Sakshi
Sakshi News home page

యాపిల్‌ నుంచి స్మార్ట్‌ వాచ్‌, ఎయిర్‌ఫోన్స్‌

Sep 1 2020 9:52 PM | Updated on Sep 1 2020 10:08 PM

New Apple Watches To Be Launched Soon - Sakshi

ముంబై: టెక్‌ దిగ్గజం యాపిల్‌(ఐఫోన్‌) సరికొత్త ఫీచర్లతో మొబైల్‌ వినియోగదారులను నిరంతరం ఆకట్టుకుంటుంది. త్వరలో యాపిల్‌ అభిమానులకు మరో శుభవార్త తెలిపింది. త్వరలో యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌లను మార్కెట్‌లోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే గత సంవత్సరం ప్రత్యేక స్మార్ట్ వ్యాచ్‌(యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 5) లను ప్రవేశ పెట్టిన యాపిల్‌ సంస్థ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం తక్కువ ధర, అత్యుత్తమ క్వాలిటీతో స్మార్ట్ వాచ్‌లను యాపిల్‌ సంస్థ ప్రవేశపెట్టనుంది.

ప్రస్తుతం ఫిట్‌బిట్‌, గార్మిన్‌, తదితర సంస్థలు స్మార్ట్‌ వాచ్‌లను నాణ్యతతో రూపొందిస్తున్నాయి. మరోవైపు యాపిల్‌ కేవలం స్మార్ట్‌ వాచ్‌లనే కాకుండా ఎయిర్‌ఫోన్స్, మ్యూజిక్‌ కేటగిరీలలో కొత్త డివైస్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో హోమ్‌పోడ్‌, ఏయిర్‌పోడ్స్, ప్రొ, ఐపోడ్‌ టచ్‌ తదితర కొత్త సేవలను యాపిల్ అందించనుంది. ఈ అంశాలపై యాపిల్‌ త్వరలో ప్రకటన చేయనుందని సంస్థ వర్గాలు తెలిపాయి.
చదవండి: సరికొత్త ఫీచర్లతో యాపిల్‌ ప్రొడక్టులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement