కల్తీ పెట్రోల్‌ను చూపుతున్న వినియోగదారులు
అడ్డాకుల మహబూబ్‌నగర్ : మండల కేంద్రం శివారులోని పెట్రోల్ బంకులో ఆదివారం ఉదయం కల్తీ పెట్రోల్‌పై వి వాదం ఏర్పడింది. అడ్డాకుల, ముత్యాలంపల్లికి చెందిన కొందరు పెట్రోల్ కోసం బంకు వద్దకు వ చ్చారు. అక్కడ కల్తీ పెట్రోల్ పోయడంతో విని యోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. సీసాల్లో పోయించుకున్న పెట్రోల్‌లో చిన్నచిన్న ఇనుప ము క్కలు కూడా రావడంతో బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
కొత్తగా ఒక పంపును ఈరోజే మొదలు పెట్టడం మూలంగా ఇనుప ముక్కలు వచ్చి ఉండవచ్చని సిబ్బంది సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా వినియోగదారులు వినకుండా బంకు వద్ద ఆందోళనకు దిగారు. బంకులో పెట్రోల్ పోయకుండా అడ్డుకుని పోలీసులకు సమాచారం చేరవేశారు. కానిస్టేబుల్ బాలరాజు అక్కడికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు.
అయితే పోలీసులు ఈ విషయాన్ని తహసీల్దార్ కల్యాణి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె విజిలెన్స్ అధికారులకు సమాచారం చేరవేసి బంకును తాత్కాలికంగా మూసి వేయించాలని చెప్పడంతో పోలీసులు బంకును మూసివేశారు. కొన్నాళ్ల నుంచి ఇక్కడ పెట్రోల్, డీజిల్ తూకాల్లో తేడాలు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment