petrol adulteration
-
వాహనదారులకు షాక్! లీటర్ పెట్రోల్‌లో ఏకంగా 90 శాతం నీరు?
శాయంపేట: పెట్రోల్‌లో నీరు చేరడంతో వాహనాలు మోరాయించాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు వాహనాలు పెట్రోల్ పోసుకున్న అరగంటకే మోరాయించడంతో వాహనదారులు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి యజమానిని ప్రశ్నించారు. దీంతో బంక్ యజమాని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు బాటిల్లో పెట్రోల్ పట్టగా నీరే అధిక శాతం కనిపించింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గంగిరేణిగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గంగిరేణిగూడెంలోని పెట్రోల్ బంక్‌లో బుధవారం ఉదయం పోతు సునీల్, దొంగరి శ్రావణ్, ముక్కెర సురేష్ తమ ద్విచక్రవాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. కాసేపటికే వాహనాలు మోరాయించడంతో మెకానిక్ వద్దకు వెళ్లారు. కల్తీ పెట్రోల్ వల్ల వాహనాలు చెడిపోయాయని చెప్పడంతో పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని యజమాని శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. దీంతో అతడు బుకాయిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని సమస్య విని ఖాళీ వాటర్ బాటిల్లో పెట్రోల్ పోయించగా 90శాతం నీరు, 10శాతం మాత్రం పెట్రోల్ రావడంతో కంగుతిన్నారు. దీంతో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని బంక్ యజమానిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంక్ సీజ్ చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ విషయమై బంక్ యజమాని శ్రీనివాస్‌ను ప్రశ్నించగా మంగళవారం సాయంత్రం కొత్త లోడు వచ్చిందని, ఉదయం నుంచి పెట్రోల్ అమ్మకాలు చేపడుతున్నామని, నీరు ఎలా సింక్ అయిందో తెలియదని తెలిపారు. పెట్రోల్ పోసుకున్న వారి వాహనాలు పాడైతే మర్మమ్మతు చేయించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. -
పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సాక్షి, వెబ్‌డెస్క్: పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే లీటరు పెట్రోలు ధర వంద దాటింది. ఇప్పుడప్పుడే ధర తగ్గుతుందన్న నమ్మకం కూడా లేదు. దీనికి తోడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం లీటరు పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలిపి అమ్ముతున్నారు. కొత్తగా వచ్చిన ఈ మార్పులకు అనుగుణంగా వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జులై 9 నుంచి పెట్రోలు దిగుమతులు తగ్గించడంతో పాటు దేశీయంగా రైతులకు ఉపయోగపడేలా ఇథనాల్ వినియోగం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో రాబోయే ఐదేళ్లలో లీటరు పెట్రోలులో 20 శాతం ఇథనాల్ కలపాలంటూ ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. దీన్ని అనుసరించి జులై 9 నుంచి లీటరు పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలిపి బంకులు అమ్మకాలు సాగిస్తున్నాయి. సాధారణంగా పెట్రోలు, ఇథనాల్ కలపడం వల్ల ఎక్కువ శక్తి విడుదల అవుతుంది. ఇంజన్‌పై పెద్దగా ప్రభావం చూపదు. వాహనం నడిపేప్ప్పుడు పెద్దగా తేడాలు కూడా రావు. అయితే వాహనంలో ఉన్న పెట్రోలు ట్యాంకు నిర్వహాణలో నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. నీటితో ఇబ్బందులు తప్పవు పెట్రోలు, ఇథనాల్లను కలిపినా అవి రెండు వేర్వేరు లేయర్లుగానే ఉండి పోతాయి. నీరు పెట్రోలుతో కలవదు, కానీ ఇథనాల్, నీరు త్వరగా కలిసిపోతాయి. వర్షకాలంలో బైకులు బయట పెట్టినప్పుడు, లేదా వాటర్ సర్వీసింగ్‌కి ఇచ్చినప్పుడు ఒక్క చుక్క నీరు పెట్రోలు ట్యాంకులోకి పోయినా సమస్యలు ఎదురవుతాయి. చిన్నీ నీటి బిందువు, తేమ ఉన్నా సరే ఇథనాల్ వాటితో కలిసి పోతుంది. నీరు, ఇథనాల్ కలిసి ప్రత్యేక పొరగా ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఇంజన్ అకస్మాత్తుగా ఆగిపోతుంది. హైవేలపై, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట ఇలా జరిగితే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. జాగ్రత్తలు పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 10కి చేరడంతో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ పంప్ డీలర్ అసోసియేషన్లు అవగాహన కల్పిస్తున్నాయి. వారు చెప్పిన వివరాల ప్రకారం ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. - పెట్రోలు పంప్ ట్యాంక్ మూతలను సరిగా పరిశీలించాలి. నీటి బిందువులు, తేమ లోపలికి వెళ్లకుండా గట్టిగా బిగించాలి - వాటర్ సర్వీసింగ్ చేసేప్పుడు ట్యాంకులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి - వర్షంలో వాహనాలు ఆపినప్పుడు ట్యాంకుపై నీరు పడకుండా చూసుకోవాలి - ప్రయాణం మధ్యలో వాహనం అకస్మాత్తుగా ఆగిపోతుంటే వెంటనే మెకానిక్‌కి చూపించాలి -
పెట్రోల్‌లో ఇనుప ముక్కలు
అడ్డాకుల మహబూబ్‌నగర్ : మండల కేంద్రం శివారులోని పెట్రోల్ బంకులో ఆదివారం ఉదయం కల్తీ పెట్రోల్‌పై వి వాదం ఏర్పడింది. అడ్డాకుల, ముత్యాలంపల్లికి చెందిన కొందరు పెట్రోల్ కోసం బంకు వద్దకు వ చ్చారు. అక్కడ కల్తీ పెట్రోల్ పోయడంతో విని యోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. సీసాల్లో పోయించుకున్న పెట్రోల్‌లో చిన్నచిన్న ఇనుప ము క్కలు కూడా రావడంతో బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొత్తగా ఒక పంపును ఈరోజే మొదలు పెట్టడం మూలంగా ఇనుప ముక్కలు వచ్చి ఉండవచ్చని సిబ్బంది సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా వినియోగదారులు వినకుండా బంకు వద్ద ఆందోళనకు దిగారు. బంకులో పెట్రోల్ పోయకుండా అడ్డుకుని పోలీసులకు సమాచారం చేరవేశారు. కానిస్టేబుల్ బాలరాజు అక్కడికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని తహసీల్దార్ కల్యాణి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె విజిలెన్స్ అధికారులకు సమాచారం చేరవేసి బంకును తాత్కాలికంగా మూసి వేయించాలని చెప్పడంతో పోలీసులు బంకును మూసివేశారు. కొన్నాళ్ల నుంచి ఇక్కడ పెట్రోల్, డీజిల్ తూకాల్లో తేడాలు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
నీళ్ల పెట్రోల్!
కడప రూరల్: ఇన్నాళ్లు పెట్రోల్‌లో కిరోసిన్‌ను కలిపారు. కాగా కిరోసిన్ ధర కూడా ఇంచుమించు పెట్రోల్ రేట్లతో పోటీ పడుతోంది. దీంతో పెట్రోల్‌లో కిరోసిన్ కల్తీకి దాదాపుగా అడ్డుకట్ట పడింది. తరువాత చౌక ధరలో లభించే రసాయనిక ద్రావణాన్ని కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు పెట్రోల్‌లో నీళ్లను కల్తీగా కలిపే స్థాయికి చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని బైక్ మెకానిక్‌లు కూడా నిర్ధారించడం గమనార్హం. మొరాయిస్తున్న బైక్‌లు... జిల్లా వ్యాప్తంగా వివిధ సంస్థల ఆధ్వర్యంలో 300 పెట్రోల్ బంకులు ఉన్నాయి. కడప నగర పరిధిలో 15కు పైగా పెట్రోల్ బంకులున్నాయి. ఇటీవల మంచి కండీషన్లో ఉన్న కొన్ని బైక్‌లు ఉన్న ఫళంగా మొ రాయిస్తున్నాయి. దీంతో పలువురు మెకా నిక్‌లను సంప్రదించారు. వాహనా లను పరిశీలించిన మెకానిక్‌లు పెట్రోల్‌లో నీళ్లు కలిశాయని గుర్తించారు. ఇలా పలు వాహనాలు మెకానిక్‌ల వద్దకు రావడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. పెట్రోల్‌లో నీళ్లు కలవడం వలన బండి ‘స్టార్ట్’ కాదు. ఇంజన్ హెడ్ వాల్ బెండ్ అవుతుంది. కార్బొరేటర్ చెడిపోతుంది. నీళ్ల కారణంగా పెట్రోల్ ట్యాంక్ చిలుము పడుతుంది. మళ్లీ బైక్ పరిగెత్తాలంటే మరమ్మతులకు రూ.3 వేల వరకు ఖర్ఛువుతుంది. కాగా పెట్రోల్‌లో నీళ్లు పొరపాటున కలిశాయా లేదా ఇదంతా కావాలనే జరుగుతోందా...? అనేది తెలియాల్సి ఉంది. పెట్రోల్‌లో నీళ్లు ఉన్నాయి: పెట్రోల్‌లో నీళ్లు ఉన్న కారణంగా ఈ నెలలోనే చెడిపోయిన బైక్‌లు నా వద్దకు నాలుగు వచ్చాయి. ఇలా జరగడం వలన బండ్లు దెబ్బతింటాయి. వాహనదారుడికి ఖర్చు దండిగా అవుతుంది. – పఠాన్ ఖాదర్‌బాషా,మెకానిక్, జేకే బైక్ పాయింట్ కడప నీళ్ల కల్తీ వాస్తవం కాదు... కాలుష్య నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పెట్రోల్‌లో ‘ఎథనాల్’ అనే కెమికల్‌ను కలుపుతున్నారు. దీనికారణంగా పొరపాటున పెట్రోల్‌కు తేమ తగిలినా, అందులో ఒక నీటి చుక్క పడినా సమస్య వస్తుంది. పెట్రోల్‌లో నీళ్ల కల్తీ జరుతోంది అనేది అవాస్తవం. – నిస్సార్జాన్,జిల్లా అధ్యక్షుడు, పెట్రోల్ బంకుల అసోసియేషన్ -
పెట్రోల్‌లో నీళ్లు కలిపి పోస్తున్నారని..
భువనగిరి(నల్లగొండ): పెట్రోల్ బంక్‌లో కల్తీ పెట్రోల్ పోస్తున్నారని వినియోగదారులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని మంచాల బంక్‌లో పెట్రోల్‌లో నీళ్లు కలిపి పోస్తున్నారని దీని వల్ల తమ వాహనాలు పాడవుతున్నాయని వినియోగదారులు శనివారం ఉదయం పెట్రోల్‌బంక్ వద్ద ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడుతున్నారు. -
పెట్రోల్ కల్తీపై వినియోగదారుల ఆగ్రహం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్‌లో కల్తీ జరుగుతోందంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. పౌర సరఫరాల శాఖ అధికారులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. కనగల్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బుధవారం సాయంత్రం నల్లగొండ దేవరకొండ రోడ్డులోని హెచ్‌పీ బంక్ వద్ద తన బైక్‌లో రూ.500 పెట్రోల్ పోయించుకున్నాడు. అయితే, కొద్దిదూరం వెళ్లేసరికే వాహనం మొరాయించింది. అనుమానం వచ్చిన ఆయన ట్యాంకు కింద ఉండే పైపు ద్వారా పెట్రోల్‌ను బాటిల్లోకి పట్టాడు. పెట్రోల్ పైకి తేలుతుండగాఅడుగున అంతా తెల్లటి పదార్ధం ఉంది. దీనిపై ఆయన మరికొందరితో కలసి బంక్ సిబ్బందిని నిలదీశారు. అయితే, నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమివ్వటంతో పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి బంక్‌ను పరిశీలించి, వివరాలు తెలుసుకుంటున్నారు. -
పెట్రోల్ కల్తీతో అడ్డంగా బుక్కైయాడు