సాక్షి, న్యూఢిల్లీ : ఆన్‌లైన్ రిటైల్ పోర్టల్ స్నాప్‌డీల్ వినియోగదారులకు టోకరా ఇస్తోందని తాజా అథ్యయనం వెల్లడించింది. భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్‌పీలను స్నాప్‌డీల్ పెంచేస్తోందని, కాస్మెటిక్ ఉత్పత్తులపై గడువు తేదీని చూపడం లేదని అహ్మదాబాద్‌కు చెందిన కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్‌సీ) పేర్కొంది.
అధిక ధరలతో, అరకొర లేబిలింగ్‌తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్‌డీల్ ఉపసంహరించేలాచర్యలు చేపట్టాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని సీఈఆర్‌సీ కోరింది. ఇప్పటికే విక్రయించిన హానికారక ఉత్పత్తులను వెనక్కి తీసుకుని వినియోగదారులకు పరిహారం చెల్లించాలని సీఈఆర్‌సీ పిలుపు ఇచ్చింది.
వెండార్లు, ఉత్పత్తుల ఎంపికలో కంపెనీ పారదర్శక విధానం పాటించాలని, పాలసీ ఉల్లంఘనలకు పాల్పడిన వెండార్లపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది. స్నాప్‌డీల్‌లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్‌సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment