కరోనా భయం ప్రపంచాన్ని వణికిస్తోంది. యూఎస్‌లో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. అయితే హరికేన్‌ల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఆహారపదార్థాలను ఎక్కువ మొత్తంలో కొని ఇళ్లలో స్టాక్ పెట్టుకోవడం అక్కడి వాళ్లకు అలవాటు. ఇప్పుడు కూడా పప్పుధాన్యాలు, వాటర్ క్యాన్‌లు, ఫ్రోజెన్ ఫుడ్ విపరీతంగా కొంటున్నారు. హ్యూస్టన్‌లోని ఒక వాల్‌మార్ట్‌లో అయితే గడచిన ఆదివారం బియ్యం దొరకలేదు. బంగాళాదుంపలు, పెరుగుకు కొరత వచ్చేసింది. నూడుల్స్ ర్యాక్‌లు ఖాళీగా ఉంటున్నాయి.
అమెరికా లైఫ్‌సై్టల్‌లో ఆఫీస్ క్యాంటీన్‌లో, రెస్టారెంట్‌లో తింటూ ఇంట్లో రోజుకు ఒకసారి మాత్రమే తింటుంటారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో రోజంతా ఇంట్లోనే తినాలి కాబట్టి ఫుడ్ స్టాక్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటోంది. మనుషులు అవసరం అయితే తప్ప బయటకు రావడం లేదు. గత వారం వరకు గలేరియా మాల్‌లో కూడా చాలా స్టోర్‌లు మూసేశారు. రెండు రోజుల నుంచి గలేరియా మాల్‌ని పూర్తిగా క్లోజ్ చేశారు. రెస్టారెంట్‌లు, బార్‌లు కూడా మూసేయడంతో... అక్కడి వాళ్లు బీర్, ఆల్కహాల్ వంటి డ్రింకులను కూడా కేసుల కొద్దీ కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. మరీ దారుణం ఏమిటంటే... కొంతమంది టిస్యూలు, శానిటైజర్‌లు, నీళ్ల క్యాన్‌లు, ఎగ్స్‌ని పెద్ద మొత్తంలో కొనేసి అవసరమైన వాళ్లకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఈ పని చేస్తున్నది వ్యాపారులు కాదు, మామూలు వాళ్లే.
ఆఫీసుల్లో అయితే అడుగడుగునా శానిటైజర్‌లు కనిపిస్తున్నాయి. రిసెప్షన్, లిఫ్ట్‌తోపాటు ఉద్యోగుల డెస్క్ దగ్గర కూడా ఉంటున్నాయి. కీ బోర్డు, మౌస్‌లను కూడా పని చేసే ముందు శానిటైజర్‌తో తుడుస్తున్నారు. పని చేసేటప్పుడు మధ్యలో మరేదైనా వస్తువును ముట్టుకున్నా సరే... వెంటనే శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. పలకరింపులు కూడా ‘హలో. హాయ్’లే. షేక్ హ్యాండ్స్ లేవు.
కరోనా: తినడం కంటే కొనడం ఎక్కువైంది
Published Sun, Mar 22 2020 9:36 AM | Last Updated on Sun, Mar 22 2020 9:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment