న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీలపై ప్రీమియం పెరగడం వినియోగదారులకు ఆందోళనకు గురి చేస్తున్నట్టు హన్సా రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ప్రీమియం అందుబాటు ధరలో ఉండడం కీలకమని పాలసీదారులు భావిస్తున్నారు. జీవిత బీమా పాలసీల కొనుగోలు నిర్ణయాలు, ప్రవర్తనపరమైన పక్షపాతం, ఆర్థిక అవరోధాలు, ప్రీమియం ధరల అందుబాటు, కొనుగోలుపై దాని ప్రభావం తదితర అంశాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు.
దేశవ్యాప్తంగా 3,300 జీవిత బీమా పాలసీదారులు ఇందులో పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు. పాలసీదారులుగా వారి అభిప్రాయాలను సర్వేలో ప్రశ్నల రూపంలో తెలుసుకున్నారు. బీమా కంపెనీని సంప్రదించినప్పుడు స్పందన సరిగ్గా లేకపోవడం వాటిని వీడడానికి ప్రధాన కారణమని 22 శాతం మంది పాలసీదారులు చెపన్పారు.
తాము పాలసీ కొనుగోలు చేసిన తర్వాత బ్యాంక్ ఆర్‌ఎం లేదా ఏజెంట్ తమను కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా కలవాలని ప్రతీ 10 మందిలో 8 మంది పాలసీదారులు కోరుకుంటున్నారు. డిజిటల్ వేదికల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు పాలసీదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలుకు ముందు వెబ్‌సైట్లను సందర్శించం చేస్తున్నారు. బ్రాండ్‌కు ఉన్న పేరు, డిజిటల్ సేవలు, కస్టమర్ సేవలు కూడా ఆన్‌లైన్‌లో పాలసీలు కొనుగోలు చేసే వారు పరిగణనలోకి తీసుకునే కీలక అంశాలని ఈ సర్వే నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment