సాక్షి, ముంబై: ఆన్‌లైన రీటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పర్యావర్ణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. వినియోగదారులనుంచి ప్లాస్టిక్ సంచులను సేకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తోంది. వ్యవస్థలో ఉన్న ప్లాస్టిక్ ప్యాకేజింగ్లను రీసైకిల్ చేయడంతో పాటు, తిరిగి ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ముప్పుగా పరిణమించుతున్నతరుణంలో ఫ్లిప్‌కార్ట్ ఈ చర్యకు దిగింది.
సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ఇప్పటికే 33 శాతం తగ్గించిన కంపెనీ మార్చి 2021 నాటికి దాని సప్లయ్ చైన్‌లో 100శాతం రీసైకిల్ ప్లాస్టిక్ వినియోగం వైపు వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా చెన్నై, ముంబై, బెంగళూరు, డెహ్రాడూన్, ఢిల్లీ, కోల్‌కతా, పూణే, అహ్మదాబాద్‌లోని ఎంపిక కేంద్రాలలో వినియోగదారుల నుండి ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను తిరిగి సేకరించేందుకు ఫ్లిప్‌కార్ట్ పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద, తమ ప్రొడక్ట్స్ డెలివరీ సమయంలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను స్వచ్ఛందంగా కంపెనీకి చెందిన ఫ్లిప్‌కార్ట్ విష్-మాస్టర్స్‌కు అప్పగించమని వినియోగదారులకు ఒక సమాచారం పంపుతుంది. అంతేకాదు ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు, వివిధ కోణాలను వివరించి, వినియోగదారుల్లో అవగాహనపెంచేందుకు, విష్-మాస్టర్స్‌కు సరైన శిక్షణ కూడా ఇచ్చింది. అలాగే సేకరించిన ప్యాకెట్లు రిజిస్టర్డ్ విక్రేతలకు పంపించి, రీసైకిల్ అయ్యేలా చర్యలు తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment