Collect
-
కంగ్రాట్స్.. నిర్మల!
కర్నూలు కల్చరల్/ఆదోని రూరల్: నిర్మల పోరాట యోధురాలుని, ఆ అమ్మాయి దృఢ సంకల్పం, పోరాట పటిమకు సెల్యూట్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రశంసించారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన నిర్మల 10వ తరతగతిలో మంచి మార్కులు సాధించినప్పటికీ పేదరికంతో తల్లిదండ్రులు చదువు మాన్పించిన సందర్భంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్మలను ఆస్పరి కేజేబీవీలో చేర్పించారు. ఆ విద్యార్థిని ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్‌తో మొదటి సంవత్సరం పరీక్షల్లో 440 మార్కులకు 421 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదివారం నిర్మలను క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బైపీసీ గ్రూప్‌లు ఉన్న 8 కేజీబీవీల్లో నిర్మల టాపర్‌గా నిలవడం అభినందనీయమన్నారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన హనుమంతమ్మ, శ్రీనివాస్ దంపతుల కుమార్తె నిర్మల గురించి నేడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారన్నారు. ఆడపిల్లలకు నిర్మల రోల్‌మోడల్, స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసించారు. ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ దృఢ సంకల్పంతో చదువుకోవాలన్న తన కోరికను నెరవేర్చుకొని ఉన్నత ఆశయంతో ముందుకు వెళుతోందన్నారు. విద్యతోనే సాధికారత లభిస్తుందని ఆడపిల్లలు చదువుకొని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. బేటీ బచావో బేటీ పడావో కింద నిర్మలకు ఇన్సెంటివ్ ఇవ్వాలని ఇంచార్జ్ ఐసీడీఎస్ పీడీని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థిని ఖాతాలో ఇన్సెంటివ్ జమ చేయడం వల్ల ఇంటర్ తరువాత వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా పైచదువులు చదువుకోడానికి ఉపయోగ పడుతుందన్నారు. సమస్యలతో చదువుకోలేక మధ్యలో చదువు ఆపేసిన వారు ఇంకా ఎవరైనా ఉంటే స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించి అలాంటి వారిని ఈ సంవత్సరం కేవీజీబీల్లో అడ్మిషన్ చేయించాలని ఆదేశించారు. నిర్మల సాధించిన ప్రగతి గురించి అందరికి తెలిసేలా సమావేశం నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మలను శాలువాతో సన్మానించి స్వీట్స్ అందజేశారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి జీవితంలో అనేక విజయాలు సాధించాలని సూచించారు. బైపీసీలో 421 మార్కులు సాధించిన నిర్మలతో జిల్ల్లా కలెక్టర్ సృజన, ఇతర అధికారులు కలెక్టర్ చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను.. గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివి 537 మార్కులు సాధించానని, తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలతో చదువు వద్దని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని అయితే తనకు ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లానని నిర్మల తెలిపారు. ఈ విషయం ప్రతికల్లో ప్రచురితమై కలెక్టర్ దృష్టికి వెళ్లడం, కలెక్టర్ మేడం వెంటనే స్పందించి కేజీబీవీలో అడ్మిషన్ ఇప్పించారన్నారు. ఈరోజు ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షల్లో కేజీబీవీల్లో టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాఽశాఖాధికారి శామ్యూల్, సమగ్ర శిక్ష ఏపీసీ విజయ జ్యోతి, ఇన్‌ఛార్జి ఐసీడీఎస్ పీడీ వెంకట లక్ష్మమ్మ, జీసీడీవో సునీత, కేజీబీవీ ఎస్ఓ శరన్‌స్మైలీ, ఆదోని ఎంఈఓ–2 శ్రీనివాసులు, విద్యార్థిని తల్లిదండ్రులు, బందువులు పాల్గొన్నారు. -
అదనపు వనరులపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంతోపాటు అదనపు వనరుల సమీకరణపై దృష్టిపెట్టాలని వివిధ శాఖల అధికారులను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ బకాయిలను వసూలు చేయాలని సూచించారు. బుధవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలసి పరిశ్రమలు, గనులు, భూగర్భ వనరులు, హౌజింగ్ కార్పొరేషన్, బోర్డు, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ఉన్నతాధికారులతో భట్టి సమీక్షించారు. పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏల పరిధిలో ఇప్పటివరకు జరిగిన భూముల అమ్మకాలు, వాటితో రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం, రావాల్సిన బకాయిలు, వాటి వసూలు కోసం కార్యాచరణపై చర్చించారు. ప్రతి పైసా రాబట్టండి ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసానూ సమీకరించే బాధ్యతను ఆయా శాఖల అధికారులు తీసుకోవా లని భట్టి స్పష్టం చేశారు. ఇండ్రస్టియల్ పార్కులను వినియోగంలోకి తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టాలన్నారు. తూప్రాన్ ఇండ్రస్టియల్ పార్కు కోసం ప్రభుత్వం 325 ఎకరాలు కేటాయించగా.. ఇప్పటివరకు 139 ఎకరాలు అప్పగించారని, మిగతా భూమిని సేకరించాల్సి ఉందని అధికారులు వివరించారు. హౌజింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన 12 జాయింట్ వెంచర్లలో 6 పూర్తయ్యాయని.. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.955 కోట్లు రావాల్సి ఉండగా, రూ.430 కోట్లు వచ్చాయని వివరించారు. మైనింగ్ రాయల్టీ ద్వారా రావాల్సిన ఆదాయం, దానిని పెంచుకోవడానికి ఉన్న అవకాశాలపై కూడా గనుల శాఖ అధికారులను మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో గనులు భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత, పరిశ్రమల శాఖ డైరెక్టర్ రెహమాన్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విజయేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వాటిని వెనక్కి తీసుకుంటున్న ఫ్లిప్‌కార్ట్
సాక్షి, ముంబై: ఆన్‌లైన రీటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పర్యావర్ణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. వినియోగదారులనుంచి ప్లాస్టిక్ సంచులను సేకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తోంది. వ్యవస్థలో ఉన్న ప్లాస్టిక్ ప్యాకేజింగ్లను రీసైకిల్ చేయడంతో పాటు, తిరిగి ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ముప్పుగా పరిణమించుతున్నతరుణంలో ఫ్లిప్‌కార్ట్ ఈ చర్యకు దిగింది. సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ఇప్పటికే 33 శాతం తగ్గించిన కంపెనీ మార్చి 2021 నాటికి దాని సప్లయ్ చైన్‌లో 100శాతం రీసైకిల్ ప్లాస్టిక్ వినియోగం వైపు వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా చెన్నై, ముంబై, బెంగళూరు, డెహ్రాడూన్, ఢిల్లీ, కోల్‌కతా, పూణే, అహ్మదాబాద్‌లోని ఎంపిక కేంద్రాలలో వినియోగదారుల నుండి ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను తిరిగి సేకరించేందుకు ఫ్లిప్‌కార్ట్ పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద, తమ ప్రొడక్ట్స్ డెలివరీ సమయంలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను స్వచ్ఛందంగా కంపెనీకి చెందిన ఫ్లిప్‌కార్ట్ విష్-మాస్టర్స్‌కు అప్పగించమని వినియోగదారులకు ఒక సమాచారం పంపుతుంది. అంతేకాదు ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు, వివిధ కోణాలను వివరించి, వినియోగదారుల్లో అవగాహనపెంచేందుకు, విష్-మాస్టర్స్‌కు సరైన శిక్షణ కూడా ఇచ్చింది. అలాగే సేకరించిన ప్యాకెట్లు రిజిస్టర్డ్ విక్రేతలకు పంపించి, రీసైకిల్ అయ్యేలా చర్యలు తీసుకుంటుంది. -
టోల్గేట్ వద్ద స్వైపింగ్ మెషిన్లు
ఉంగుటూరు : పెద్ద నోట్ల రద్దుతో సుమారు 20 రోజులపాటు విశ్రాంతి తీసుకున్న టోల్గేట్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభిం చాయి. దారి సుంకం (టోల్ ఫీ) వసూళ్లను మొదలుపెట్టారు. వీటివద్ద పాతనోట్లు తీసుకోవడం లేదు. ఉంగుటూరు మండలం నాచుగుంట టోల్‌ప్లాజా వద్ల 6 స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేశారు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను అంగీకరిస్తున్నారు. వాహన చోదకుల్లో ఎక్కువ మంది వీటిని ఉపయోగించి నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీంతో టోల్గేట్ల వద్ద చిల్లర సమస్య తీరింది. -
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ అర్బ : జిల్లాలో ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశిం చారు. హన్మకొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆర్డీఓ లు, తహసీల్దార్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణలో జాప్యం జరుగకుండా రైతులు పాస్‌పుస్తకాలు, పట్టాలో ఉన్న రైతుపేరు, కాస్తులో ఉన్న రైతుల పేరు, అసై¯ŒS్డ భూములు, రికార్డుల్లో ఉన్న పొరపాట్లు సరిదిద్దాలని ఆదేశించారు. జాప్యానికి కారణాలు గుర్తించి సత్వరం పరిష్కరించాల న్నారు. ఈ సందర్భంగా రికార్డుల్లో తప్పులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు కలెక్టర్ బోర్డుపై రాస్తూ అధికారులకు వివరించారు. మొత్తంగా రెండు వారాల్లో భూసేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు, జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. హరితహారం మొక్కల సంరక్షణకు ప్రాధాన్యం జిల్లాలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. మంగళ వారం హైదరాబాద్ నుంచి అటవీ,పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్బీ మీనా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 4.37కోట్ల మొక్కల నాటినట్లు తెలిపారు. త్వరలో 4.50 కోట్ల లక్ష్యం చేరుకుంటామని ఆమె చెప్పారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకుంటన్నామన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ 98 శాతం పూర్తయిందని, త్వరలో మిగతాపనులు పూర్తి చేస్తామని అన్నారు. జేసీ ప్రశాంత్ జీవ¯ŒSపాటిల్, డీఎఫ్‌వో శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఇప్పటిదాకా రూ. 50 కోట్ల వరకు వసూళ్లు
-
నిధులు రాబట్టడంలో బాబు విఫలం
-
భూములు ఇష్టపడి ఇస్తేనే సేకరించండి
విజయవాడ బ్యూరో: "రాజధాని కోసం రైతులు ఇష్టపడి భూములిస్తే సంతోషమే. ఇవ్వలేమన్న రైతులను వదిలేయడం మంచిది. కాదని ప్రభుత్వం మొండిగా భూ సేకరణకు దిగితే మాత్రం ఊరుకోను. బాధిత రైతుల పక్షాన పోరాటం చేస్తా, రోడ్డు మీదకొచ్చి జనసేన సత్తా చూపుతా" అని ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు ధైర్యం చెప్పారు. రైతుల కన్నీళ్లతో కొత్త రాజధాని నిర్మాణం మంచిది కాదనీ, 33 వేల ఎకరాల్లో సింగపూర్ తరహా రాజధాని ఏ మేరకు అవసరమో పాలకులు పునస్సమీక్షించుకోవాలని హితవు చెప్పారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఆయన ఉండవల్లి, పెనుమాక, యర్రబాలెం, బేతపూడి, తుళ్లూరు గ్రామాల్లో పర్యటించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు ఏ పార్టీకి చెందిన వారైనా తనకు పట్టింపులేదని, అన్నదాతల భూముల విషయంలో పడుతున్న ఇబ్బందులే తాను పట్టించుకుంటానన్నారు. ఇక్కడికొచ్చే ముందు సీఎంతోనూ, మంత్రులు పుల్లారావు, నారాయణతోనూ మాట్లాడాననీ, రైతులెవరూ నష్టపోకూడదన్నదే తన వాదనగా చెప్పి వచ్చానన్నారు. "భూములివ్వడం ఇష్టం లేని రైతులెవ్వరూ భయపడొద్దు. ప్రభుత్వం భూ సేకరణకు వస్తే పోరాటం చేద్దాం. కాదని మొండికేస్తే ఆమరణదీక్ష చేస్తానని" పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు పోరాడాలి.. యర్రబాలెం, బేత పూడి గ్రామ సభల్లో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదా దక్కకపోతే అది రాష్ట్ర పాలకులు, ప్రజాప్రతినిధుల వైఫల్యమే అవుతుందన్నారు. ఎంపీలందరూ దీనికోసం పోరాటం చేయాలన్నారు. తాను త్వరలోనే ఢిల్లీ వెళ్తాననీ, తెలుగు జాతికిచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెబుతానన్నారు.‘ఏరా...ఆంధ్రా కొడకా’ అని పదేపదే కేసీఆర్ అనే మాటల్ని పడ్డామనీ, కేంద్రం దగ్గరకెళ్లి దేహీదేహీ అని అడిగే పరిస్థితి వద్దన్నారు. అభిమానుల తీరుపై పవన్ తీవ్ర అసంతృప్తి అభిమానుల అత్యుత్సాహం తొక్కిసలాటకు దారితీయడంతో పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గోల చేయొద్దంటూ చేతులెత్తి పదేపదే నమస్కరించినా మాట వినని కుర్రాళ్లపై ఆయన మండిపడ్డారు. ఉండవల్లి సభలో తొక్కిసలాట జరిగింది. ఫలితంగా కుర్చీలు, బారికేడ్లు విరిగిపోయాయి. మహిళలు పరుగులు తీశారు. యర్రబాలెంలో కూడా పవన్‌కు ఈ అనుభవం ఎదురైంది.