టోల్‌గేట్ వద్ద స్వైపింగ్ మెషిన్లు
ఉంగుటూరు : పెద్ద నోట్ల రద్దుతో సుమారు 20 రోజులపాటు విశ్రాంతి తీసుకున్న టోల్‌గేట్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభిం చాయి. దారి సుంకం (టోల్ ఫీ) వసూళ్లను మొదలుపెట్టారు. వీటివద్ద పాతనోట్లు తీసుకోవడం లేదు. ఉంగుటూరు మండలం నాచుగుంట టోల్‌ప్లాజా వద్ల 6 స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేశారు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను అంగీకరిస్తున్నారు. వాహన చోదకుల్లో ఎక్కువ మంది వీటిని ఉపయోగించి నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీంతో టోల్‌గేట్ల వద్ద చిల్లర సమస్య తీరింది.