ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) కస్టమర్ల బంపరాఫర్ ప్రకటించింది. తమ మొబైల్ నెట్‌వర్క్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. ‘ఆజాదీ కా అమృత్ మహాత్సవ్ ప్లాన్ 2022’ లో భాగంగా రూ.2022తో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని, అయితే ఈ ఆఫర్ ఆగస్టు 31 లోపు రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.
ఏముంది ఈ ప్లాన్‌లో..
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్‌లో.. రూ.2022తో రీచార్జ్ చేసుకుంటే 300 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. దీంతో పాటు నెలకు 75GB డేటా కూడా లభిస్తుంది. ఒకవేళ నెలలోపు మీ డేటా పరిమితి నెలలోపు పూర్తయితే స్పీడ్ 40kbps పడిపోతుంది. అలాగే రూ 2399, రూ 2,999 ప్లాన్‌పై అదనంగా మరో 75 జీబీ డేటా ఇస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది.
కాగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఊపరి పోసేందుకు ఇటీవలే కేంద్రం కోటి 64 లక్షల రూపాయల ప్యాకేజీ ప్రకటించడంతో పాటు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ ప్యాకేజీతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కేంద్రం ఆదేశిస్తూ లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
చదవండి: అలర్ట్: మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు, 75శాతం డిస్కౌంట్.. ఈరోజే లాస్ట్!
Comments
Please login to add a commentAdd a comment