losses decreasing
-
బీఎస్ఎన్ఎల్ తగ్గిన నష్టాలు.. పెరిగిన ఆదాయాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ బకాయిల ముందు ఆదాయాలు లేదా ఎబిటా (స్థూల ఆదాయం) 2023–24 ఆర్థిక సంవత్సరానికి 38.8 శాతం పురోగతితో రూ. 2,164 కోట్లకు చేరిందని కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ బుధవారం పార్లమెంటుకు తెలియజేశారు. నష్టాలు రూ. 5,371 కోట్లకు తగ్గాయని వివరించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.8,161 కోట్లు కావడం గమనార్హం. ఆయా అంశాలపై పెమ్మసాని లిఖిత పూర్వకంగా ఇచి్చన సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలు.. డేటా ఉల్లంఘనలు జరగలేదు... బీఎస్ఎన్ఎల్ డేటా ఉల్లంఘన విషయానికి వస్తే, బీఎస్ఎన్లో చొరబాటు డేటా ఉల్లంఘన జరగవచ్చని ఈ ఏడాది మే 20న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) నివేదించింది. దీనిని విశ్లేíÙంచడం జరిగింది. ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ (ఎఫ్టీపీ) సర్వర్‌లో సీఈఆర్టీ–ఇన్ షేర్ చేసిన నమూనా డేటాకు సమానమైన డేటా ఉందని కనగొనడం జరిగింది. టెలికం నెట్వర్క్ హోమ్ లొకేషన్ రిజిస్టర్ (హెచ్ఎల్ఆర్)లో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని స్పష్టమైంది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో సేవలో అంతరాయం కలుగలేదు. అయినప్పటికీ, ఎటువంటి డేటా ఉల్లంఘనలూ జరక్కుడా బీఎస్ఎన్ఎల్ చర్యలు నిరంతరం తీసుకుంటోంది. అన్ని ఎఫ్టీపీ సర్వర్లకు యాక్సెస్ పాస్‌వర్డ్‌ల మార్పులు జరిగాయి. టెలికం నెట్‌వర్క్‌ల ఆడిట్ నిర్వహించడానికి అలాగే టెలికం నెట్‌వర్క్‌లలో డేటా ఉల్లంఘనల నివారణకు పరిష్కార చర్యలను సూచించడానికి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ (ఐఎంసీ)ని ఏర్పాటు చేయడం జరిగింది.→ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు, చర్యల ఫలితంగా 2020–21 ఆర్థిక సంవత్సరం నుండి బీఎస్ఎన్ఎల్ అలాగే ఎంటీఎన్ఎల్ నిర్వహణ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి. → ఆత్మనిర్భర్ భారత్ చొరవకు అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ దేశీయ 4జీ సాంకేతికత విస్తరణ కోసం లక్ష 4జీ సైట్ల కోసం కొనుగోలు ఆర్డర్ చేయడం జరిగింది. ఈ పరికరాలను 5జీకి అప్‌గ్రేడ్ కూడా చేయవచ్చు. → బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 2019లో దాదాపు రూ. 69,000 కోట్ల మొదటి పునరుద్ధరణ ప్యాకేజీ... బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నిర్వహణ ఖర్చులను తగ్గించింది. → 2022లో దాదాపు రూ. 1.64 లక్షల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ మంజూరు జరిగింది. తాజా మూలధనాన్ని చొప్పించడం, రుణాన్ని పునరి్నరి్మంచడం, గ్రామీణ టెలి ఫోనీకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ దీని ఈ ప్యాకేజీ లక్ష్యం. → 2023లో మొత్తం రూ.89,000 కోట్లతో బీఎస్ఎన్ఎల్కు 4జీ అలాగే 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపును ప్రభుత్వం ఆమోదించింది. -
నష్టాలను తగ్గించుకున్న పేటీఎం
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ, పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ డిసెంబర్ త్రైమాసికంలో నష్టాలను రూ.222 కోట్లకు తగ్గించుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర నష్టం రూ.392 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.2,850 కోట్లకు దూసుకుపోయింది. సబ్‌్రస్కిప్షన్ ఆదాయం గణనీయమైన వృద్ధిని చూసిందని, మార్జిన్లు మెరుగుపడ్డాయని, చెల్లింపుల వ్యాపారం ఆదాయం పెరిగినట్టు పేటీఎం ప్రకటించింది. వర్తకులు వినియోగించే పేటీఎం పేమెంట్ డివైజ్‌లు డిసెంబర్ చివరికి 1.06 కోట్లకు పెరిగాయి. పేమెంట్స్ వ్యాపారం ఆదాయం 45 శాతం పెరిగి రూ.1,730 కోట్లు, నికర చెల్లింపుల మార్జిన్ 63 శాతం పెరిగి రూ.748 కోట్లుగా ఉన్నాయి. మర్చంట్స్ పేమెంట్స్ వ్యాల్యూమ్ (జీఎంవీ) 47 శాతం వృద్ధితో రూ.5.10 లక్షల కోట్లకు చేరింది. ఫైనాన్షియల్ సరీ్వసుల ద్వారా ఆదాయం 36 శాతం పెరిగి రూ.607 కోట్లుగా నమోదైంది. డిసెంబర్ త్రైమాసికంలో రూ.15,535 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఇందులో 56 శాతం వృద్ధిని చూపించింది. గడిచిన ఏడాదిలో పేటీఎం ద్వారా రుణాలను తీసుకునే యూజర్లు 44 లక్షలు పెరిగి మొత్తం 1.25 కోట్లకు చేరారు. -
20 వేల దిగువకు నిఫ్టీ
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకు(4%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2%) షేర్ల పతనంతో స్టాక్ సూచీలు బుధవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి (బుధవారం రాత్రి)కి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సైతం సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 796 పాయింట్లు క్షీణించి 66,801 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 232 పాయింట్లు పతనమై 20 వేల స్థాయి దిగువన 19,901 వద్ద నిలిచింది. వెరసి గడిచిన రెండు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్స్, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 868 పాయింట్లు నష్టపోయి 66,728 వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు క్షీణించి 19,879 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,111 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.573 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. సెన్సెక్స్ రెండు రోజుల పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.89 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.320 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం జీవితకాల కనిష్ట స్థాయి (83.32) నుంచి కోలుకుంది. డాలర్ మారకంలో 21 పైసలు బలపడి 83.11 స్థాయి వద్ద స్థిరపడింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడికి ముందు చోటు చేసుకున్న అప్రమత్తతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ నెలకొని ఉంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ... ► ఆర్ ఆర్ కేబుల్ షేరు లిస్టింగ్ పర్లేదనిపించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.1,035)తో పోలిస్తే 14% ప్రీమియంతో రూ.1,179 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 17% ఎగసి రూ.1,213 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 16% లాభంతో 1,197 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,500 కోట్లుగా నమోదైంది. పబ్లిక్ ఇష్యూ ముగిసిన రెండురోజుల్లోనే ఎక్సే్చంజీల్లో లిస్టయ్యి టీ+2 టైంలైన్ విధానంలో లిస్టయిన తొలి కంపెనీగా రికార్డుకెక్కింది. ► చివరి రోజు నాటికి యాత్రా ఆన్లైన్ ఐపీఓకు 1.61 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ 3.09 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా 4.98 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 2.11 రెట్లు సబ్‌్రస్కిప్షన్ సాధించింది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో విలీనం తర్వాత జూలై ఒకటి నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. అలాగే నోమురా బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు రేటింగ్‌ను ‘బై’ నుంచి ‘న్యూట్రల్’కి డౌన్‌గ్రేడ్ చేసింది. దీంతో ఈ బ్యాంకు షేరు 4% నష్టపోయి రూ.1564 వద్ద స్థిరపడింది. షేరు భారీ పతనంతో ఒక్క రోజులోనే దాదాపు రూ.50 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ► ఎంఅండ్ఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్లను అధిగమించింది. ఎస్యూవీ విభాగం, ట్రాక్టర్లకు బలమైన ఆర్డర్లు లభించడం ఇందుకు తోడ్పడిందని కంపెనీ తెలిపింది. బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు రూ.1634 వద్ద ముగిసింది. -
31 శాతం తగ్గిన విస్తారా నష్టాలు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ప్రయివేట్ రంగ విమానయాన కంపెనీ విస్తారా నష్టాలు భారీగా తగ్గాయి. రూ. 1,393 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2021–22) లో నమోదైన రూ. 2,031 కోట్లతో పోలిస్తే 31 శాతంపైగా రికవర్ అయ్యాయి. కార్పొరేట్ వ్యవహారాల శాఖకు దాఖలు చేసిన సమాచారం ప్రకారం టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్(విస్తారా) మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 11,784 కోట్లను తాకింది. దీంతో నష్టాలు భారీగా తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. అయితే నెట్‌వర్త్ రూ. 1,250 కోట్ల నుంచి రూ. 502 కోట్లకు నీరసించింది. దేశీ విమానయాన పరిశ్రమ గతేడాది పటిష్ట వృద్ధిని సాధించినట్లు విస్తారా తెలియజేసింది. కోవిడ్ ముందుస్థాయిని సైతం అధిగమించినట్లు వెల్లడించింది. గత ఆరు నెలల్లో సగటున ప్రతిరోజూ 4 లక్షల మంది ప్రయాణికులు నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఉమ్మడి నష్టం ఇలా.. టాటా గ్రూప్ వెలువరించిన 2022–23 వార్షిక నివేదిక ప్రకారం గతేడాది గ్రూప్‌లోని ఎయిరిండియా, ఎయిరేíÙయా, విస్తారాల ఉమ్మడి నష్టం రూ. 15,532 కోట్లుగా నమోదైంది. వెరసి 2021–22లో నష్టం రూ. 13,838 కోట్లు మాత్రమే. అయితే ఈ కాలంలో మూడు సంస్థల ఆదాయం పుంజుకున్నప్పటికీ ఎయిరిండియా విమానాలు, ఇంజిన్ల నిలుపుదల కారణంగా రూ. 5,000 కోట్లమేర అదనపు ప్రొవిజనింగ్ చేపట్టడంతో ఉమ్మడి నష్టాలు పెరిగాయి. టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం గతేడాది ఎయిరిండియా ఆదాయం రూ. 31,377 కోట్లను దాటగా.. రూ. 11,388 కోట్ల నష్టం నమోదైంది. ఎయిరేíÙయా టర్నోవర్ రూ. 4,310 కోట్లుకాగా.. రూ. 2,750 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మాత్రం గతేడాది రూ. 5,669 కోట్ల ఆదాయం సాధించింది. అంతేకాకుండా రూ. 117 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఆర్‌క్యాప్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని రుణ పరిష్కార ప్రణాళికలకు చేరిన అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్(ఆర్‌క్యాప్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలను భారీగా తగ్గించుకుంది. రూ. 1,488 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,249 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 4,770 కోట్ల నుంచి రూ. 4,436 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 8,982 కోట్ల నుంచి రూ. 5,949 కోట్లకు దిగివచ్చాయి. 2021 నవంబర్ 29న కంపెనీ దివాలా ప్రక్రియకు చేరిన సంగతి తెలిసిందే. ఇక స్టాండెలోన్ నష్టం భారీగా పెరిగి రూ. 1,389 కోట్లను తాకింది. అంతక్రితం కేవలం రూ. 25 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 5 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు తగ్గింది. -
వొడాఫోన్ ఐడియా నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర నష్టాలు తగ్గి రూ. 6,419 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది (2021–22) ఇదే కాలంలో రూ. 6,513 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 3 శాతం పుంజుకుని రూ. 10,507 కోట్లకు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం పెరిగి రూ. 29,298 కోట్లను తాకింది. 2021–22లో రూ. 28,234 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 38,490 కోట్ల నుంచి రూ. 42,134 కోట్లకు బలపడింది. క్యూ4లో వెచ్చించిన రూ. 560 కోట్లతో కలిపి గతేడాదిలో పెట్టుబడి వ్యయాలు రూ. 3,360 కోట్లకు చేరాయి. 2022 డిసెంబర్‌కల్లా రూ. 2,28,890 కోట్లుగా నమోదైన స్థూల రుణభారం మార్చికల్లా రూ.2,09,260 కోట్లకు తగ్గింది. క్యూ4లో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 124 నుంచి బలపడి రూ. 135ను తాకింది. సబ్స్క్రయిబర్ల సంఖ్య 7 శాతం తగ్గి 22.59 కోట్లకు చేరింది. కంపెనీలో ప్రభుత్వ వాటా 33.1 శాతంగా నమోదైంది. స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పుచేసి ప్రభుత్వానికి జారీ చేయడంతో రుణ భారం తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. వొడాఫోన్ ఐడియా షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 7 వద్ద ముగిసింది. -
పేటీఎం నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నష్టాలు తగ్గించుకుంది. కన్సాలిడేటెడ్‌గా రూ.392 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.778 కోట్లతో పోలిస్తే దాదాపు సగం తగ్గినట్టు తెలుస్తోంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 42 శాతం పెరిగి రూ.2,062 కోట్లకు చేరింది. ఈసాప్ వ్యయాలు మినహాయించి చూస్తే డిసెంబర్ త్రైమాసికంలో నిర్వహణ లాభం లక్ష్యాన్ని చేరుకున్నట్టు (ఎబిటా బ్రేక్ ఈవెన్) పేటీఎం వ్యవస్థాపకుడు, సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో దీన్ని చేరుకుంటామని చెప్పగా, అంతకు మూడు త్రైమాసికాల ముందే సాధించినట్టు ప్రకటించారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ ఫలితాలు విడుదలయ్యాయి. -
నష్టాన్ని గణనీయంగా తగ్గించుకున్న జొమాటో
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల స్వీకరణ, డెలివరీ సంస్థ జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నష్టాన్ని గణనీయంగా తగ్గించుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నష్టం రూ.352 కోట్లుగా ఉంటే, తాజాగా అది రూ.67 కోట్లకు పరిమితమైంది. అయితే ఏ రూపంలో నష్టాలు తగ్గాయన్న? సందేహం రావచ్చు. కంపెనీ ఫిట్సో అనే ప్లాట్ఫామ్లో తనకున్న వాటాలను విక్రయించింది. ఈ రూపంలో రూ.316 కోట్లు సమకూరాయి. ఇది మినహాయించి చూస్తే నష్టం రూ.383 కోట్ల నష్టం కార్యకలాపాలపై వచ్చినట్టు తెలుస్తోంది. ఆదాయం సైతం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.609 కోట్ల నుంచి రూ.1,112 కోట్లకు ఎగసింది. వ్యయాలు కూడా రూ.755 కోట్ల నుంచి రూ.1,642 కోట్లకు చేరాయి. ఫుడ్ డెలివరీ విభాగంలో వచ్చే రెండేళ్లలో 400 మిలియన్ డాలర్లు (రూ.3,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. కస్టమర్ డెలివరీ చార్జీలు తగ్గించడం, కరోనా తర్వాత రీఓపెనింగ్ ప్రభావం, డెలివరీ నుంచి రెస్టారెంట్ డైనింగ్ అవుట్‌కు కొంత వ్యాపారం బదిలీ కావడం స్థూల ఆర్డర్ విలువ (జీవోవీ) వృద్ధి బలహీనంగా ఉండడానికి దారితీసినట్టు జొమాటో వివరించింది. జీవోవీ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 84 శాతం అధికంగా, సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 1.7 శాతం పెరిగి రూ.5,500 కోట్లుగా ఉంది. మరింత విస్తరణే లక్ష్యం ‘‘దీర్ఘకాలంలో ఫుడ్ ఆర్డర్, డెలివరీ వ్యాపారం వృద్ధి పట్ల పెద్ద అంచనాలతోనే ఉన్నాం. రెస్టారెంట్ పరిశ్రమలో మార్పులకు అందిస్తున్న సహకారం ద్వారా జొమాటో ప్రయోజనం పొందుతుంది’’ అని జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. మరిన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న తీరుపై స్పందిస్తూ.. తమ వ్యాపారం వృద్ధిని వేగవంతం చేసే వ్యాపారాల్లో మైనారిటీ వాటాల కొనుగోలుకు పెట్టుబడులు కొనసాగిస్తామని చెప్పారు. కంపెనీ బ్యాలన్స్ షీటులో 1.7 బిలియన్ డాలర్లు ఉన్నాయని, నిధుల సమీకరణ అవసరం లేదని స్పష్టం చేశారు. డిసెంబర్ త్రైమాసికంలో అర్బన్పైపర్లో 5 మిలియన్ డాలర్లు, అడోన్మోలో 15 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అంతకుముందు బ్లింకిట్ (గ్రోఫర్), షిప్‌రాకెట్, క్యూర్‌ఫిట్ తదితర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. -
నష్టాల తగ్గింపుపై దృష్టి
సాక్షి, ముంబై: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) నష్టాలు వస్తున్న రూట్లలో బస్సు సేవలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెరిగిన డీజిల్, విడిభాగాల ధరలు, ఉద్యోగుల జీతాల పెంపు, బకాయిలు చెల్లింపు కారణంగా సంస్థపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. ఫలితంగా భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. చాలా మార్గాల్లో కలెక్షన్లు లేక బస్సులన్నీ ఖాళీగా తిరుగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. దీంతో సంస్థను గట్టెక్కించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఆదాయం లేని రూట్లలో విడతల వారీగా బస్సు సేవలు రద్దు చేయడం, రాత్రి వేళల్లో ట్రిప్పులు వేసే బస్సుల చార్జీలు కొంతమేర తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో సంస్థ పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తున్న విషయం తెలిసిందే. 2012లో రూ.292 కోట్లు నష్టాలను చవిచూసింది. 2013లో ఈ నష్టం రూ.428 కోట్లకు చేరుకుంది. ఇది ఏటా పెరుగుతూనే ఉంది. ప్రైవేటు వాహనాల పోటీని ఎదుర్కొనేందుకు ఎమ్మెస్సార్టీసీ చేసిన అనేక ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ వాహనాల కారణంగా ఆర్టీసీకి ప్రయాణికులు దొరకడమే కష్టతరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల కారణంగా 23 వేల ట్రిప్పులకు అసలు ఆదాయమే రావడం లేదు. వీటి కారణంగా ఈ ఏడు ఆర్టీసీకి రూ.330 కోట్ల నష్టం వాటి ల్లింది. సంస్థ నష్టాల బాటలో కూరుకుపోవడానికి ప్రైవేటు వాహనాలే ప్రధాన కారణమని తేలింది. ఈ నేపథ్యంలో రాబడి తక్కువగా నమోదవుతున్న రూట్లలో మెల్లమెల్లగా బస్సులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సు కిలోమీటరు దూరం ప్రయాణానికి రూ.25 చొప్పున ఖర్చవుతుంది. అయితే అనేక రూట్లలో కిలోమీటరుకు రూ.తొమ్మిది మాత్రమే ఆదాయం వస్తోంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా బస్సులు నడపాల్సి వస్తోందని ఆర్టీసీ అధికారి ఒకరు అన్నారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఐదు గంటల మధ్య తిరిగే లగ్జరీ, సెమీ-లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల చార్జీలు ఈ నెల 15 నుంచి కొంతమేర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతీ స్టేజీకి రూ.6.95 వసూలు చేస్తున్నారు. దీన్ని రూపాయి వరకు తగ్గించనున్నారు. ఇలా ప్రతీ ఆరు కిలోమీటర్లకు రూపాయి చొప్పున చార్జీలు తగ్గనున్నాయి. అయితే ఈ నెల 15, ఆ తరువాత తేదీల ప్రయాణానికి ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తగ్గింపు చార్జీల మొత్తాలను ప్రయాణ సమయంలో కండక్టరే బస్సులో చెల్లిస్తాడని అధికారులు వెల్లడించారు.