న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని రుణ పరిష్కార ప్రణాళికలకు చేరిన అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్(ఆర్‌క్యాప్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలను భారీగా తగ్గించుకుంది. రూ. 1,488 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,249 కోట్ల నికర నష్టం నమోదైంది.
మొత్తం ఆదాయం రూ. 4,770 కోట్ల నుంచి రూ. 4,436 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 8,982 కోట్ల నుంచి రూ. 5,949 కోట్లకు దిగివచ్చాయి. 2021 నవంబర్ 29న కంపెనీ దివాలా ప్రక్రియకు చేరిన సంగతి తెలిసిందే. ఇక స్టాండెలోన్ నష్టం భారీగా పెరిగి రూ. 1,389 కోట్లను తాకింది. అంతక్రితం కేవలం రూ. 25 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 5 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment